MNCL: క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్‌పర్సన్ , వైస్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులో మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్లు మందమర్రి సీఐ పర్స రమేశ్ ప్రకటనలో తెలిపారు. ఇందులో సుమన్, మూల రాజిరెడ్డి, అనిల్, లక్ష్మి కాంతులను ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. మిగిలిన వారంతా పరారీలో ఉన్నారని సీఐ వెల్లడించారు.
HYD: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో నడిచే రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు బొల్లారం రైల్వే స్టేషన్‌లో ప్రయోగాత్మక నిలుపుదల కల్పించారు. ఈరోజు నుంచి తదుపరి సూచనలు వచ్చేవరకు ఈ స్టాప్ అమల్లో ఉండనుంది. దీంతో స్థానిక ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీ లభించనుంది.
హాలీవుడ్ నటుడు ఎరిక్ డేన్ (53) Amyotrophic Lateral Sclerosis (ALS) వ్యాధితో కన్నుమూశాడు. ‘Grey’s Anatomy’, ‘Euphoria’ వంటి సిరీస్‌లతో పాటు ‘X-Men’, ‘Bad Boys’ సినిమాలతో ఆయన గుర్తింపు పొందాడు. కండరాల బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగించే ఈ ప్రాణాంతక వ్యాధి రావడానికి కచ్చితమైన కారణం లేదు. అభిమానులు తమ అభిమాన నటుడికి నివాళులర్పిస్తు...
CTR: చిత్తూరు మెప్మా-నిపుణ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన నాగయ్య కళాక్షేత్రంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. ఉదయం 9 గంటలకే మేళా ప్రారంభమవుతుందని చెప్పారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన వారు అర్హులని అన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 8121212873 నంబర్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
KMR: బిచ్కుంద పట్టణంలోని ఏడవ వార్డులో మురికికాలువల్లో నిల్వ ఉండకుండా పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కౌన్సిలర్ ముజాహిద్ పర్యటించి కార్మికులను అప్రమత్తం చేశారు. అనంతరం నిల్వ ఉన్న నీటిని తొలగించారు. ప్రజలు అంటురోగాల బారిన పడకుండా ఉండాలంటే ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం తప్పనిసరని కౌన్సిలర్ ముజాహిద్ అన్నారు.
MHBD: పెద్దవంగర మండలం పడమటి తండాకు చెందిన ధరావత్ సోమన్న తన కుమారుడు విజయ్ మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. గురువారం క్షణికావేశంలో తండ్రి గొంతుపై కుమారుడు కత్తితో దాడి చేశారు. గాయపడిన వ్యక్తిని కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎంకు తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై ప్రమోద్ కుమార్ గౌడ్ తెలిపారు.
VSP: బుచ్చయ్యపేట మండలం కొత్త కొండెం పూడిలో పదో తరగతి విద్యార్థి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు కొంతమంది వెండి పట్టీలు దొంగతనం చేశారని నెపం మోపడంతో మనస్తాపం చెంది చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కాలనీ వాసులు తెలిపారు. కుమారుడి మృదేహాన్ని చూసి తల్లిదండ్రులు తలారి మంగపతి, భవాని కన్నీరుమున్నీరయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ATP: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు శుక్రవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని, రాయదుర్గం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
TPT: వెంకటగిరి ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశానికి ఈనెల 23వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రిన్సిపల్ తులసి జ్యోతి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఆన్‌లైన్ ద్వారా మార్చి 31వ తేదీ వరకు అర్జీలు చేసుకోవచ్చన్నారు. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్షలు, 27 ఫలితాలు, మెరిట్ లిస్టు, ఎంపిక జాబితాను ప్రకటిస్తామని ఆమె తెలిపారు.
NDL: ఈ నెల 26న ఆత్మకూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి ఇవాళ తెలిపారు. 14 ప్రముఖ కంపెనీలు పాల్గొని 1,250 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన 18–30 ఏళ్ల వయసు గల యువత అర్హులన్నారు. సర్టిఫికెట్లతో నేరుగా హాజరుకావాలని సూచించారు.
AP: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఏడో రోజు సమావేశాలను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. ఇవాళ్టి సెషన్స్‌లో మండలి సభ్యులకు బడ్జెట్ ప్రసంగంపై మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమివ్వనున్నారు. కాగా ఇందాపూర్ డెయిరీ అంశంపై వైసీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది.
TG: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నిజామాబాద్ మేయర్ ఉమారాణి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరుకానున్నారు. మరోవైపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పాల్వంచలో ఆయిల్ ఫామ్ మొక్కల ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు.
NLR: బుచ్చి(మం) రామచంద్రపురం గురుకుల పాఠశాలలో కరెంటు షాక్ తగిలి ఓ కూలి మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పాఠశాల ప్రహరీపై ఇనుప ముల్ల కంచె ఏర్పాటు చేస్తుండగా నెల్లూరుకు చెందిన ఓ కూలి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే బుచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి నెల్లూరుకు తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు.
RR: తిమ్మాపూర్ ఉన్నత పాఠశాలలో నిన్న విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులే ఉపాధ్యాయులై తోటి విద్యార్థులకు చదువు బోధించారు. పలువురు విద్యార్థులు ఒక్కరోజు హెడ్ మాస్టర్, కలెక్టర్ వంటి హోదాల్లో కనిపించారు. ఈ సందర్భంగా ఫోటోలు దిగి తీపి జ్ఞాపకాలను మిగిల్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.