• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పోలీస్ డాగ్‌కు స్వర్ణ పథకం

KNR: కరీంనగర్ పోలీస్ విభాగానికి చెందిన పోలీస్ డాగ్ ‘టైసన్’ రాష్ట్ర స్థాయిలో ఘనత చాటింది. హైదరాబాద్ మొయినాబాద్‌లోని ఐఐటీఏ శిక్షణ కేంద్రంలో జరిగిన 24వ బ్యాచ్ ముగింపు వేడుకల్లో పేలుడు పదార్థాల గుర్తింపు విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు గాను గోల్డ్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా టైసన్‌ను, దాని హ్యాండ్లర్ పీసీఈ రాజును సీపీ గౌస్ అలాం అభినందించారు.

February 24, 2026 / 06:16 AM IST

గోరికొత్తపల్లిలో భారీ వర్షం

భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండల కేంద్రంలో సోమవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షం కారణంగా మండల వ్యాప్తంగా విద్యుత్ సరఫరా పూర్తిగా ఆగిపోయింది. అలాగే భారీ వర్షం వల్ల మిర్చి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంటలు చేతికొచ్చి చివరి దశలో ఉండటంతో రైతులు తీవ్ర నష్టాలకు గురయ్యారు.

February 24, 2026 / 06:16 AM IST

రోడ్డు ప్రమాదంలో రైతు దుర్మరణం

అన్నమయ్య: ఓబులవారిపల్లి మండలంలోని చిన్నవరం పాడు క్రాస్ రోడ్డు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రైతు రవి మృతి చెందినట్లు పోలీసులు, స్థానికులు తెలిపారు. సాయంత్రం పొలానికి వెళ్తున్న రవి సైకిల్ అదుపుతప్పి పడిపోగా, వెనుక నుంచి వచ్చిన బైక్ ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన అతడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

February 24, 2026 / 06:15 AM IST

రూ. 85 లక్షలు కాజేసిన వ్యక్తి అరెస్ట్

TPT: ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీ నవ్య ఆటో ఫైనాన్స్‌లో సుమారు రూ. 85 లక్షలు మోసం చేసిన కేసులో యుగంధర్ (33)ను ఈస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. వాహన రుణాల పేరుతో వ్యక్తులను తీసుకువచ్చిన వారి పేర్లపై రూ. లక్ష లోన్ మంజూరు చేయించేవాడు. రూ. 40 వేలు వారికి ఇచ్చి, రూ. 60 వేలు స్వలాభానికి వినియోగించుకున్నాడని తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

February 24, 2026 / 06:14 AM IST

‘రేషన్ బియ్యాన్ని పారదర్శకంగా పంపిణీ చేయాలి’

MNCL: నిరుపేద లబ్ధిదారులకు, సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని పారదర్శకంగా పంపిణీ చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా విజిలెన్స్ కమిటీ సమీక్లో ఆయన మాట్లాడారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా, అర్హులైన వారందరికీ అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

February 24, 2026 / 06:13 AM IST

జిల్లా స్థాయి టాలెంట్ టెస్టులో మెరిసిన విద్యార్థి దీక్షిత్

MHBD: ఫిజికల్ సైన్స్ జిల్లా స్థాయి టాలెంట్ టెస్టులో నెల్లికుదురు మండల కేంద్రంలోని మోడల్ స్కూలులో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి సింగారం దీక్షిత్ ప్రతిభ కనబరిచి జిల్లా ప్రథమ విజేతగా నిలిచాడు. దీక్షిత్ ప్రథమ బహుమతి, ప్రశంస పత్రం ప్రముఖుల చేతుల మీదుగా అందుకున్నారు. దీంతో ఎంఈవో రాందాస్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు విద్యార్థిని అభినందించారు.

February 24, 2026 / 06:12 AM IST

నేడు రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం

KMM: కామేపల్లి మండలంలోని కామేపల్లి, పాత లింగాల, కొమ్మినేపల్లి రైతు వేదికల్లో ఇవాళ ఉదయం 10 గంటలకు ‘రైతు నేస్తం’ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ఏవో తారాదేవి తెలిపారు. నిషేధిత హెచ్ టీ పత్తి సాగుపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. సాగులో సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఈ అవకాశం కల్పించినట్లు వివరించారు.

February 24, 2026 / 06:11 AM IST

గ్రామ సభల ఏర్పాట్లపై డీడీఓ సమీక్ష

VZM: ఈ నెల 28న చీపురుపల్లిలో జరగనున్న గ్రామసభల ఏర్పాట్లపై అదికారులతో సోమవారం డీడీఓ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్యక్రమాలు సజావుగా జరిగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. గ్రామసభలకు ప్రజల హాజరు పెరిగేలా ప్రచారం నిర్వహించాలని తెలిపారు. ఈ సమీక్షలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

February 24, 2026 / 06:11 AM IST

మంజీరా మరమ్మతులు.. రూ. 722 కోట్లతో పనులు

HYD: మంజీరా వాటర్ సప్లై స్కీమ్ ఫేస్ 1, ఫేస్ 2 ఆధునీకరణ ప్రాజెక్ట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. HMWSSB ప్రతిపాదనల మేరకు రూ. 722 కోట్లతో ఈ ప్రాజెక్ట్ పనులకు నిర్ణయం తీసుకుంది. రూ. 282 కోట్లతో ఉస్మాన్‌సాగర్ మంచినీటి పైప్‌లైన్ ఆధునీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాలంచెల్లిన పైపులు, పంప్ హౌస్‌ల కారణంగా దాదాపు 30% నీటి సరఫరాలో నష్టం వాటిల్లుతోంది.

February 24, 2026 / 06:10 AM IST

సీఎంతో భేటీ.. శ్రీశైలం అభివృద్ధిపై చర్చలు

NDL: వెలగపూడిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి సోమవారం సమావేశమయ్యారు. శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థాన అభివృద్ధి పనులపై చర్చించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ప్రసాద కిట్‌ను ముఖ్యమంత్రికి అందజేశారు.

February 24, 2026 / 06:10 AM IST

కైలాసగిరిపై పరమ శివాయుధం త్రిశూల్‌ ఏర్పాటు

VSP: కైలాసగిరి పర్యాటక ప్రాంతంలో పరమశివుడి ఆయుధమైన 25 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పు త్రిశూల్‌ నిర్మాణం ప్రారంభమైంది. ప్రాజెక్ట్‌కు సుమారు రూ.1.55 కోట్ల వ్యయం, LED లైట్లతో రాత్రిపూటనూ మెరవనీయంగా ఉంటుంది. క్రేన్‌ సాయంతో విడి భాగాలు అమర్చగా, సందర్శకులు కూర్చొని ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవడానికి వేదిక కూడా ఏర్పాటు చేస్తున్నారు.

February 24, 2026 / 06:10 AM IST

కొంతలపాడు యాగంటయ్య ఉత్సవాలు

KRNL: ఓర్వకల్లు మండల పరిధిలోని కొంతలపాడులోని యాగంటయ్య ఉత్సవాలు రేపటి నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని రంగులతో తీర్చిదిద్దారు. 25, 26 తేదీల్లో ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, 27వ తేదీన పాలపండ్ల బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

February 24, 2026 / 06:09 AM IST

‘కాంగ్రెస్ పార్టీలో ఇంటి దొంగలపై చర్యలు తప్పవు’

SRPT: తుంగతుర్తి మండల కేంద్రంలోని సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తిరుమలగిరి మున్సిపల్ ఎన్నికల్లో కావాలని కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఇంటి దొంగలే ఓటమికి పాల్పడ్డారని వారిపై పార్టీ పరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. 

February 24, 2026 / 06:08 AM IST

నాటు సారా నిర్మూలనపై అవగాహన సదస్సు

ELR: చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెంలో సోమవారం ఎక్సైజ్ శాఖ అధికారులు నాటు సారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. అనంతరం గ్రామంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే నాటుసారా తయారీకి, విక్రయాలకు దూరంగా ఉంది సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

February 24, 2026 / 06:07 AM IST

ఉపాధి పనులు లేక కార్మికుల అవస్థలు

SKLM: కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచిందని పలాస మండలం బొడ్డపాడులోని ఉపాధి కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి త్వరగా పనులు కల్పించాలని వారు కోరుతున్నారు. ఈ మేరకు స్థానిక సచివాయల సిబ్బందికి ఏఐసీసీటీయూ నాయకులు కుత్తుం దుష్యంత్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధి కూలీలు ఉన్నారు.

February 24, 2026 / 06:07 AM IST