గుంటూరు రైల్వే స్టేషన్‌లోని 1వ నంబర్ ప్లాట్‌ఫారమ్ ట్రాక్‌పై శుక్రవారం ఒక గుర్తు తెలియని మృతదేహాన్ని రైల్వే పోలీసులు కనుగొన్నారు. రైలు ఢీకొనడం వల్లే సుమారు 35 ఏళ్ల వయసున్న ఆ వ్యక్తి మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు మెరూన్, తెల్ల రంగు బొమ్మలున్న చొక్కా ధరించి ఉన్నదని ఆచూకీ తెలిసినవారు రైల్వే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.
SDPT: జిల్లా రాయపోల్ మండలం మంతూర్–అనాజీపూర్ శివారులో 13డి కాలువలో గోదావరి జలాలకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ వెంకటయ్యతో కలిసి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం నీటి ప్రాజెక్టులు నిర్మిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాటి నిర్వహణ కూడా చూసుకోలేకపోతుందన్నారు.
BHPL: భూతగాడ నేపథ్యంలో జరిగిన హత్యాయత్నం కేసులో గొర్లవీడు గ్రామానికి చెందిన మామిడి రాజకుమార్, అతని భార్య రమను దోషులుగా నిర్ధారించిన జిల్లా అసిస్టెంట్ సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. నిందితులిద్దరికీ ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అదనంగా ఇద్దరికీ చెరో రూ. 5 వేల చొప్పున మొత్తం రూ. 10 వేల జరిమానా విధించినట్లు ఇవాళ SP సంకీర్త్ తెలిపారు.
ఆదిలాబాద్ పట్టణంలోని ఆర్టీవో కార్యాలయం సమీపంలో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను MLA పాయల్ శంకర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో స్రవంతితో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రనమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.
NLG: దేవరకొండ ఆర్డీవో కార్యాలయం ముందు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే రూ.8500 కోట్లను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
KMR: రామారెడ్డి PHC నీ ఆహార భద్రతా కమిషన్ ఛైర్మన్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయన వెంట DMHO డా.విద్య ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గర్భిణీల, బాలింతల పట్ల తీసుకుంటున్న చర్యలు, ఆరోగ్య శాఖ సమన్వయంతో అంగన్వాడీ కేంద్రంలో న్యూట్రీషన్ ఫుడ్ అందిస్తున్న సేవల వివరాలపై ఆరా తీశారు.
పెద్దపల్లికి చెందిన ఓ మహిళ (33)కు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా అండాశయం ఎడమవైపు భాగంలోని డెర్మాయుడు సిస్ట్ తొలగించినట్లు సూపరింటెండెంట్ డా. శ్రీధర్ తెలిపారు. సర్జరీలో పాల్గొన్న వైద్య బృందం డాక్టర్లను ఆయన అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను పేద ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
MDK: శివంపేట మండలంలోని కొత్తపేటలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి రాజిరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామ అభివృద్ధి, పార్టీ బలోపేతానికి అందరూ ఐక్యంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
CTR: నిర్దిష్టమైన ఓటర్ల జాబితా తయారీకి అందరి సహకారం అవసరమని ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కరుణ కుమారి తెలిపారు. పుంగనూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై సమీక్షించారు. తర్వాత రాజకీయ నాయకులు వారి వారి సలహాలు సూచనలు ఇచ్చారు.
BDK: ఇల్లందు మండలం మాణిక్యారం గ్రామ పరిధిలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ప్రతిష్ట కార్యక్రమంలో కుటుంబ సమేతంగా శుక్రవారం ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరయ్యారు. స్వామివారి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టమని సంతోషకరంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. రామయ్య ఆశీస్సులు అందరిపై ఉండే సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.
GDWL: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయం పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకే జరిగిందని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ ఛైర్మన్ డా.ఆంజనేయ గౌడ్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ వ్యవహారాల్లో వ్యక్తిగత నిర్ణయాలకు చోటు లేదని ఆయన తెలిపారు. ఎన్నికలు ముగిసిన అనంతరం సోషల్ మీడియాలో అనవసర వాదోపవాదాలు సరికాదని హితవు పలికారు.
TG: రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22 నుంచి 24 వరకు పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఈ నెల 22న సెంట్రల్, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో, 23, 24 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురవొచ్చని ప్రకటన విడుదల చేసింది.
PPM: క్రీడా పాఠశాలల ప్రవేశాల కోసం ఈ నెల 23 నుంచి జిల్లా స్థాయి ఎంపిక నర్సిపురం ZP హైస్కూలులో నిర్వహిస్తున్నట్లు DEO బ్రహ్మాజీరావు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ఈనెల 23న పార్వతీపురం, సీతానగరం,బలిజిపేట,24న గుమ్మలక్ష్మీపురం,కురుపాం, జియమ్మవలస,25న గరుగుబిల్లి, కొమరాడ,వీరఘట్టం,26న భామిని, సీతంపేట,పాలకొండ,27 సాలూరు, పాచిపెంట, మక్కువ వారు హాజరుకావాలన్నారు.
VKB: పర్యాటక ప్రాంతమైన అనంతగిరి క్షేత్రానికి వస్తున్న సందర్శకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అటవీశాఖ ప్రత్యేకంగా రెండు సఫారీ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. జిల్లా అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. పర్యాటకులు ఈ వాహనాల్లో సుమారు 10 కిలోమీటర్ల మేర అడవిలో ప్రయాణించి ప్రకృతిని ఆస్వాదించవచ్చు.
TG: హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. రెండు రోజుల క్రితమే బాంబు ఉందని మెసేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆగంతకులు మళ్లీ బాంబు ఉన్నట్లు మెయిల్ పంపారు. దీంతో అప్రమత్తమైన బాంబు స్క్వాడ్ కోర్టులో ఉన్న సిబ్బంది, ప్రజలను బయటకు పంపించి తనిఖీలు చేపట్టింది. కాగా, ఇటీవల బాంబు బెదిరింపు ఘటనలు పెరిగిన విషయం తెలిసిందే.