PLD: డిజిటల్ ప్రపంచంలో ముప్పు పొంచి ఉందని, ముఖ్యంగా గృహిణులు, వయోవృద్ధులను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసాలు జరుగుతున్నాయని ఎస్పీ కృష్ణారావు తెలిపారు. ఓటీపీలు ఎవరికీ చెప్పకూడదని, పార్ట్ టైమ్ జాబ్స్ ఫిషింగ్ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదివారం సూచించారు. మోసపోయామని గుర్తిస్తే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.
MNCL: జన్నారం మండలంలోని సర్పంచ్‌లకు, వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఉమర్ షరీఫ్, ఎంపీవో జలంధర్ తెలిపారు. మంచిర్యాల మండలంలోని ముల్కాల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం నుంచి సర్పంచ్‌లకు శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. మండలంలోని 10 గ్రామాలలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు పోన్కల్ రైతు వేదికలో శిక్షణ ఉంటుందన్నారు.
TG: మూసీపై ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మూసీ అభివృద్ధి పేరుతో రియల్ ఎస్టేట్ చేస్తున్నారని, రూ.లక్ష కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. మూసీ అభివృద్ధిని తాము అడ్డుకోమని, కానీ పేదల ఇళ్లు కూలుస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని వెల్లడించారు.
TPT: రేణిగుంట మండలం మామండూరు అటవీ ప్రాంతంలోని జలపాతంలో చెన్నైకి చెందిన మణికంఠన్ (27) మునిగి మృతి చెందాడు.స్నేహితుడు శ్రీనివాసన్తో కలిసి బైక్‌పై విహారయాత్రకు వచ్చి జలపాతం వద్ద ఈత కొట్టేందుకు నీటిలోకి దిగాడు. అయితే సుమారు 8 అడుగుల లోతైన గుంటలో మునిగిపోవడంతో బయటకు రాలేకపోయాడు. స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. రేణిగుంట అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
SRD: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పాటవుతున్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని MLA గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ డివిజన్ పరిధిలోని ప్రైడ్ పార్క్ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ఫాల్గొన్నారు.
ELR: జంగారెడ్డిగూడెం స్థానిక బైపాస్‌లో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పారిజాత గిరి వెంకటేశ్వర స్వామి ఆలయ ఆర్చి వద్ద లారీ బోల్తా పడింది. తెలంగాణ వైపు నుంచి రాజమండ్రి సైడ్ వెళ్తున్న లారీ ఆర్చి దగ్గరకి రాగానే అదుపుతప్పి ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ గోవింద్‌కి స్వల్ప గాయాలు అయ్యాయి.
AKP: నర్సీపట్నం శాఖా గ్రంథాలయంలో తేదీ మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. నరసింహారెడ్డి చిత్రపటానికి రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనకు తెలియని స్వాతంత్ర్య సమరయోధులు ఎందరో ఉన్నారని పేర్కొన్నారు.
MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా దరణి మధుకర్, డిప్యూటీ మేయర్‌గా సల్ల రమ్య మహేష్ ఆదివారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్, మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. MLA సహకారంతో కార్పొరేషన్‌ను అభివృద్ధి పథంలో పయనించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
TG: వనపర్తి జిల్లాలో పోలీసులు నకిలీ స్వామిని అరెస్ట్ చేశారు. పెబ్బేరుకు చెందిన దంపతులు అనారోగ్య కారణాలతో దుర్గా సింగ్‌ను ఆశ్రయించారు. ఇంట్లో, వ్యవసాయ పొలంలో గుప్త నిధులు ఉన్నాయని, తీయకపోతే పద్మ చనిపోతుందని నకిలీ స్వామి భయపెట్టాడు. ఇంట్లో గుంత తీసి లక్ష్మీదేవి విగ్రహాన్ని పాతాడు. విగ్రహాన్ని విదేశాల్లో రూ.150 కోట్లకు అమ్ముతానని, బాధితుల వద్ద రూ.40 లక్షలు వసూలు చేశాడు.
MBNR: కోయిలకొండ అంకిళ్ల గ్రామానికి చెందిన కావలి రామచందర్ ముదిరాజ్ తన అభిమాన నేత కేటీఆర్‌ను కలిసేందుకు హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టాడు. కేటీఆర్ నాయకత్వానికి గౌరవం చూపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు తెలిపారు. బంజారాహిల్స్ తెలంగాణ భవన్లో ఆయన కేటీఆర్‌ను కలిసిన తర్వాత మద్దతు తెలపడం లక్ష్యమని చెప్పాడు.
SRCL: జిల్లాలో ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించనున్నట్లు ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ATP: గుంతకల్లులో భారతదేశ తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 68వ వర్ధంతిని నిర్వహించారు. ముందుగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విగ్రహానికి టీడీపీ మండల ఇన్‌ఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. అబుల్ కలాం చేసిన సేవలను కొనియాడారు. విద్యాశాఖ మంత్రిగా విద్యాభివృద్దికి ఎంతగానో కృషి చేశారన్నారు.
JGL: ధర్మపురి మండలం దోనూరు గ్రామంలో శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామి వారి నూతన ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆదివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ. 5 లక్షలు నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
KDP: కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళల శ్రేయస్సు కోసం ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మీ పథకం మార్చి నెలలో శ్రీకారం చుట్టనుంది. దీని కింద డ్వాక్రా మహిళల కుటుంబాల్లో కుమార్తెల వివాహం కోసం రుణం తీసుకోవచ్చు. రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉంటుంది. పావలా వడ్డీకి మాత్రమే ఈ రుణాలు పొందవచ్చు. ఈ రుణాన్ని 48వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది.
JN: బీజేపీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ వెంకటేశ్వర్లు అన్నారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఘనపూర్లో నేతలతో కలిసి వెంకటేశ్వర్లు పరిశీలించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ప్రజలంతా బీజేపీ వెంటే ఉన్నారని అన్నారు.