• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పుష్ప-2 తొక్కిసలాట.. ఛార్జిషీట్ రిటర్న్

TG: పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా HYDలోని సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో ఛార్జ్‌షీట్‌ను నాంపల్లి కోర్టు తిప్పి పంపించింది. ఛార్జ్‌షీట్‌లో లోపాలు ఉన్నట్లు కోర్టు గుర్తించింది. హార్డ్‌ డిస్క్‌లు, సీడీలు, పెన్‌ డ్రైవ్‌లు జతపరచకపోవడంతో పోలీసులపై ఫైర్ అయింది.

February 20, 2026 / 05:54 PM IST

బొడ్రాయి ప్రతిష్టలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

MBNR: దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ గ్రామంలో ఇవాళ జరిగిన బొడ్రాయి ప్రతిష్ట పూజా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామాభివృద్ధికి తమ వంతు కృషి చేశామని పేర్కొన్నారు.

February 20, 2026 / 05:52 PM IST

శనగ కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జేసీ

KDP: జిల్లాలో ఏర్పాటు చేసిన 21 శనగ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా సూచించారు. రాజుపాలెం మండలం రైతు సేవా కేంద్రం, ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీలోని కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించారు. కోసిన శనగ పంటను బాగా ఆరబెట్టి, తేమ శాతం 14% లోపు ఉండేలా చూసుకుని కేంద్రాలకు తీసుకురావాలని రైతులను కోరారు.

February 20, 2026 / 05:51 PM IST

అకస్మాత్తుగా ఫోన్లలో బీప్ సౌండ్.. కారణం ఇదే!

దేశ వ్యాప్తంగా ఈరోజు మధ్యాహ్నం ఐఫోన్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు బీప్ శబ్దంతో కూడిన అత్యవసర హెచ్చరిక నోటిఫికేషన్లు వచ్చాయి. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA), టెలికాం శాఖ సంయుక్తంగా ఈ పరీక్షను నిర్వహించాయి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసే సాంకేతికత పనితీరును తనిఖీ చేయడమే దీని ప్రధాన లక్ష్యం. ఇది కేవలం పరీక్ష మాత్రమేనని అధికారులు స్పష్టం చేశారు.

February 20, 2026 / 05:51 PM IST

ఉచితంగా 50 అత్యాధునిక రోబోటిక్ శస్త్రచికిత్సలు

సత్యసాయి: శ్రీ సత్యసాయి మహాప్రస్థానంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో యూరోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, సాయి ఆసుపత్రి సంయుక్తంగా రెండు రోజుల శస్త్రచికిత్స వర్క్‌షాప్‌ను ప్రారంభించాయి. డా. కేశవమూర్తి నేతృత్వంలో సుమారు 50 అత్యాధునిక రోబోటిక్ శస్త్రచికిత్సలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఈ సేవలు నిరుపేదలకు మేలు చేకూరుస్తాయని నిర్వాహకులు తెలిపారు.

February 20, 2026 / 05:50 PM IST

కామారెడ్డికి ఫుడ్ కమిషన్ ఛైర్మన్.. స్వాగతం పలికిన కలెక్టర్

KMR: తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ గోలిశ్రీనివాస్ రెడ్డి శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆయనకు సాదరస్వాగతం పలికారు. కలెక్టరేట్‌కు విచ్చేసిన ఛైర్మన్‌కు కలెక్టర్ పూలమొక్కను అందించి, స్వాగతించారు. జిల్లాలో ఆహార భద్రత చట్టం అమలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై సమీక్ష నిర్వహించనున్నారు.

February 20, 2026 / 05:50 PM IST

వాల్మీకి విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఛైర్మన్

KRNL: ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని మసీదుపురం గ్రామంలో జరిగిన శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రాలయం సొసైటీ ఛైర్మన్ ఎన్. రామకృష్ణ రెడ్డి పాల్గొన్నారు. విగ్రహానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు ఇవాళ నిర్వహించారు. వాల్మీకి మహర్షి బోధనలు యువత ఆచరిస్తే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

February 20, 2026 / 05:50 PM IST

ప్రమాదకరంగా ఉన్న కంపచెట్ల తొలగింపు

NLG: చిట్యాల 8వ వార్డులో కరెంటు వైర్లకు కంప చెట్లు తాకుతూ ప్రమాదకరంగా ఉండడంతో ఆ వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్ సొంత ఖర్చులతో ఇవాళ జేసీబీ సాయంతో తొలగింపజేశారు. వార్డులో ఉన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని, వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు. కాలనీవాసులు మారగోని యాదగిరి, నరసింహ, పెద్దులు, లింగస్వామి అమరోజు మదన్‌లు కౌన్సిలర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

February 20, 2026 / 05:49 PM IST

కడపలో డ్రోన్ నిఘాతో స్పెషల్ డ్రైవ్

కడప నగరంలో గంజాయి, నిషేధిత మత్తు పదార్థాల సేవనం, బహిరంగ మద్యపానం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా పోలీస్ శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో వన్ టౌన్ పరిధిలో డ్రోన్ కెమెరాలతో నింగి నుంచి నిఘా ఉంచుతూ విస్తృత తనిఖీలు నిర్వహించారు.

February 20, 2026 / 05:48 PM IST

‘దశాబ్దాల సొంతింటి కల నెరవేరింద’

NRPT: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా అర్హులైన నిరుపేదలకు గృహాల పంపిణీ కొనసాగుతోంది. ఏనుముల తిరుపతి రెడ్డి సాకారంతో పెదిరిపహాడ్ గ్రామానికి చెందిన చాకలి మల్లేశ్‌కు ఇందిరమ్మ ఇల్లు కేటాయించారు. శుక్రవారం కుటుంబ సభ్యులు ఘనంగా గృహప్రవేశం నిర్వహించారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సొంతింటి కల నెరవేరిందని మల్లేశ్ కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.

February 20, 2026 / 05:46 PM IST

ఏడో తరగతి విద్యార్థిని కన్నుమూత

GDWL: ఆడుతూ పాడుతూ పాఠశాలకు రావాల్సిన చిన్నారి.. అనారోగ్యంతో తిరిగిరాని లోకాలకు వేలింది. మల్దకల్ మండలం సద్దలోనిపల్లి గ్రామానికి చెందిన పేగుల గోపాల్ కుమార్తె చందు(13) శుక్రవారం కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అమరవాయి జడ్పీహెచ్ఎస్ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థిని మరణవార్త తెలియగానే పాఠశాలలో విషాద ఛాయలు అలముకున్నాయి.

February 20, 2026 / 05:46 PM IST

రోడ్డు నిర్మాణానికి రూ.2.53 కోట్ల నిధులు మంజూరు

SDPT: హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామం నుంచి పూస వేర్లపల్లె వరకు తారు రోడ్డు నిర్మాణానికి 2.53 కోట్ల నిధులు మంజూరైనట్లు గ్రామ సర్పంచ్ బంక లక్ష్మీ చందు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రోజున రోడ్డు పనులు ప్రారంభించారు. నిధులు మంజూరు చేసినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

February 20, 2026 / 05:45 PM IST

‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించాలి’

VZM: గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ పట్ల ప్రతి విద్యార్థికి అవగాహన ఉండాలని జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ అన్నారు. మహిళ భద్రతకు అధిక ప్రాధాన్యత కల్పించాలని, వారు ఇచ్చే పిర్యాదులు సత్వరమే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, ఆ మేరకు చర్యలు చేపట్టాలని సూచించారు.

February 20, 2026 / 05:45 PM IST

రైతు సంక్షేమానికి పెద్దపీట: MLA

JN: రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. స్టేషన్ ఘనపూర్లో సబ్సిడీపై అర్హులైన రైతులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవసాయ పనిముట్లను అందజేశారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన రైతులు సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని, దేశానికి వెన్నెముక రైతు అని ఎమ్మెల్యే అన్నారు.

February 20, 2026 / 05:44 PM IST

ఫ్లోరిడా ఎయిర్‌పోర్టుకు ట్రంప్‌ పేరు!

ఫ్లోరిడాలోని పామ్ బీచ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పేరు మారనుంది. దీనికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరును పెట్టనున్నారు. ఇందుకు సంబంధించిన బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ త్వరలోనే దీనిపై సంతకం చేయనున్నారు. అనంతరం ఈ విమానాశ్రయం పేరు మార్పునకు ఫెడరల్ ఏవియేషన్ ఆమోదం కూడా అవసరం.

February 20, 2026 / 05:43 PM IST