GNTR: వైసీపీ ఎస్టీ సెల్ (మైదానప్రాంత) రాష్ట్ర అధ్యక్షుడిగా గుండా సురేంద్ర నియమితులయ్యారు. గతంలో ట్రైకార్ ఛైర్మన్‌గా పనిచేసిన ఆయన మైదానప్రాంత గిరిజనుల సమస్యలపై చురుకుగా స్పందించారు. గిరిజనులకు పార్టీకి మధ్య వారధిగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికు కృతజ్ఞతలు తెలిపారు.
KRNL: పెద్దకడబూరు మండలం బాపురంలో వెలసిన శ్రీ గంగాదేవి జాతర సందర్భంగా ఈ నెల 23న అంతర్ రాష్ట్ర బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు హనుమంతు శుక్రవారం తెలిపారు. ఇందులో విజేతలుగా నిలిచిన కాడెద్దులకు ప్రథమ బహుమతిగా రూ. 25 వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 20 వేలు, తృతీయ బహుమతిగా రూ. 15 వేలు, నాల్గవ బహుమతిగా రూ. 10 వేలు, ఐదవ బహుమతిగా 5 వేలు అందజేస్తామన్నారు.
ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026: సెమీస్‌లో భారత్ బౌలింగ్ ధాటికి శ్రీలంక బ్యాటర్లు తడబట్టారు. దీంతో ప్రత్యర్థి జట్టు 118 పరుగులకే పరిమితమైంది. యువ భారత్ తరఫున కెప్టెన్ రాధా యాదవ్ 4 వికెట్లు తీయగా.. ప్రేమా రావత్, తనుజా కన్వర్ తలో 2 వికెట్లు పడగొట్టారు. టోర్నీ ఫైనల్ చేరేందుకు టీమిండియా విజయ లక్ష్యం 126 రన్స్.
TG: HYDలోని అమీన్ పూర్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. రెండున్నర కిలోల OPM డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న.. రాజస్థాన్‌కు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడి నుంచి డ్రగ్స్ రవాణా చేస్తున్నారన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
NLG: మునుగోడు మండలం పలివెలలో చింతకాయలు తెంచుతున్న మహిళ మెడలో నుంచి పుస్తెల తాడు దొంగిలించిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మాద నరేందర్, వల్లెపు సాయిల నుంచి బంగారు గొలుసు, కారు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. కేసును వేగంగా ఛేదించిన ఎస్ఐ రవిని డీఎస్పీ శివరాంరెడ్డి అభినందించారు.
KNR: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రేషన్ కార్డు లబ్ధిదారులందరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా కొత్తగా కార్డులు పొందినవారు, పాత కార్డుల్లో పేరు జత చేసుకున్నవారు ఈ-కేవైసీ చేసుకోవాలని సూచిస్తున్నారు. మీ సమీపంలోని రేషన్ దుకాణంలో e-PoS యంత్రంలో ఉచితంగా చేయించుకోవచ్చని వెల్లడించారు.
VZM: బొబ్బిలి మండలం ఓ గ్రామంలో గురువారం గంజాయితో విద్యార్థులు పట్టుబడినట్లు సమాచారం. కళాశాల వద్ద గంజాయి తాగుతునట్లు పోలీసులకు సమాచారం రావడంతో దాడి చేసి నలుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకొని 4 కిలోల గంజాయి సీజ్ చేసినట్లు తెలుస్తోంది. జల్సాలకు అలవాటు పడ్డ సీనియర్ విద్యార్థులే ఒడిశా నుంచి గంజాయి తెచ్చి అమ్ముతున్నట్లు చర్చ జరుగుతుంది.
W.G: ఉమ్మడి జిల్లాల పరిధిలోని జలవనరుల రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ‘లైడార్’ విమానం ద్వారా ఆకాశంలో సర్వే పనులు అత్యంత చురుగ్గా సాగుతున్నాయి. ఫిబ్రవరి 20న నరసాపురం, పాలకొల్లు, అత్తిలి, గణపవరం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం పరిసరాల్లో, 21న పేరుపాలెం, మొగల్తూరు, భీమవరం, వీరవాసరం, ఉంగుటూరు, భీమడోలు ప్రాంతాల్లో విమానం ద్వారా సర్వే జరగుతుంది.
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ నూతన ఛైర్మన్‌గా పాలకుర్తి సారంగపాణి శుక్రవారం ఉదయం 11 గంటలకు అధికార బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమం మున్సిపాలిటీ కార్యాలయంలోని ఛైర్మన్ క్యాబిన్‌లో నిర్వహించబడుతుంది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరుకానున్నారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కొత్త ఛైర్మన్‌ను ఆత్మీయంగా స్వాగతించాలని పిలుపునిచ్చారు.
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ నూతన ఛైర్మన్‌గా పాలకుర్తి సారంగపాణి శుక్రవారం ఉదయం 11 గంటలకు అధికార బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమం మున్సిపాలిటీ కార్యాలయంలోని ఛైర్మన్ క్యాబిన్‌లో నిర్వహించబడుతుంది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరుకానున్నారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కొత్త ఛైర్మన్‌ను ఆత్మీయంగా స్వాగతించాలని పిలుపునిచ్చారు.
SRPT: రైతుల అభ్యర్థన మేరకు అదనంగా మూడు రోజులపాటు విడుదల చేసిన గోదావరి నీటిని గురువారం సాయంత్రం నిలిపివేశారు. వారబందీ విధానంలో తిరిగి గోదావరి జలాలను ఈనెల 21న పునరుద్ధరించి 28వ తేదీ వరకు విడుదల చేయనున్నట్లు జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు.
SRPT: రైతుల అభ్యర్థన మేరకు అదనంగా మూడు రోజులపాటు విడుదల చేసిన గోదావరి నీటిని గురువారం సాయంత్రం నిలిపివేశారు. వారబందీ విధానంలో తిరిగి గోదావరి జలాలను ఈనెల 21న పునరుద్ధరించి 28వ తేదీ వరకు విడుదల చేయనున్నట్లు జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు.
TG: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో హైడ్రామా కొనసాగుతోంది. BRSతోనే పొత్తు ఉంటుందని సీపీఐ కౌన్సిలర్లు వెల్లడించారు. దీంతో ఛైర్మన్ పీఠం తమదేనని BRS ధీమా వ్యక్తం చేస్తోంది. మాజీ MLA బాల్క సుమన్ అరెస్ట్‌తో CPI స్థానిక నేతలు డైలామాలో పడ్డారు. మరోవైపు CPI అధిష్టానం కాంగ్రెస్‌తో కలవడం మంచిదని సూచించగా.. BRSకు మాట ఇచ్చి వెనక్కి తగ్గితే ఎలా కౌన్సిలర్లు యోచనలో పడ్డారు.
NZB: జక్రాన్‌పల్లి మండల కేంద్రంలోని 108 అంబులెన్స్‌ను గురువారం సాయంత్రం జిల్లా సూపర్వైజర్ స్వరాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు, మందుల నిల్వలు, రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని, గడువు ముగిసిన మందులను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు.
మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 21 డివిజన్ ఉరగుట్ట చెరువు రోడ్డు ప్రాంతంలో వీధి బల్బులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. విషయాన్ని స్థానికులు నూతన కార్పొరేటర్ గుండా సంతోష్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఆయన గురువారం రాత్రి నూతన బల్బులను ఏర్పాటు చేయించారు. వాటిని ఆ ప్రాంత వాసులతో కలిసి ప్రారంభించగా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.