NRML: నూతనంగా ఎన్నికైన నిర్మల్ మున్సిపల్ ఛైర్ పర్సన్ అప్పల కావ్య, వైస్ ఛైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తిలను ట్రస్మా జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ.. విద్యారంగ సమస్యల పరిష్కారానికి సహకరిస్తే చాలా సమస్యలు దూరం అవుతాయని కోరారు.
ASF: తిర్యాణి జడ్పీ పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీలించి, విద్యార్ధులతో మాట్లాడారు. హాజరు శాతం తక్కువగా ఉండటంపై ప్రధానోపాధ్యాయుడు అంజయ్యను వివరణ కోరారు. విద్యార్థులు క్రమం తప్పకుండా బడికి వచ్చేలా చూడాలన్నారు. అనంతరం టీచర్‌లా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు.
SRCL: పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వేములవాడ పట్టణంలో 14, 19 వార్డుల్లో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
TPT: ట్రాఫిక్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ట్రాఫిక్ సిబ్బంది విద్యార్థినులకు హెల్మెట్ ప్రాముఖ్యత, ట్రాఫిక్ నియమాలు, రోడ్డు సంకేతాలు, మైనర్లు వాహనాలు నడపరాదనే చట్టాలపై వివరించారు. మొబైల్ వినియోగం, ప్రమాదాలపై హెచ్చరించారు.
ADB: భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు రాజు శుక్రవారం ఆదిలాబాద్‌లోని సంఘం కార్యాలయంలో మాట్లాడుతూ.. నిర్మాణ రంగంలో పనిచేసే లేబర్ వెల్ఫేర్ బోర్డును ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని ఆరోపించారు. భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23న కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు.
ATP: రంజాన్ మాసంలో వచ్చే తొలి శుక్రవారం (జుమా) నమాజ్‌కు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఇందులో భాగంగా గుత్తి కేబీఎన్ మసీదులో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మసీదు ఇమామ్ హుస్సేన్ మాట్లాడుతూ.. రంజాన్ ప్రాముఖ్యత, ఉపవాసం, దానధర్మాలు ఆధ్యాత్మికత గురించి ప్రత్యేక ఉపన్యాసాలు చేశారు. నమాజ్‌కు పెద్ద సంఖ్యలో ముస్లింలు హాజరయ్యారు.
RR: షాద్‌నగర్‌లోని ప్రధాన చౌరస్తా విస్తరణ పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని కోరుతూ సామాజిక కార్యకర్త రాజు నూతన మున్సిపల్ చైర్మన్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ కౌన్సిల్‌లో ప్రవేశపెట్టే తొలి తీర్మానంలోనే చౌరస్తా విస్తరణ అంశాన్ని చేర్చాలన్నారు.
NLR: బుచ్చి పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం స్వామి అమ్మవార్లకు రథోత్సవం వేడుకగా జరిగింది. రథం లాగేందుకు యువత పోటీ పడ్డారు. అడుగడుగునా స్వామి అమ్మవార్లకు భక్తులు కర్పూర హారతులు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని రథోత్సవాన్ని తిలకించారు.
విజయనగరం స్థానిక పూల్ బాగ్ కాలనీలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవం శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీ అయోధ్య బాలక్ రామ మందిర్ ట్రస్ట్ అధ్యక్షులు కుసుమంచి సుబ్బారావు ఆధ్వర్యంలో అర్చకులు వేకువ జామున సుప్రభాతసేవ, శాంతి హోమం, పూర్ణాహుతి, పూజలు జరిపారు. అనంతరం అన్నసమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సత్యసాయి: హిందూపురం నియోజకవర్గంలోని సడ్లపల్లిలో శ్రీ సూగూరు సీతారామాంజనేయ స్వామి నూతన విగ్రహవిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ విగ్రహ ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ పాల్గొని పూజలు నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ.. ఆలయాలు ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రాలుగా నిలుస్తాయని తెలిపారు.
BDK: ప్రాజెక్టు అధికారి టేకులపల్లిలో గ్రంథాలయ భవనాన్ని కట్టిస్తామని పీవో రాహుల్ చెప్పారు. టేకులపల్లి శాఖ గ్రంథాలయాన్ని శుక్రవారం భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు సందర్శించారు. స్థానిక గ్రంథాలయాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వారితో గ్రంథ పాలకుడు నాగన్న పాల్గొన్నారు.
‘ఎల్లమ్మ’ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. తాజాగా ఈ మూవీపై DSP ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సంగీత దర్శకుడిగా అత్యంత బిజీగా ఉన్నప్పటికీ.. ఈ మూవీ కోసం నెలలో కేవలం 10 రోజులు పనిచేస్తానని చెప్పాడు. అందుకోసం నిర్మాత దిల్ రాజుతో ప్రత్యేక ఒప్పందం కుదర్చుకున్నట్లు తెలిపాడు. ఇక ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు.
TG: రాష్ట్ర నేతల ఢిల్లీ పర్యటన వేళ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. BJPని వీడి కాంగ్రెస్‍లో చేరినప్పుడు తనకు మంత్రి పదవి ఆఫర్ చేశారని.. కానీ తనను పార్టీలోకి తీసుకువచ్చిన సునీల్ కనుగోలు, భట్టి విక్రమార్క, మాణిక్ రావు, మహేశ్ కుమార్ వంటి నేతలు తన పట్ల ప్రవర్తించిన తీరు చాలా అవమానకరంగా ఉందన్నారు.
KDP: బద్వేల్‌లోని పేదలు, కూలీలు నిత్యం ప్రయాణించే వారి ఆకలి తీర్చడమే ధ్యేయంగా మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అద్భుత పథకం ‘అన్న క్యాంటీన్’ అని అన్నారు. అతి తక్కువ ధరకే, అత్యంత నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని గౌరవప్రదమైన రీతిలో అందిస్తూ వేలాది మంది కడుపు నింపుతోందని మున్సిపల్ కమిషనర్ నరసింహ రెడ్డి పేర్కొన్నారు. శుభ్రత, నాణ్యత, ధరలను తనిఖీ చేశారు.
KRNL: అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా ఆస్పరి మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం సీపీఐ మండల కార్యదర్శి విరుపాక్షి మాట్లాడుతూ.. సామాజిక, ఆర్ధిక, రాజకీయ అసమానతలను తీర్చడానికి, కుల, మత, లింగ వివక్షతను నిర్మూలించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు.