VZM: జనసేన సభ్యత్వ నమోదు ఈనెల 26 నుంచి ప్రారంభం కానుందని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి తెలిపారు. ఈ సందర్బంగా భోగాపురం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో గ్రామ స్థాయి నుంచి సభ్యత్వ నమోదు ప్రక్రియను విస్తృతంగా చేపట్టాలని, ప్రతి నాయకుడు సమన్వయంతో బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు.
SDPT: కొమురవెల్లిలో చేర్యాల సీఐ రమేశ్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం పోలీసులు అదనపు బలగాలతో ‘ప్లాగ్ మార్చ్’ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. శాంతిభద్రతలు పరిరక్షణ కోసం పోలీసులకు ప్రజలు సహకరించాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
AP: కృష్ణా జిల్లా పామర్రు మండలం డీపీగూడెంలో దారుణం జరిగింది. తండ్రిని కొడుకు మహేష్ కత్తితో పొడిచి చంపాడు. వేడినీళ్ల విషయంలో తండ్రి మందలించాడని ఘాతుకానికి ఒడిగట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
BHNG: జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రీ-సర్వే చేపట్టింది. భువనగిరి చందుపట్ల, బొమ్మలరామారం మునిరాబాద్ గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. డిజిటల్ మ్యాపింగ్ ద్వారా ప్రతి ఇంచు భూమికి హద్దులు నిర్ణయించి, రైతులకు ‘భూధార్’ కార్డులు జారీ చేస్తారు. త్వరలో జిల్లావ్యాప్తంగా ఈ ప్రక్రియ విస్తరించడం ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ఇటీవల భారీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న వాహనదారులకు మహారాష్ట్ర సర్కార్ ఊరట కల్పించింది. ఆ సమయంలో టోల్ చెల్లించిన సుమారు 1.2 లక్షల వాహనాలకు రూ.5.16 కోట్లను తిరిగి చెల్లించనున్నట్లు మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ (MSRDC) ప్రకటించింది. రానున్న వారంలోగా ఈ మొత్తాన్ని నేరుగా వాహనదారుల ఫాస్టాగ్ ఖాతాల్లో జమ చేయనున్నారు.
NLR: బుచ్చి మండలంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఉదయాన్నే ఎనిమిది గంటలకు పరీక్ష కేంద్రాలకు హాజరయ్యారు. అధికారులు హాల్ టికెట్లు క్షుణ్ణంగా పరిశీలించి, విద్యార్థులను లోపలికి అనుమతించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
MDK: మాసాయిపేట మండల కేంద్రంలో వెలసిన శ్రీ రుక్మిణి పాండురంగ విఠలేశ్వర ఆలయ 22వ వార్షికోత్సవం ఈనెల 28న నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కాసుల హరిరంజన్ శర్మ, రఘు శర్మలు తెలిపారు. వార్షికోత్సవం పురస్కరించుకొని శ్రీ రుక్మిణి పాండురంగ విఠలేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, శ్రీ మాధవానంద సరస్వతి స్వామి అనుగ్రహ భాషణం, చక్రి భజన తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,070 పెరిగి రూ.1,61,350కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,900 పెరిగి రూ.1,47,900 పలుకుతోంది. ఇక, కిలో వెండి ధర రూ.10,000 పెరిగి రూ.3 లక్షలకు చేరింది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.
కృష్ణా: కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణ వాటాను ఒక్క చుక్క కూడా వదులుకోబోమని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఆదివారం ముఖ్యమంత్రితో కలిసి దేవాదుల ప్రాజెక్టును పరిశీలించిన ఆయన, వచ్చే రెండేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గోదావరి పరీవాహక ప్రాంతంలో వరి సాగు రికార్డు స్థాయిలో పెరిగిందని తెలిపారు.
విశాఖపట్నంలో 10 రోజులుగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై 41 కేసులు నమోదు చేసినట్లు ఉప రవాణా కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. అనుమతులు లేకుండా నడపడం, పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించడం, పన్నులు చెల్లించకపోవడం వంటి ఉల్లంఘనలు గుర్తించారని చెప్పారు. నిబంధనలు అతిక్రమించిన బస్సులపై రూ.3,52,870 చలానా విధించినట్లు వెల్లడించారు.
AP: తెలంగాణ మాజీ సీఎం KCRపై ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఫైర్ అయ్యారు. KCR, KTR ఏపీలో అడుగుపెడితే తరిమేస్తామని హెచ్చరించారు. BRS పేరుతో రావాలని చూస్తే అడుగుపెట్టనివ్వమని తెలిపారు. కేసీఆర్ హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. బీసీలను ఓసీల్లో చేర్చి KCR పెద్ద తప్పు చేశారని విమర్శించారు. అందుకే కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు ఓడించారని చెప్పారు.
E.G: తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామానికి చెందిన అబ్దుల్ కలాం స్కూల్ విద్యార్థులు కరాటేలో అద్భుత ప్రతిభ చాటారు. నిడదవోలులో జరిగిన మూడవ సౌత్ ఇండియా కరాటే ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో వీరు స్వర్ణ, రజత పతకాలు సాధించారు. ఈ పురస్కారాలను మంత్రి కందుల దుర్గేష్ విద్యార్థులకు అందజేశారు. విద్యార్థుల ప్రతిభపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
PDPL: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సిఎం కప్ 2025- 26 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ఓదెల మండలం దాసరి పద్మా హన్మయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కనగర్తి విద్యార్థిని అక్షిత ప్రతిభ చాటింది. బాక్సింగ్ అండర్-60 వెయిట్ కేటగిరీలో పోటీపడి రజత పతకం సాధించింది. రాష్ట్రస్థాయిలో గెలుపొందడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఓదెల ఎంఈఓ, ఉపాధ్యాయులు అభినందించారు.
NGKL: పుట్టగానే కులోన్మాదానికి బలైతానని పాపం ఆ బిడ్డకు ఏం తెలుసు?, అమ్మ ఒడిలో ఉండాల్సిన ఆ బిడ్డ నేడు కానరాని లోకాలకు వెళ్లింది. 9 నెలలు మోసిన ఆ తల్లి కన్నపేగు ఎంత తల్లడిల్లుతుందో. ఫులే, అంబేడ్కర్ లాంటి మహనీయులు ఎంత మంది పోరాడినా ఇప్పటికీ కుల వివక్ష ప్రాణాలు తీస్తోందన్న దానికి కుమ్మెర ఘటనే ఉదాహరణ అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 400 పాయింట్లు పెరిగి 83,340.08 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 120 పాయింట్లకు పైగా లాభంతో 25728.85 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.73గా ఉంది.