SDPT: దుబ్బాక మండలం రామక్కాపేట గ్రామంలోని బాలికల గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ కె. హైమావతి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మధ్యాహ్నం భోజనం సరిగా లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల వసతి చదువుల పట్ల నిర్లక్ష్యం చేయొద్దని ఉపాధ్యాయులకు సూచించారు.
అన్నమయ్య: మదనపల్లిలోని కృష్ణ కళ్యాణ మండపంలో ‘పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్-2026’ కార్యక్రమం శనివారం జరిగింది. BJP పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుష్పలత మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో శిక్షణ తరగతులు నిర్వహించాలని, బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంలో ఈ శిక్షణలు కీలకమని ఆమె సూచించారు.
NRPT: దొంగతనాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం నారాయణపేట ఆర్టీసీ బస్టాండ్, ప్రధాన చౌరస్తాల్లో పోలీస్ సిబ్బందితో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తుల చేతి వేలి ముద్రలను ప్రత్యేక డివైజ్‌తో తనిఖీ చేసినట్లు చెప్పారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
నిర్మల్ పట్టణంలోని 42 వార్డుల ప్రజలు ఆస్తి పన్నును గడువులోగా చెల్లించాలని మున్సిపల్ రెవెన్యూ అధికారి రాజు శనివారం ప్రకటనలో తెలిపారు. పన్నుల వసూలుకు 18 బృందావనం ఏర్పాటు చేశామని ఇందుకోసం వార్డు ఆఫీసర్లు ఇంటింటా తిరుగుతూ పన్నులను వసూలు చేస్తున్నారని ఆయా వార్డ్ ఆఫీసర్లకు తమ పన్నులను చెల్లించి అధికారులకు సహకరించాలని తెలిపారు.
W.G: ఆకివీడు మండలం కుప్పనపూడి గ్రామంలో వైసీపీ ఆకివీడు మండల అధ్యక్షులు నంద్యాల లక్ష్మి సీతారామయ్య స్వగృహం వద్ద శనివారం వేద పండితుల వేద ఆశీర్వచనాలతో గోమాతకు శ్రీమంతం చేశారు. గోమాతను పూజిస్తే సుఖశాంతులు కలుగుతాయని తెలిపారు. నంద్యాల లక్ష్మీ సీతారామయ్య దంపతులు, పవన్ దంపతులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.
సత్యసాయి: పరిగిలోని సేవా మందిర్ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు డ్రగ్స్ నివారణ, రోడ్డు భద్రత, బాల్య వివాహాలు, ఫోక్సో చట్టాలపై డీఎస్పీ నర్సింగప్ప అవగాహన కల్పించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు.
ATP: ఉరవకొండలో గవిమఠం శ్రీ చంద్రమౌలేశ్వర స్వామి రథోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మఠం పీఠాధిపతిని కలిసి ఆశీర్వచనాలు తీసుకున్నారు. రథోత్సవానికి తరలివచ్చిన భక్తులతో ఆయన ముచ్చటించారు.
KDP: ముద్దనూరు పట్టణంలోని డిగ్రీ కళాశాలలో ఈరోజు యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ క్యాంప్ నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, ఆరోగ్యం-భవిష్యత్తుపై ప్రభావం, చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించారు. క్రమశిక్షణతో డ్రగ్ ఫ్రీ జీవనం గడపాలని, అనుమానాస్పద కార్యకలాపాలను పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
KRNL: కోసిగి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీరేణుకా యల్లమ్మ ఆలయాన్ని శనివారం అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబిక లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఆలయంలో ఆయన కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
NLR: సోషల్ మీడియాతో విద్యార్థులు పెడదారిన పడుతున్న సమయంలో అదే వేదికగా తమ సమస్యలు పాలకుల దృష్టికి తీసుకువెళ్తున్న సందర్భాలు జరుగుతున్నాయి. ఇటీవల కొండాపురం(M) గజ్జలవారిపల్లికి విద్యార్థులు రోడ్డు లేదని SM ద్వారా తెలియజేయడంతో పవన్ కళ్యాణ్ స్పందించారు. అదే పందాను అనుసరిస్తూ విద్యార్థులు తమకు రోడ్లు లేవని చేతులెత్తి ముక్కుతూ వీడియో విడుదల చేయడం కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తుంది.
నంద్యాలలోని శ్రీనివాస సెంటర్ నుండి సంజీవ నగర్ సర్కిల్ వరకు జరుగుతున్న రహదారి పనుల వల్ల ఇవాళ తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) నేతలు అధికారుల నిర్లక్ష్యాన్ని విమర్శించారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను మళ్లించాలని కోరారు. పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
SKLM: క్రీడలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతి ఇస్తుందని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. శనివారం సాయంత్రం ఆమదాలవలస మున్సిపాలిటీ జగ్గు శాస్త్ర పేట గ్రామం వద్ద ఉన్న ఎన్టీఆర్ గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో సౌత్ జోన్ నేషనల్ సాఫ్ట్ బాల్ కోచింగ్ క్యాంపెయిన్‌ను స్థానిక ఎమ్మెల్యే రవికుమార్ ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను అందజేశారు.
SRPT: రాబోయే వేసవిలో వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ ఆపరేషన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. నర్సింహులు అధికారులను ఆదేశించారు. శనివారం సూర్యాపేటలోని 60 ఫీట్ల రోడ్డులో నిర్వహించిన ‘ప్రజా బాట’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
BHPL: జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులు, విద్యార్థినులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఇందిరా ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత గల విద్యార్థులు మార్చి 31వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఇందిర సూచించారు.
SRPT: హుజూర్ నగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలు శనివారం ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించారు. హుజూర్ నగర్ మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. విద్యార్థులు రూపొందించిన సైన్స్, విజ్ఞాన నమూనాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తాయని అన్నారు.