• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

అర్జిత్ సింగ్‌ పాడటం ఆపొద్దు: అమీర్

స్టార్ సింగర్ అర్జిత్ సింగ్ ప్రొఫెషనల్ సింగర్‌గా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్.. అర్జిత్ సింగ్‌ను కలిసి పాటలు పాడటం ఆపొద్దంటూ స్వయంగా కోరాడు. ముర్షిదాబాద్‌లోని అర్జిత్ సింగ్ నివాసానికి వెళ్లిన అమీర్.. ‘నువ్వు పాటలు పాడటం ఆపేస్తే మేము ఏమైపోతాం?’ అంటూ రిక్వెస్ట్ చేయడం విశేషం.

February 23, 2026 / 05:36 PM IST

బాలీవుడ్‌లో నన్ను తొక్కేశారు: ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోవడం, కావాలని తనను పక్కన పెట్టడంతోనే తాను హాలీవుడ్ వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. ఆ సమయంలో తాను తీవ్ర ఒత్తిడికి గురైనట్లు పేర్కొంది. హాలీవుడ్‌లో ఎన్ని విజయాలు వచ్చినప్పటికీ, భారతీయ చిత్రాల్లో నటించేందుకే తాను ఎప్పుడూ మొగ్గు చూపుతానని వెల్లడించింది.

February 23, 2026 / 05:07 PM IST

‘విజయ్-రష్మిక’ ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఈనెల 26న వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, వీరిద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఎంత ఉండవచ్చు? అని అభిమానులు నెట్టింట్లో చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం విజయ్ వయసు 36 ఏళ్లు కాగా, రష్మిక వయసు 30 ఏళ్లు. వీరి మధ్య ఆరేళ్ల వ్యత్యాసం ఉంది. వయసులో పెద్దగా తేడా లేకపోవడంతో వీరిద్దరూ ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అని కామెంట్లు చేస్తున్నారు.

February 23, 2026 / 04:48 PM IST

ఆర్టిస్టులుగా మమ్మల్ని గుర్తించండి: భార్గవి

గాయత్రి భార్గవి నటిగా, యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనపడుటలేదు’ సిరీస్‌లో నటించింది. తాజాగా ఓ ఈవెంట్‌లో ఆమె మాట్లాడుతూ.. ‘మేమంతా ఆర్టిస్టులుగా ఆకలితో ఉన్నాం. అవకాశాలిస్తే తినేస్తాం. మేం కూడా ఉన్నామని గుర్తించండి. విమానమే ఎక్కి రావక్కర్లేదు.. లోకల్‌గా కార్లు, ట్రైన్లు కూడా ఎక్కి వచ్చి చేయొచ్చు’ అని తెలిపింది.

February 23, 2026 / 03:33 PM IST

రాజ్‌ వల్లే మళ్లీ నాలో మార్పు మొదలైంది: సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్ వల్లే మళ్లీ తనలో మార్పు మొదలైందని తెలిపింది. ‘వివాహ బంధం ముగిసిన తర్వాత ఇక ఎవరినీ నమ్మడం సాధ్యం కాదేమోననిపించింది. ఎందుకంటే ప్రేమ, స్నేహం అంగీకరించలేనంద బలహీనంగా మారిపోయా. రాజ్ నిడుమోరును కలిశాకే నాలో మార్పు వచ్చింది. రాజ్ అలాంటి ప్రేమను పంచిన వ్యక్తి’ అని చెప్పుకొచ్చింది.

February 23, 2026 / 03:13 PM IST

విజయ్-రష్మిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

విజయ్, రష్మికల పెళ్లి ఈనెల 26న ఘనంగా జరగబోతోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి నికర ఆస్తి ఎంత ఉండవచ్చు అనే చర్చ SMలో జోరుగా సాగుతోంది. విజయ్‌కు జూబ్లీహిల్స్‌లో రూ.15 కోట్ల విలువైన బంగ్లా ఉండగా, అతని మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.70 కోట్లుగా అంచనా. అలాగే, రష్మికకు కర్ణాటక విరాజ్‌పేటలో రూ.8 కోట్ల ఇల్లు ఉంది. ఆమె మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.66 కోట్లు అని సమాచారం.

February 23, 2026 / 03:11 PM IST

బాఫ్టా 2026: ఉత్తమ నటుడు రాబర్ట్ అరమాయో ఎవరు?

ఏడేళ్ల వయసులోనే నటనను ప్రారంభించిన రాబర్ట్ అరమాయో 2026 బాఫ్టా అవార్డుల్లో ఉత్తమ నటుడుగా నిలిచారు. ఐ స్వేర్ చిత్రంలోని నటనకు గాను లియోనార్డో డికాప్రియోను ఓడించి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. గతంలో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ వంటి ప్రముఖ సిరీస్‌లలో నటించిన ఆయన, అమెరికాలో ప్రత్యేక నటనా శిక్షణ పొంది తన ప్రతిభను చాటుకున్నారు.

February 23, 2026 / 01:41 PM IST

పవన్ కళ్యాణ్‌ను కలిసిన అల్లు అరవింద్

డిప్యూటీ సీఎం, హీరో పవన్‌ కళ్యాణ్‌ను నిర్మాత అల్లు అరవింద్‌ కుటుంబ సమేతంగా కలిశారు. మార్చి 6న హీరో అల్లు శిరీష్‌ తన ప్రియురాలు నయనికతో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు పెళ్లికి పవన్‌ కళ్యాణ్ దంపతులను అల్లు అరవింద్‌ ఆహ్వానించారు. కాగా ఇప్పటికే దుబాయ్‌లో పార్టీస్, పసుపు దంచుడు వంటి కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.

February 23, 2026 / 01:15 PM IST

ఆ స్పెషల్‌ డేకు.. ‘జననాయగన్’ రిలీజ్‌!

దళపతి విజయ్ నటించిన చివరి, 69వ తమిళ చిత్రం ‘జననాయగన్’. హెచ్. వినోద్ దర్శకత్వంలో KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ రాజకీయ యాక్షన్ థ్రిల్లర్, సెన్సార్ బోర్డు వివాదాల నుండి బయటపడి, విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాను విజయ్ పుట్టినరోజుకు విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

February 23, 2026 / 10:32 AM IST

జై హనుమాన్.. ప్రశాంత్ వర్మ భారీ స్కెచ్

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ మూవీ తెరకెక్కబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రశాంత్ వర్మ ఈ మూవీ కోసం ఆస్కార్ విజేత, సంగీ దిగ్గజం ఎం.ఎం కీరవాణిని రంగంలోకి దించారు. ఈ విషయాన్ని హనుమంతుడిగా నటిస్తున్న రిషబ్ శెట్టి తన సోషల్ మీడియా పోస్ట్‌లో కన్ఫర్మ్ చేశారు.

February 23, 2026 / 08:53 AM IST

మణిపురి సినిమాకు అరుదైన గౌరవం

అంతర్జాతీయ వేదికగా మణిపురీ సినిమా ‘బూంగ్’కు బాఫ్టా అవార్డు దక్కింది. బెస్ట్ చిల్డ్రన్స్- ఫ్యామిలీ ఫిల్మ్ కేటగిరీలో పురస్కారం లభించింది. ఇది ఈశాన్య భారత సినిమాకు దక్కిన అరుదైన గౌరవం. బూంగ్ చిత్రానికి లక్ష్మీప్రియా దేవి దర్శకత్వం వహించారు. మణిపూర్‌లోని సరిహద్దు పట్టణం మోరె నుంచి తన తండ్రిని వెతుక్కుంటూ మయన్మార్‌లోకి బాలుడు వెళ్లే కథతో తెరకెక్కింది.

February 23, 2026 / 07:32 AM IST

పెళ్లిపై విజయ్-రష్మిక ప్రకటన

తాము పెళ్లి చేసుకుంటున్నట్లు విజయ్ దేవరకొండ-రష్మిక మంధాన స్వయంగా ప్రకటించారు. అభిమానులను ఉద్దేశించి ఒకే తరహా నోట్‌ను ఇన్‌స్టా స్టోరీగా పోస్ట్ చేశారు. ‘ప్లాన్ చేయడానికి ముందే మీరు ప్రేమతో మాకు VIROSH అని పేరు పెట్టారు. మీ అభిమానానికి గుర్తుగా మా వేడుకను THE WEDDING OF VIROSH పేరిట నిర్వహించాలని అనుకుంటున్నాం. మీ ప్రేమకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు.

February 22, 2026 / 11:00 PM IST

షూటింగ్‌కి గన్‌తో వెళ్లిన జగపతి బాబు.. ఎందుకంటే?

‘జై బోలో తెలంగాణ’ మూవీ షూటింగ్ విశేషాలను జగపతి బాబు తాజాగా పంచుకున్నారు. ఉద్యమ సమయంలో వరంగల్‌లో షూటింగ్ ఉద్రిక్తంగా ఉండటంతో, తండ్రి వద్దన్నా మొండిగా వెళ్లానని చెప్పారు. రక్షణ కోసం తన వద్ద గన్ ఉంచుకున్నట్లు వెల్లడించి షాక్ ఇచ్చారు. ఆ సినిమా చేసినందుకు ఆంధ్రాలో కొందరు బాధపడినా, వరంగల్ ప్రజలు తనను ఎంతో గౌరవంగా చూసుకున్నారని ఆయన గుర్తు చేసుకున్నారు.

February 22, 2026 / 10:27 PM IST

గాలి కిరీటీతో బోయపాటి శ్రీను మూవీ?

దర్శకుడు బోయపాటి శ్రీను, యంగ్ హీరో గాలి కిరీటీ కాంబోలో ఒక భారీ యాక్షన్ మూవీ రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. తనదైన మాస్ ఎలివేషన్లతో హీరోలను పవర్‌ఫుల్‌గా చూపించే బోయపాటి, కిరీటిని ఎలా ప్రెజెంట్ చేస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, కిరీటీ ‘జూనియర్’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

February 22, 2026 / 04:42 PM IST

7 ఫిల్మ్‌ఫేర్స్‌తో సాయి పల్లవి అరుదైన రికార్డు

టాలెంటెడ్ నటి సాయి పల్లవి తన ఖాతాలో మరో అరుదైన రికార్డును వేసుకుంది. తాజాగా జరిగిన 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ‘అమరన్’ చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డును అందుకుంది. దీంతో ఆమె కెరీర్‌లో మొత్తం 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు చేరాయి. ప్రేమమ్, ఫిదా, శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరీ, గార్గి, విరాటపర్వం, అమరన్ సినిమాలతో ఆమె ఈ ఘనత సాధించింది.

February 22, 2026 / 04:13 PM IST