ELR: బుట్టాయిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ మనేంద్ర రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. వ్యర్ధాల నిర్వహణ క్రమ పద్ధతిలో చేయాలని అన్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలను బాధ్యతారహితంగా పడేయకూడదని వాటి వాడకం తగ్గించాలని సూచించారు.
ASF: పెంచికల్ పేట్ మండలం బొంబాయి గూడ గ్రామంలో నూతనంగా నిర్మితమైన అభయాంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి MLA హరీష్ బాబు శుక్రవారం హాజరయ్యారు. వేద పండితులు బాచంపల్లి కమలాకర్ శర్మ ఆధ్వర్యంలోప్రతిష్టాపన జరిగింది. యాగశాలను సందర్శించిన MLAకు వేద పండితుల ఆశీర్వచనం అందజేశారు.
ELR: చింతలపూడిలోని PMSHRI ZP హైస్కూల్లో శుక్రవారం పోలీసులు విద్యార్థినీ, విద్యార్థులకు, మత్తు పదార్థాల నివారణ కొరకు, సైబర్ క్రైమ్, పోక్సో యాక్ట్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే, డయల్ 112 లేదా స్థానిక పోలీస్ అధికారులను నేరుగా, ధైర్యంగా సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో ఎస్సై సతీష్ కుమార్ పాల్గొన్నారు.
SDPT: హుస్నాబాద్‌లో ఓ క్రైస్తవ ప్రార్థన మందిరాన్ని అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు కూల్చివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. నిర్వాహకుల ప్రకారం దాదాపు 200 మంది సభ్యులు ఇక్కడ ఆరాధనలు నిర్వహిస్తున్నారు. స్థల వివాదంపై గతంలో కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందన్నారు. ఇప్పటికే పలుమార్లు ధ్వంసం చేసిన మందిరాన్ని మళ్లీ కూల్చివేశారని వాపోయి, బాధ్యులను శిక్షించాలన్నారు.
సంతోష్ శోభన్ నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన రెబెల్ స్టార్ ప్రభాస్, చిత్ర బృందాన్ని కలిసి ప్రత్యేకంగా అభినందించాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ను కలిసిన సంతోష్ శోభన్ ఆ ఫొటోను SMలో షేర్ చేస్తూ.. మొదటి నుంచి తనకు అండగా నిలుస్తున్నందుకు డార్లింగ్‌కు కృతజ్ఞతలు తెలిపాడు.
CTR: పలమనేరు శ్రీ భూనీల కళ్యాణ వెంకటరమణ స్వామి దేవస్థాన మహా సంప్రోక్షణ పూజల్లో పలమనేర్ శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి సతీమణి శ్రీమతి రేణుకా రెడ్డి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన నూతన విమాన గోపుర రాజగోపుర మహా కుంభాభిషేక, స్వామి వారి నవీకరణ జీర్ణోద్ధారణ, అష్ట బంధన పూజల్లో ఆమె పాల్గొన్నారు.
KRNL: పెద్దకడబూరు మండలం కల్లుకుంటలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను టీడీపీ నాయకులు తాయన్న, దాసప్ప రెడ్డి, నరసింహులు, వలి తాతా శుక్రవారం జేసీపీతో ప్రారంభించారు. హరిశ్చంద్రప్ప కాలనీలో వేమారెడ్డి ఇంటి నుంచి తారాపురం నరసింహులు ఇంటి వరకు, లక్ష్మన్న ఇంటి నుంచి బెల్లం బాషా ఇంటి వరకు రెండు రోడ్లను రూ. 10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు.
KMM: మధిర మండలంలోని జాలిముడి మల్లారం వద్ద మధిర డిపోకు చెందిన ఒక ఆర్టీసీ బస్సు ఆపమని సంకేతాలు ఇచ్చినా ఆగకపోవడం స్థానికుల్లో ఆవేదన కలిగిస్తుందని స్థానికులు శుక్రవారం తెలిపారు. వయసు మళ్లిన వృద్ధులు బస్సు ఎక్కేందుకు చేతులు ఊపుతూ ఆపమని సూచించినప్పటికీ, బస్సు కొంత దూరం వెళ్లిపోయిందని అక్కడి ప్రజలు తెలిపారు.
SKLM: ఆమదాలవలసలో ఇవాళ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
ATP: గుత్తి మండలం బసినేపల్లికి చెందిన సులోచన అనే మహిళ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే వైద్య సేవలు అందించారు. 24 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
KRNL: ఆస్పరి మండలం చిన్న హోతూరు గ్రామ పొలాల్లో గాలి మరల (ఫ్యాన్లు) పనులు ప్రారంభించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మరలు నిర్మించేందుకు అన్ని అనుమతులు వచ్చినందుకు పనులు చేపట్టామన్నారు. ఇప్పటికే కొన్ని గాలి మరలు పూర్తయ్యాయని, వ్యవసాయానికి అనుగుణంగా వాటిని నిర్మిస్తున్నామని కాంట్రాక్టర్ తెలిపారు.
AP: అసహ్యంగా మాట్లాడితే కేసులు పెట్టాలి కానీ దాడులు చేస్తారా? అని కూటమి నేతలను వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. గ్రూపులుగా వచ్చి తన ఇంటిపై దాడి చేశారని, ఆ సమయంలో ఇంట్లో తన పిల్లలు, మనవళ్లు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే పారిపోండి అని చెప్పారని విమర్శించారు. ఇంటిపై దాడులు చేయడమే కాక అరెస్ట్ చేసి 18 రోజులు జెలులో పెట్టారని మండిపడ్డారు.
JN: పాలకుర్తి మండలం ముత్తారం గ్రామానికి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు రానున్నారు. నూతన ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, యువకులు, మహిళా నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొనాలని బీఆర్ఎస్ పార్టీ పాలకుర్తి మండల అధ్యక్షుడు పసునూరి నవీన్ కోరారు.
MNCL: శ్రీరాంపూర్ ఏరియాలోని గనులు, విభాగాల్లోని ఉద్యోగుల వివరాలు ఆన్‌లైన్లో నమోదు చేయాలని GM ఎం.శ్రీనివాస్ శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆధార్ నెంబర్లు, ఫోన్ నెంబర్లు, బ్లడ్ గ్రూపు వంటి వివరాలు గనులు, విభాగాలపై సంబంధిత అధికారులకు అందజేయాలన్నారు. లేకపోతే వీరికి మెడికల్ రిఫరెన్స్ ఇవ్వడంలో జాప్యం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
PDPL: రామగుండం మున్సిపల్ పరిధిలోని 45వ డివిజన్లో పారిశుధ్యంపై తగు చర్యలు తీసుకోవాలని 45వ డివిజన్ కార్పొరేటర్ కౌటం సతీష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయనను సంబంధిత డివిజన్ పరిశుద్ధ కార్మికులు మున్సిపల్ కార్మికులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారిని ఆయన సన్మానించి డివిజన్లో పారిశుద్ధ్య సమస్యలు రాకుండా చూసుకోవాలని సూచించారు.