AP: లడ్డూ కల్తీ విషయంలో మాజీ సీఎం జగన్ అడ్డంగా వాదిస్తున్నారని మంత్రి భరత్ అన్నారు. హిందుత్వాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. వేంకటేశ్వరస్వామితో పెట్టుకున్నవారు బాగుపడలేదన్నారు. జగన్ స్వామివారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సత్యసాయి: అగలి మండలం మధుడిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆధార్ సంబంధించిన బయోమెట్రిక్ అప్టేట్, ఐరిస్ స్కాన్, పేరు మార్పులు, ఫొటో అప్డేట్, పుట్టిన తేదీ మార్పు, సెల్ నంబరు లింక్, కొత్తగా ఆధార్ కార్డులు ప్రింట్ ఇవ్వనున్నట్లు మీ సేవ నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవ...
WGL: నగరంలోని మున్నూరు కాపు భవన్ ప్రక్కన పాలిటెక్నిక్ భవన నిర్మాణ పనులను ఇవాళ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాజీ ప్రధానమంత్రి నెహ్రూ ఆధ్వర్యంలో నిర్మించిన పాలిటెక్నిక్ కళాశాల భవనం మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రూ. 22 కోట్లతో నిధులు కేటాయించి నూతన భవనాలు ఏర్పాటు సంతోషంగా ఉండని ఆయన అన్నారు.
ATP: పామిడి పంచాయతీ నందు శనివారం నిర్వహించిన ‘స్వచ్ఛంద- స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛరథం వాహనమును ఎంపీడీవో తేజోష్ణ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. ఇంటిలో నిలువ ఉంచిన డ్రై వెస్ట్ ( ప్లాస్టిక్, పేపర్, తదితర) వస్తువులను ఇవ్వడం ద్వారా వారికి నిత్యవసర సరుకులైన బియ్యం, కందిపప్పు అందజేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
RR: కొందుర్గు మండలం లక్ష్మీదేవునిపల్లి గ్రామంలో 25- 27వ తేదీ వరకు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్సీ నవీన్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామస్తులు ఆర్థిక సహాయం కోరగా వెంటనే స్పందించి విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమానికి MLC రూ. 50 వేలు అందజేశారు.దేవాలయాల అభివృద్ధికి సహాయ సహకారాలు ఉంటాయన్నారు.
SKLM: బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ధన్నాన మదన్ నేతృత్వంలో శ్రీకాకుళంలోని అరసవిల్లి జంక్షన్‌లో ఇందిరా భవన్ వద్ద బీజేపీ నాయకులు శనివారం సాయంత్రం నిరసన చేపట్టారు. న్యూఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ ఏఐ సదస్సులో కాంగ్రెస్ యూత్ వింగ్ సభ్యుల ప్రవర్తనను నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధ్యక్షులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సూపర్-8లో భాగంగా భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య రేపు కీలక పోరు జరగనుంది. 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని సౌతాఫ్రికా భావిస్తోంది. మరోవైపు భారత్ తన విజయాల పరంపరను కొనసాగించాలని పట్టుదలతో ఉంది. కాగా, T20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు భారత్‌తో సఫారీలు 7 సార్లు తలపడగా.. 5 సార్లు టీమిండియానే విజయం సాధించింది.
CTR: చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం పుత్తూరు రోడ్డులో మెడికల్ కోడింగ్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభం, పీవీపీఎన్ కళాశాలలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం, ఆఫీస్ బస్టాండ్ వద్ద పార్టీ భవన భూమిపూజ, రాజీవ్ కాలనీలో సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
HNK: నగరంలోని గిరిజన భవన్‌లో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా సేవాలాల్ చిత్రపటం వద్ద MLA కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించారు.
ASF: వాంకిడి మండలం బనార్కోసారలో కుటుంబ సభ్యులు మందలించారనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. SI మహేందర్ వివరాల ప్రకారం.. నాగేషే రవీందర్ మద్యానికి బానిసై పనికి వెళ్లకుండా తిరుగుతుండటంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన అతను ఇంట్లో చీరతో ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
VZM: గంట్లాం గ్రామంలో నివాసం ఉంటున్న చిట్టిబాబు ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో గృహోపకరణాలు, ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోవడంతో కుటుంబానికి ఆస్తి నష్టం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే లోకం నాగ మాధవి శనివారం ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తక్షణ సహాయంగా రూ.15,000 నగదు, సరుకులు ఇచ్చారు.
NRPT: ఈనెల 25 నుంచి మార్చి 16 వరకు జరిగే ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో, ఎలాంటి తప్పులకు తావులేకుండా పరీక్షలు జరగాలని ఆమె ఆదేశించారు. మొదటి సంవత్సరం 4408 మంది, రెండో సంవత్సరం 3783 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.
NGKL: జిల్లాలోని అన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ తాగునీటి సర్వేను పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బిజినేపల్లి మండలం వట్టెం, రామిరెడ్డిపల్లిలో కొనసాగుతున్న మిషన్ భగీరథ తాగునీటి ఇంటింటి సర్వేను శనివారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు.
KMM: రైతులు తమ పత్తిని కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్ చేసుకుని విక్రయించుకోవాలని అధికారులు ఇవాళ సూచించారు. జిల్లాలో 2025-26 సీజన్‌కు సంబంధించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) పత్తి కొనుగోలు గడువును ఫిబ్రవరి 27 వరకు పొడిగించినట్లు ఖమ్మం అదనపు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్ని జిన్నింగ్ మిల్లుల్లో ఈ గడువు వరకు కొనుగోళ్లు జరుగుతాయి.
TG: ఏఐ సమ్మిట్‌కు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ‘ఏఐ సమ్మిట్‌తో ఉద్యోగాలు వస్తే స్వాగతిస్తాం. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలతో దేశానికి నష్టం. ట్రంప్ చేప్పినట్లే మోదీ నడుచుకుంటున్నారు. యువత, రైతుల గురించి మోదీ ఆలోచించడం లేదు. దేశ ప్రజలకు వాస్తవాలు తెలియాలి’ అని పేర్కొన్నారు.