మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘మన శంకరవర ప్రసాద్ గారు’ OTTలోనూ రికార్డుల వేట కొనసాగిస్తోంది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్లలోనే కాదు OTTలో కూడా అదరగుడుతోంది. FEB 11న జీ5లో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ మూవీ తాజాగా 500 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.
PDPL: ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామ శివారులో ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో ఎస్సారెస్పీ కాల్వ వంతెనపై ఆటో, బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటో బోల్తాపడి అద్దాలు పగిలిపోవడంతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆటో డ్రైవర్ వడ్లూరి చిరంజీవి (36), బైక్‌పై ఉన్న గజ్జెల సురేష్ (35) తీవ్రంగా గాయపడగా.. క్షతగాత్రులను పోలీసులు చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించారు.
VKB: పేదలకు వరం ఇందిరమ్మ ఇల్లు అని కొడంగల్ మున్సిపల్ ఛైర్మన్ నందారం ప్రశాంత్ అన్నారు. శుక్రవారం 2వ వార్డులోని ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు చింతకాయల మొగులమ్మ గృహప్రవేశానికి హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
ATP: తెలుగు రాష్ట్రాల్లోని మున్సిపాలిటీల చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి తాడిపత్రి వేదిక కాబోతోంది. తాడిపత్రి మున్సిపాలిటీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్లాంట్‌కు ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి ఈరోజు భూమి పూజ చేయనున్నారు. ఈ ప్లాంట్ అందుబాటులోకి రావడం ద్వారా మున్సిపాలిటీకి నెలకు సుమారు రూ.22 లక్షల విద్యుత్ బిల్లు ఆదా కానుంది.
SRPT: నడిగూడెం మండలం కర్వీరాల క్లస్టర్ పరిధిలోని రైతులందరూ వెంటనే ‘ఫార్మర్ రిజిస్ట్రేషన్’ చేసుకోవాలని ఏఈవో ఉప్పయ్య ఇవ్వాళ సూచించారు. భవిష్యత్తులో పీఎం కిసాన్, రైతు భరోసా పథకాల లబ్ధికి ఇది తప్పనిసరని తెలిపారు. దీని ద్వారా రైతులకు ప్రత్యేక డిజిటల్ గుర్తింపు కార్డు లభిస్తుందని, అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
HNK: వర్దన్నపేట నియోజకవర్గంలో అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు కోరారు. GWMC 45వ డివిజన్ పరిధిలోని తరాలపల్లి గ్రామంలో పోచమ్మతల్లి ఆలయ పునర్నిర్మాణంకు భూమిపూజ, ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి శుక్రవారం MLA భూమిపూజ చేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు.
VSP: గత కొన్ని రోజులగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చోటుచేసుకుంటున్న వరుస సంఘటనల నేపథ్యంలో అధికారులు భద్రతా చర్యలను పటిష్టం చేశారు. గుర్తింపు కార్డు కలిగిన వారిని మాత్రమే విశ్వవిద్యాలయంలోకి అనుమతిస్తున్నారు. విద్యార్థి సంఘాలు ఏబీవీపీ, ఎస్ఎఫ్ఎస్ఐ మధ్య వివాదం, అదేవిధంగా గెస్ట్ ఫ్యాకల్టీ చేసిన నిరాహార దీక్షలు నేపథ్యంలో భద్రతను పటిష్టం చేసినట్లు అధికారులు తెలిపారు.
కామారెడ్డి ఆర్టీసీ డిపో నుంచి జుక్కల్‌కు బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు డిపో మేనేజర్ దినేశ్ తెలిపారు. ప్రయాణికుల రద్దీ, అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు ట్రిప్పులు ఈ బస్సు రాకపోకలు సాగిస్తుందని, ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
BDK: మణుగూరు మండల పరిధిలోని కమలాపురం గ్రామం సమీప గోదావరి నది నుంచి నిత్యం అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామం మీదగానే ట్రాక్టర్లు అదుపు లేకుండా విపరీత వేగంతో సంచరిస్తుండటం తో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక ట్రాక్టర్లు అక్రమ రవాణా కొనసాగిస్తున్నాయని నేడు స్థానికులు చెబుతున్నారు.
SRD: హత్నూర మండలంలోని నాగులదేవుపల్లిలో గురువారం మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి సర్పంచ్ చాముండి శిరీష, సంఘం అధ్యక్షురాలు బాయికాడి లావణ్య శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భ్రమరాంబ, ఉప సర్పంచ్ మాణిక్యం, వార్డు సభ్యులు అరుణ, గణేశ్, మీనా, మాజీ సర్పంచ్ సుధాకర్ పాల్గొన్నారు. మహిళల అభివృద్ధికి ఈ భవనం దోహదపడుతుందని తెలిపారు.
అఫ్గన్ కోచ్‌గా జొనాథన్ ట్రాట్ పదవి కాలం ముగిసిన నేపథ్యంలో ఆయనకు ప్లేయర్లు భావోద్వేగ వీడ్కోలు పలుకుతున్నారు. జద్రాన్ తన POTM అవార్డును ట్రాట్‌కు అంకితం చేశాడు. ట్రాట్ నాలుగేళ్లుగా అఫ్గన్‌ను వెంటుండి నడిపారని, తొలి రోజు నుంచే తమను తీర్చిదిద్దారని నబీ ట్వీట్ చేశాడు. ట్రాట్ కోచింగ్‌లో అద్భుతంగా గడిపామని, ఆయన వెళ్లిపోవడం కష్టంగా ఉందని రషీద్ పేర్కొన్నాడు.
MDK: కౌడిపల్లి స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను మిర్జాపూర్ కాయకల్ప బృందం శుక్రవారం సందర్శించింది. ఆసుపత్రిలో పరిశుభ్రత, పచ్చదనం, వార్డుల నిర్వహణ, రోగులకు అందుతున్న వైద్య సేవలను బృందం సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులతో నేరుగా మాట్లాడి ఆసుపత్రి పనితీరుపై ఆరా తీశారు. వైద్య సేవలు, నిర్వహణ పట్ల సూపరింటెండెంట్ సంతృప్తి వ్యక్తం చేస్తూ డాక్టర్లను అభినందించారు.
GNTR: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లను మంత్రి సవిత సందర్శించారు. జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి, అందుబాటులో ఉన్న స్టాక్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా నూతన డిజైన్లు, నాణ్యమైన ఉత్పత్తులను సమృద్ధిగా నిల్వ ఉంచాలని అధికారులకు ఆదేశించారు.
NGKL: నాగర్ కర్నూల్ పేరు వెనుక చరిత్ర దాగి ఉంది. పూర్వ కాలంలో నాగన, కందన అనే సోదరులు ఈ ప్రాంతాన్ని ఏలేవారని, వారి పేరు మీదుగా దీనికి నాగన-కందనవోలు అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. కాలక్రమంలో వ్యవహారికంలో ఆ పేరు కాస్తా నాగర్ కర్నూల్‌గా రూపాంతరం చెందింది. నల్లమల అడవులు, ప్రాజెక్టులతో అలరారే ఈ ప్రాంతం, స్వరాష్ట్రంలో జిల్లాగా అవతరించింది.
SKLM: రణస్థలం పంచాయతీ పరిధిలోని గొర్లె వీధిలో ఇంటింటికి కొళాయి ద్వారా తాగునీరు అందించే పనులకు శుక్రవారం శంకుస్థాపన జరిగింది. రణస్థలం పంచాయతీ సర్పంచ్ పిన్నింటి వెంకట భానోజీ నాయుడు ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.