ASF: సిర్పూర్(టి) అటవీశాఖ రేంజ్ పరిధిలోనే పెద్దపులి సంచరిస్తోంది. దీంతో అటవీశాఖ అధికారులు వాటి రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. రేంజ్ పరిధిలో సంచరిస్తున్న పెద్దపులులను అధికారులు, టైగర్ ట్రాకర్స్, వాచర్స్ నిత్యం ట్రాకింగ్ చేస్తున్నారు. అటవీ ప్రాంతాలకు పశువులు,మేకలు తీసుకెళ్లద్దని, ఒంటరిగా వెళ్లొద్దని వద్దని సూచిస్తున్నారు.
KMR: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10:30 నుంచి 1:00 వరకు నిర్వహించడం జరుగుతుందని ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రజావాణి కి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
TPT: నాయుడుపేటలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైయ్యాయి. ఇంటర్ మీడియట్ పరీక్షలకు సంబంధించి నాయుడుపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురకుల కళాశాల, శ్రీవేమ, విశ్వం కళాశాలల్లో నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రాలలో మొత్తం 1200మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
VZM: జామిలోని శ్రీ ఎల్లారమ్మ తల్లి జాతర మహోత్సవాల సందర్భంగా అమ్మవారిని వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ జాతర మహోత్సవాలలో భాగంగా సోమవారం తొలేళ్ల ఉత్సవం, మంగళవారం అమ్మవారి జాతర, బుధవారం చిన్న తీర్థం జరుగుతుంది. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
BHPL: కుమ్మెర జాతరలో FEB 18న అగ్రకుల రెడ్ల దాడిలో రెండు నెలల పసిపాప మౌనిక మరణాన్ని నిరసిస్తూ BHPL జిల్లా కేంద్రంలో నిన్న రాత్రి ST, SC, JAC, DSP ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. దోషుల పై బలమైన సెక్షన్లు పెట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో శిక్షించాలని, మౌనిక కుటుంబానికి 50 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కోనసీమ: అమలాపురం ఉపాధి కార్యాలయంలో ఈనెల 26న భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమో విద్యార్హతలు కలిగిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని సూచించారు.
గుంటూరులో నిర్వహించిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే శంకరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యకర్తలకు తానున్నాననే భరోసా కల్పిస్తూ, ప్రతి సోషల్ మీడియా వారియర్‌కు అండగా ఉంటానన్నారు.
KRNL: బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో ఆచార్య ఎన్డీరంగా విశ్వవిద్యాలయం, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి సమన్వయంతో జాతీయ తేనెటీగల మండలి ఆధ్వర్యంలో శాస్త్రీయ తేనేటీగల పెంపకంపై 7 రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కేవీకే సమన్వయకర్త డాక్టర్ కె. రాఘవేంద్రచౌదరి తెలిపారు. ఈనెల 25 నుంచి మార్చి 3వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయన్నారు.
ASR: జీకే వీధి మండలం పేట్రాయి గ్రామంలో ఐదు గిరిజన కుటుంబాలకు చెందిన 7 గురు పిల్లలకు నేటికి ఆధార్ కార్డులు లేవు. పాఠశాలల్లో ప్రవేశానికి ఆధార్ తప్పనిసరి కావడంతో వీరికి చదువు దూరమవుతోంది. గిరిజన బిడ్డల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే స్పందించి వారికి ఆధార్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
VKB: ఏక మామిడిలో వీధిలైట్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. సాయంత్రం అయిందంటే ఇంట్లో నుంచి బయటకు రావాలంటే లైట్లు లేక అపరిచితులును గుర్తించలేకపోతున్నామని వాపోయారు. వేసని సమీపిస్తున్న వేళ విష సర్పాల సంచారం పెరిగిందని, వాటి నుంచి రక్షించుకోవాలంటే వీధి లైట్లు ఉండాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.
NDL: నంద్యాల-గిద్దలూరు నల్లమల అటవీ ప్రాంతంలో ప్రజలు వజ్రాల కోసం అన్వేషణను పునఃప్రారంభించారు. సర్వ నరసింహ స్వామి ఆలయం సమీపంలోని వాగు, వజ్రాల వంక వద్ద రాయలసీమతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఆశావహులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ అన్వేషణతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది.
MBNR: నవాబ్ పేట మండల కేంద్రంలోని మార్కెట్ సమీపంలో సంతు సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు తులసీరామ్ తెలిపారు. మండల పరిధిలోని ఎస్టీ సామాజిక సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం పిలుపునిచ్చారు. ఉత్సవానికి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతారని పేర్కొన్నారు.
అన్నమయ్య: మదనపల్లె కలెక్టరేట్లో సోమవారం PGRS ద్వారా అర్జీలను స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలను కలెక్టరేట్లోని PGRS ద్వారా అందజేయవచ్చునని చెప్పారు.
NGKL: కుమ్మెర మల్లన్న జాతరలో అగ్రకుల వారు జరిపిన దాడిలో మరణించిన చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని డీఎస్పీ కార్యాలయం ఎదుట ఆదివారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. నిందితులను అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి, నష్టపరిహారం ఇవ్వాలన్నారు. బాధితులపై FIR నమోదు చేయడం దుర్మార్గమని ఆగ్రహించారు.
ADB: ఉట్నూర్ మండలంలో సోమవారం ఉదయం షాంపూర్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వాగులో పడింది. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను స్థానికులు వెంటనే రక్షించి 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అజాగ్రత్తా లేదా సాంకేతిక లోపమా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.