• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఇంటర్ విద్యార్థినిలకు డిగ్రీ కోర్సులపై అవగాహన

MHBD: తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బొలగాని రాములు గురుకుల పాఠశాల విద్యార్థినిలకు డిగ్రీ కోర్సులపై అవగాహన కల్పించి తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు పొందాలని తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బొలగాని రాములు సూచించారు. శుక్రవారం గురుకుల పాఠశాల విద్యార్థినిలకు డిగ్రీ కోర్సులపై తెలియజేసి సక్రమమైన పద్ధతిలో బోధన ఉంటుందన్నారు.

February 20, 2026 / 08:38 PM IST

కాంపిటేటివ్ పరీక్షలకు ఐటీడీఏ సహాయం

BDK: జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బీ. రాహుల్ సందర్శించారు. డీఎస్సీ, గ్రూప్-1, గ్రూప్-2 తదితర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు అవసరమైన మెటీరియల్, పుస్తకాలు, ఆన్‌లైన్ క్లాసులకు ఐటీడీఏ తరఫున సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. చండ్రుగొండ, టేకులపల్లి, దమ్మపేట మండలాల్లో గ్రంథాలయాల ఏర్పాటు విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు.

February 20, 2026 / 08:37 PM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. జిల్లా వాసి మృతి

BDK: సారపాకకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి నాగ వెంకట్రెడ్డి(20) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గుంటూరు జాతీయ రహదారిపై బైక్‌పై ప్రయాణిస్తున్న సమయంలో ముందు నిలిచిన వాహనాన్ని ఢీకొని పడిపోగా, వెంటనే వెనుక నుంచి వచ్చిన లారీ అతనిపై దూసుకెళ్లినట్లు సమాచారం. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఈ యువకుడి అకాల మరణంతో కుటుంబసభ్యులు, దిగ్భ్రాంతికి గురయ్యారు.

February 20, 2026 / 08:36 PM IST

బోల్తా పడిన వరి కోత మిషన్

BPT: అద్దంకి నుంచి మేదరమెట్ల వైపు వెళ్తున్న వరి కోత మిషన్ శుక్రవారం బలరామకృష్ణాపురం సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనతో రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకున్న సీఐ సుబ్బరాజు వెంటనే సిబ్బందితో చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేయించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు ధృవీకరించారు.

February 20, 2026 / 08:35 PM IST

మార్చి 15న మెగా జాబ్ మేళా

సత్యసాయి: హిందూపురంలో మార్చి 15న భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో సప్తగిరి డిగ్రీ కళాశాలలో జరిగే ఈ కార్యక్రమంలో 100కు పైగా బహుళ జాతీయ కంపెనీలు పాల్గొంటాయన్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన 18 నుంచి 35 ఏళ్ల యువతీ యువకులు అర్హులని తెలిపారు.

February 20, 2026 / 08:34 PM IST

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు: ఎమ్మెల్యే

NGKL: అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. శుక్రవారం కల్వకుర్తి నియోజకవర్గంలోని మైసిగండిలో ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. నిరుపేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 20, 2026 / 08:34 PM IST

ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టిన సీలేరు ఎస్సై

ASR: జీకేవీధి(మం) సీలేరు ఐటీఐ జంక్షన్ వద్ద శుక్రవారం రాత్రి సీలేరు ఎస్సై ఎండీ యాసిన్ ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆదేశాల మేరకు, గంజాయి రవాణా నియంత్రణతో పాటు, ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతున్న నేపథ్యంలో భాగంగా వాహన తనిఖీలు ముమ్మరం చేశామని ఎస్సై తెలిపారు. ప్రతి వాహనాన్ని నిలిపి వేసి క్షుణ్ణంగా తనిఖీ విడిచి పెట్టారు.

February 20, 2026 / 08:34 PM IST

రాయితీ బియ్యం స్వాధీనం: CI

ADB: ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో కొలిపుర ప్రాంతంలో 7.5 క్వింటల్లా రాయితీ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు CI సునీల్ కుమార్ శుక్రవారం తెలియజేశారు. చిలుకూరి లక్ష్మీ నగర్‌కు చెందిన నిందితుడు షేక్ ఇమ్రాన్ అహ్మద్ ఆటోలో తరలిస్తుండగా పట్టుబడినట్లు వెల్లడించారు. ఆటో స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.

February 20, 2026 / 08:34 PM IST

నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్లపై చర్యలు: కలెక్టర్

NZB: నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో అన్ని ప్రమాణాలు పాటిస్తూ స్కానింగ్ కేంద్రాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలన్నారు.

February 20, 2026 / 08:33 PM IST

భక్తితో మానసిక ప్రశాంతత: నీలం మధు

SRD: భక్తి మార్గం ద్వారానే సంపూర్ణ మానసిక ప్రశాంతత లభిస్తుందని నీలం మధు అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం ఉత్తులూరులో నూతన ఆలయంలో గంగమ్మ తల్లి విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. గ్రామాల్లో ఆధ్యాత్మికత పెరిగితే సోదరభావం వృద్ధి చెందుతుందని, గ్రామాలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.

February 20, 2026 / 08:33 PM IST

T20 WC ఫైనల్ భారత్ vs ఇంగ్లండ్..?

T20 WC ఫైనల్ పోరు భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతుందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ జోస్యం చెప్పాడు. సొంత గడ్డపై ఆడుతున్న భారత్ ఈ టోర్నీలోనే బలమైన జట్టుగా ఉందన్నాడు. అదే సమయంలో ఇంగ్లండ్ కూడా ఫైనల్ చేరుతుందని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ఈ రెండు జట్ల మధ్య జరిగే పోరు క్రికెట్ అభిమానులకు అసలైన టీ20 వినోదాన్ని పంచుతుందని ధీమా వ్యక్తం చేశాడు.

February 20, 2026 / 08:33 PM IST

అక్రమ మద్యంపై ఎక్సైజ్ దాడులు

కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ ఎస్సై శరత్ నేతృత్వంలో శుక్రవారం కన్నారెడ్డి, జప్తి జానకంపల్లి తండాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో సుమారు 6 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

February 20, 2026 / 08:32 PM IST

విద్యార్థులకు ఎగ్జామ్ కిట్స్ పంపిణీ

MDK: తూప్రాన్ పట్టణ బాలుర, బాలికల పాఠశాలలో చదువుతున్న 31 మంది అనాధ, సింగిల్ పేరెంట్స్ విద్యార్థులకు పరీక్ష కిట్స్ అందజేశారు. హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ రవి నాయక్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎగ్జామ్ కిట్స్ పంపిణీ చేశారు. విద్యుత్ శాఖ ఏఈ స్వప్న సహకారంతో విద్యార్థులను గుర్తించి కిట్స్ అందజేసినట్లు వివరించారు.

February 20, 2026 / 08:31 PM IST

నూతన పంచాయతీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే

KNR: శంకరపట్నం మండలం ముత్తారం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ ఘనంగా ప్రారంభించారు. ఈ భవనంతో గ్రామ సభలు, సమావేశాలు, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం మరింత సులభంగా, పారదర్శకంగా జరుగుతాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.

February 20, 2026 / 08:31 PM IST

‘నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి’

ADB: ఈనెల 22న ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించనున్న గురుకుల పాఠశాల అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఉదయం 10 గంటల లోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని కో-ఆర్డినేటర్ లలిత కుమారి శుక్రవారం తెలిపారు. జిల్లాలో మొత్తం 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు తమ వెంట హాల్ టికెట్, ఆధార్ కార్డును తీసుకురావాలని సూచించారు.

February 20, 2026 / 08:31 PM IST