• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నిధులపై పారదర్శకత ఉండాలి: మేకల నాగరాజు

SRPT: చెన్నకేశవపురం పంచాయతీ ఆదాయ, వ్యయాల వివరాలను బహిర్గతం చేయాలని బీజేపీ మండల మాజీ ప్రధాన కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. 2024-25 నిధులు, పన్నుల వసూళ్లు, కుక్కల బెడద నివారణ చర్యల వివరాలు కోరుతూ సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా దరఖాస్తు చేసినట్లు ఆయన తెలిపారు. శుక్రవారం రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయాన్ని సందర్శించి ఈ వివరాలు వెల్లడించారు.

February 27, 2026 / 04:30 PM IST

310 మంది విద్యార్థులు గైర్హాజరు

AKP: జిల్లాలో శుక్రవారం జరిగిన 27 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 310 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈవో వినోద్ బాబు తెలిపారు. మొత్తం 3,321 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 3,011 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు.

February 27, 2026 / 04:30 PM IST

మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు

MNCL: చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సుమారు 50 మంది కార్యకర్తలు శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు. వారికి మంత్రి వివేక్ వెంకటస్వామి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వారు పార్టీలో చేరినట్లు తెలిపారు.

February 27, 2026 / 04:30 PM IST

ఎమ్మెల్యే లోకం నాగ మాధవి రేపటి షెడ్యూల్

VZM: నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి శనివారం ఉదయం 8 గంటలకు భోగాపురం మండలం, గుడివాడ పంచాయతీ వద్ద పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం ఉదయం 9:30 గంటలకు ముంజేరు సచివాలయాలకు ట్రైసైకిల్స్ పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయం వారు తెలిపారు.

February 27, 2026 / 04:30 PM IST

ఈతకు వెళ్లి యువకుడు మృతి

KDP: పులివెందుల సమీపంలోని అంబకపల్లె రోడ్డు వద్ద ఉన్న కాలువలో ఈతకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. కొంతసేపటి శ్రమ అనంతరం ఫైర్ సిబ్బంది శుక్రవారం మృతదేహాన్ని కాలువ నుంచి బయటకు తీశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

February 27, 2026 / 04:30 PM IST

జీలకర్రతో గ్యాస్ సమస్యలకు చెక్..!

జీలకర్ర జీర్ణవ్యవస్థను శుభ్రపరచడంలో అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. ఒక గ్లాసు నీటిలో జీలకర్ర వేసి మరిగించి, ఆ కషాయాన్ని తాగితే కడుపులో గ్యాస్ సమస్యలు వెంటనే మాయమవుతాయి. జీలకర్రలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యతో బాధపడేవారికి చాలా అవసరం. వేసవిలో శరీర వేడిని తగ్గించడానికి జీలకర్ర పొడిని మజ్జిగలో కలుపుకుని తాగడం వల్ల శరీరం చల్లబడటమే కాకుండా శక్తి కూడా లభిస్తుంది.

February 27, 2026 / 04:30 PM IST

వైకుంఠధామం పునరుద్ధరణకు కాంగ్రెస్ నాయకుల సహకారం

MDCL: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 276 డివిజన్ ప్రగతి నగర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆలేటి శ్రీనివాస్ రావు సహకారంతో ప్రగతి నగర్ వైకుంఠధామాన్ని పునరుద్ధరణ పనులు చేపట్టారు. పరిరక్షణ కమిటీ సభ్యులు, ఆలేటి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా వైకుంఠధామంలో బోర్ రిఫ్రెషింగ్, కొత్త మోటార్, పూల మొక్కలు పనులు చేపట్టామని తెలిపారు.

February 27, 2026 / 04:29 PM IST

‘అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి’

JGL: ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని పెగడపల్లి మండలం లింగాపూర్ సర్పంచ్ వీరేశం పేర్కొన్నారు. శుక్రవారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాశన, అక్షరాభ్యాసం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. 3-5 సంవత్సరాలలోపు చిన్నారులను తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలన్నారు.

February 27, 2026 / 04:29 PM IST

‘మత్స్య కార్మికులకు ఉపాధి కల్పించేందుకు పథకాలు అమలు’

SRCL: మత్స్య కార్మికులకు ఉపాధి కల్పించేందుకు, ప్రభుత్వం పథకాలు అమలు చేస్తున్నదని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోయినపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామంలో రూ. 8.91 లక్షలతో మంచినీటి చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, శుక్రవారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.

February 27, 2026 / 04:28 PM IST

రైతుల సమస్యలపై కవిత వినతిపత్రం

GDWL: తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గద్వాల నియోజకవర్గంలో రైతుల ఎదుర్కొంటున్న సమస్యలపై రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. శుక్రవారం హైదరాబాదులోని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా ఛైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ.. రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

February 27, 2026 / 04:27 PM IST

సీఎంకు బండి సంజయ్ బహిరంగ లేఖ

KNR: రాష్ట్రంలో రైతు భరోసా నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. యాసంగి ప్రారంభమై రెండు నెలలైన సొమ్ము జమ చేయలేదని విమర్శించారు. ఫిబ్రవరి 4న మున్సిపల్ ఎన్నికల తర్వాత నిధులు వేస్తామని ప్రకటించిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. రాష్ట్రంలో 67 లక్షలకుపైగా రైతులు ఎదురు చూస్తున్నారని తెలిపారు.

February 27, 2026 / 04:26 PM IST

‘కేరళ స్టోరీ 2’ మూవీకి లైన్ క్లియర్

వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ 2’ విడుదలకు కేరళ హైకోర్టులో లైన్ క్లియర్ అయింది. ఈ సినిమా ప్రదర్శనపై గతంలో సింగిల్ బెంచ్ విధించిన స్టేను హైకోర్టు డివిజన్ బెంచ్ తాజాగా కొట్టివేసింది. దీంతో చిత్ర యూనిట్‌కు పెద్ద ఊరట లభించినట్లయింది. వాదోపవాదాల అనంతరం సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోవడంతో, త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

February 27, 2026 / 04:26 PM IST

కలెక్టర్ బాలాజీని కలిసిన ఆర్డీవో

కృష్ణా: రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు మచిలీపట్నం ఆర్డీవోగా సాంబశివరావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్ బాలాజీని, ఆర్డీవో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందించాలని, ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.

February 27, 2026 / 04:26 PM IST

కోనసీమలో ప్రశాంతంగా ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు

కోనసీమ: జిల్లా వ్యాప్తంగా 33 కేంద్రాల్లో శుక్రవారం ఇంటర్ ప్రథమ సంవత్సర బోటనీ, హిస్టరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జనరల్, ఒకేషనల్ విభాగాల్లో మొత్తం 2,487 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 401 మంది గైర్హాజరు కావడంతో 86.11 శాతం హాజరు నమోదైందని అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షల్లో ఎక్కడా ఎటువంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదన్నారు.

February 27, 2026 / 04:26 PM IST

‘రోడ్ సేఫ్టీ ఛాంపియన్ 2026’ అవగాహన కార్యక్రమం

NLG: దేవరకొండ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సీఐ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ‘ఆర్వీఏ లైవ్ రోడ్ సేఫ్టీ ఛాంపియన్-2026’ కార్యక్రమం జరిగింది. సీఐ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. అతివేగం, మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరమని ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని కోరారు.

February 27, 2026 / 04:25 PM IST