• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ప్రజల సహకారంతోనే స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ సాధ్యం’

E.G: నల్లజర్ల మండలం కృష్ణమ్మగూడెం గ్రామంలో ‘స్వచ్చ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఏర్పాటు చేసిన స్వచ్ఛాంద్ర వాహనాన్ని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రారంభించారు. గ్రామాల పరిశుభ్రతే రాష్ట్రాభివృద్ధికి పునాది అని తెలిపారు. ప్రజల సహకారంతోనే స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ సాధ్యమని పేర్కొన్నారు.

February 21, 2026 / 05:40 PM IST

మార్కెట్‌ను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: ఎమ్మెల్యే

ATP: అనంతపురం నగరంలో శనివారం ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఈ-వేస్ట్ పర్యావరణానికి ప్రమాదకరం కాకూడదని తెలిపారు. మార్కెట్ పరిశుభ్రంగా ఉండటానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 05:40 PM IST

భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం

సుమారు 410 అడుగుల వెడల్పు గల ‘2025 YU15’ గ్రహశకలం గంటకు 34,288 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తోంది. అయితే, ఇది భూమికి చేరువగా వస్తున్నప్పటికీ, ఢీకొనే ప్రమాదం లేదని NASA స్పష్టం చేసింది. ఇది భూమికి సుమారు 5.89 మిలియన్ కిలోమీటర్ల దూరం నుండి వెళ్లనుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కాబట్టి, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు వెల్లడించారు.

February 21, 2026 / 05:40 PM IST

ఉద్యమకారుల పాత్ర కీలకం: గణేష్

HNK: ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం హన్మకొండ జిల్లా అధ్యక్షుడు పొడిశెట్టి గణేష్ అన్నారు. శాయంపేటలో ఆయన మాట్లాడుతూ… ఉద్యమకారులకు ఇంటి స్థలం, పెన్షన్, ఇతర హామీలను నెరవేర్చే దిశగా కృషి చేస్తున్న వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని, స్వరాష్ట్ర సాధనలో ఉద్యమకారుల పాత్ర కీలకమన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్ ఉన్నారు.

February 21, 2026 / 05:39 PM IST

అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం: ఎమ్మెల్యే

BDK: ఇల్లందు నియోజకవర్గం గార్ల గ్రామ పంచాయతీకి మత్స్య శాఖ కింద లైవ్ ఫిష్ వెహికల్ మంజూరు అయింది. శనివారం ఎమ్మెల్యే కోరం కనకయ్య జెండా ఊపి ఆ వాహనాన్ని ప్రారంభించి సంఘం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవాలని లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.

February 21, 2026 / 05:38 PM IST

జిల్లాలో ఇంటర్ పరీక్షలకు డ్రోన్తో నిఘా: ఎస్పీ

KKD: ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా అన్ని కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు SP జి. బిందు మాధవ్ శనివారం తెలిపారు. ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే పరీక్షల్లో డ్రోన్, సోలార్ కెమెరాలతో నిఘా ఉంటుందన్నారు. DHMD, HHMDలతో తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

February 21, 2026 / 05:36 PM IST

18 ఏళ్లు నిండకుండా పెళ్లి చేస్తే కఠిన చర్యలు: డీసీపీవో

ADB: తల్లిదండ్రులు ఆడపిల్లల వయస్సును పరిగణనలోకి తీసుకోకుండా బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్ర అన్నారు. ‘ష్యూర్’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘బాల్య వివాహ విముక్తి ప్రచార రథం’ శనివారం జిల్లా కార్యాలయానికి చేరుకుంది. చట్ట ప్రకారం వివాహానికి అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండి ఉండాలన్నారు.

February 21, 2026 / 05:35 PM IST

చిత్తూరులో రెండు యూనివర్సిటీలు

CTR: చిత్తూరులో త్వరలో రెండు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు కానున్నాయని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తెలిపారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. చిత్తూరు స్మార్ట్ సిటీ డెవలప్‌మెంట్ సొసైటీ సమావేశంలో ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావుతో కలిసి పాల్గొన్నారు.

February 21, 2026 / 05:33 PM IST

ఆలయ పనులను పరిశీలించిన మంత్రి బీసీ

NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ ృమంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. పట్టణంలోని కొండపేట కాలనీలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

February 21, 2026 / 05:32 PM IST

‘మున్సిపల్ కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి’

VZM: మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సీఐటీయు) జిల్లా కమిటీ నాయకుడు దుర్గారావు డిమాండ్ చేశారు. మోయిద జంక్షన్‌లో శనివారం జరిగిన నిరసనలో మాట్లాడుతూ.. గతంలో కుదిరిన ఒప్పందాలకు ఇప్పటివరకు జీవోలు జారీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

February 21, 2026 / 05:31 PM IST

‘యూరియా వాడకంపై రైతులు అపొహలు వీడాలి’

KNR: యూరియా వాడకంపై రైతులు అపొహలు వీడి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం ఆయన మానకొండూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలానికి చెందిన 90 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. యూరియాను అధికంగా వాడితే అధిక దిగుబడి వస్తుందనే అపొహ తీసేయాలని అన్నారు.

February 21, 2026 / 05:31 PM IST

ప్రశాంతంగా పరీక్షలు రాయండి: కలెక్టర్

PPM: జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ థియరీ పరీక్షలకు సంబంధించి సర్వం సిద్ధమని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. విద్యార్థులు అనవసర ఆందోళనకు గురికాకుండా, ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలని కోరుతూ, విద్యార్థులందరికీ ‘ఆల్ ది బెస్ట్’! అంటూ కలెక్టర్ విషెస్ చెప్పారు.

February 21, 2026 / 05:31 PM IST

‘ఎమ్మెల్సీ అనంతభాబును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి’

KRNL: రాష్ట్రంలో సంచలనాన్ని రేపిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై కేసులో సీబీఐ ఆయన భార్యను కూడా ఏ2 ముద్దాయిగా చేర్చిందని సమతా సైనిక్ దళ్ ప్రతినిధి రంగయ్య పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీని పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం జరగకుండా వ్యవస్థలలో సడలింపు చేస్తున్న అనంతబాబు కుటుంబంపై సీబీఐ షాక్ ఇచ్చారన్నారు.

February 21, 2026 / 05:30 PM IST

పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు మోక్షం ఎప్పుడో

MBNR: కౌకుంట్ల మండలం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రాకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న ఫిర్యాదు ఇవ్వాలన్నా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం తక్షణమే సొంత పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

February 21, 2026 / 05:30 PM IST

కలెక్టర్‌తో ఎంపీ రఘురాంరెడ్డి భేటీ

KMM: ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి శనివారం జిల్లా కలెక్టర్ అనుదీప్‌ను కలిశారు. ఆయనకు అదనపు కలెక్టర్ పీ.శ్రీనివాసరెడ్డి పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్‌తో భేటీ అయ్యారు. ఎంపీ నిధుల పనుల పురోగతిపై ఆరా తీశారు. కొత్తగా చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు. ఈజీఎస్ పనులు వేగవంతంగా పూర్తి చేయించాలని సూచించారు.

February 21, 2026 / 05:30 PM IST