టాలీవుడ్ నటి వైష్ణవి చైతన్య కోలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా రాబోతున్న చిత్రంలో ఆమెను కథానాయికగా ఎంపిక చేసినట్లు సమాచారం. గతంలో అజిత్ కుమార్ ‘వలిమై’లో చిన్న పాత్ర పోషించిన వైష్ణవి.. ఇప్పుడు పూర్తిస్థాయి హీరోయిన్‌గా తమిళ ప్రేక్షకులను అలరించనున్నట్లు టాక్.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో జరగనుంది. ఇప్పటికే ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ‘Virosh Premier League’ (VPL) పేరుతో నిర్వహించిన క్రికెట్ మ్యాచ్, పూల్ వాలీబాల్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ పాప్‌కార్న్ బకెట్ ఫొటో, రష్మిక గ్రౌండ్ ఫొటోలతో ఈ జంట తమ పెళ్లి సందడిని అభిమానులతో పంచుకున్నారు.
తన పదేళ్ల కష్టానికి దక్కిన అరుదైన బహుమతిగా ‘డంకీ’ సినిమా అని నటి తాప్సీ తెలిపింది. పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్నా, మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్‌గా అంగీకరించేందుకు మేకర్స్ సమయం తీసుకుంటున్నారని పేర్కొంది. ‘పింక్’, ‘తప్పడ్’ వంటి వైవిధ్యమైన సినిమాల్లో తన నటనను చూసే దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ తనకు ‘డంకీ’ అవకాశం ఇచ్చాడని వెల్లడి...
ప్రముఖ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించిన యాక్షన్ మూవీ ‘ది బ్లఫ్’. నేరుగా ఈ సినిమా OTTలో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ ఇంగ్లీష్, తెలుగుతో సహా 19 భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. దర్శకుడు ఫ్రాంక్ ఇ ఫ్లవర్స్ తెరకెక్కించిన ఈ మూవీలో కార్ల్ అర్బన్ ప్రధాన పాత్ర పోషించాడు. ఇక ప్రియాంక ప్రస్తుతం ‘వారణాసి’ సినిమాతో బిజీగా ఉంది.
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో రాబోతున్న మూవీ ‘మృత్యుంజయ్’. 2026 మార్చి 6న ఇది రిలీజ్ కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఈ మూవీలోని ‘హే జిందగీ’ పాటను ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని విడుదల చేయనున్నాడు. ఇక దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించిన ఈ సినిమాలో రెబా మోనికా జాన్ కథానాయికగా నటించింది.
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ‘మంగళవారం’ ఫేమ్ అజయ్ భూపతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఆయన ఈ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్ ఇచ్చాడు. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో ఇప్పటివరకు ఎవరూ చూడని సరికొత్త కోణాన్ని ఈ మూవీలో చూపించబోతున్నట్లు ప్రకటించి ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాడు.
టాలీవుడ్‌లో సాంకేతిక విప్లవం మొదలైంది. హాలీవుడ్ స్థాయి ‘మోషన్ క్యాప్చర్’ టెక్నాలజీ ఇప్పుడు HYDలోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో అందుబాటులోకి వచ్చింది. దర్శకుడు రాజమౌళి తాజాగా ఈ ‘M&M Cap’ ల్యాబ్‌ను ప్రారంభించాడు. మహేష్ బాబు ‘వారణాసి’ మూవీలోని కీలక సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరిస్తున్నారు. ఇకపై విదేశీ ల్యాబ్‌లపై ఆధారపడే అవసరం ఉండదని సినీ వర్గా...
నటీనటులు ఫామ్‌లో ఉన్నప్పుడే ఆర్థికంగా స్థిరపడాలని తమన్నా తెలిపింది. అవకాశాలు ఉన్నప్పుడే ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూసుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. తన తండ్రి నుంచి ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకున్నానని, ప్రస్తుతం రియల్ ఎస్టేట్, జ్యువెలరీ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టానని, పక్కా ప్లానింగ్ ఉంటేనే కెరీర్ తర్వాత ధైర్యంగా ఉండొచ్చని పేర్కొంది.
లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో రజినీకాంత్ ‘తలైవార్ 173’ మూవీ చేయనున్నారు. శిబి చక్రవర్తి తెరకెక్కించనున్న ఈ మూవీలో మలయాళ దర్శకనటుడు బాసిల్ జోసెఫ్ భాగం కానున్నాడట. ఇందులో రజినీ తనయుడు పాత్రలో ఆయన కనిపించనున్నట్లు సమాచారం. ప్రియాంక మోహన్ కూడా ఈ మూవీలో నటించనుందట. ఇక ఈ సినిమా షూటింగ్ 2026 ఏప్రిల్‌లో స్టార్ట్ కానున్నట్లు, 2027 సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లు టాక్.
దర్శకుడిగా, హీరోగా సత్తా చాటిన తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. తాజాగా ఆయన సొంత ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేసినట్లు సమాచారం. తన బ్యానర్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాను రూపొందించనున్నాడట. ఇందులో నటి మమితా బైజు ప్రధాన పాత్రలో నటించనున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘మృత్యుంజయ్’. 2026 మార్చి 6న ఇది రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ ఓవర్సీస్ హక్కులను శ్లోక, వైబ్రాంట్ సంస్థలు సొంతం చేసుకున్నాయి. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఓవర్సీస్‌లో మార్చి 5న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది.
బాడీ షేమింగ్, ట్రోలింగ్‌పై నటి మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన శరీర బరువుపై వచ్చే విమర్శలను పట్టించుకోవద్దని అక్షయ్ కుమార్ ఇచ్చిన సలహా తనలో ధైర్యాన్ని నింపిందని తెలిపింది. ‘మీరు మీలాగే ఉండండి. మూవీ పాత్ర కోసం అవసరమైతే తప్ప బరువు తగ్గకండి’ అని అక్షయ్ చెప్పిన మాటలు తన ఆలోచనా విధానాన్ని మార్చేశాయని తెలిపింది. ఇప్పుడు ఆ సూత్రాలనే పాటిస్తున్నట్లు పేర్కొంది.
TG: ప్రముఖ యూట్యూబర్ కోమలి (21) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గత మూడేళ్లుగా మరో యూట్యూబర్‌తో ప్రేమలో ఉన్న ఆమె, బ్రేకప్ కారణంగా తీవ్ర మనస్థాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ ఆమె ఓ సారి ఆత్మహత్యాయత్నం చేశారు. BSC చదువుతూ, యూట్యూబ్ వీడియోల ద్వారా గుర్తింపు పొందిన కోమలి మరణం సోషల్ మీడియాలో విషాదాన్ని నింపింది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం ఫిబ్రవరి 26, 2026న ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘సఖా సప్తపద భవ’ అనే వేద మంత్రం స్ఫూర్తితో ఈ జంట జీవితాంతం స్నేహితులుగా కలిసి ఉండాలని ఆకాంక్షించారు. సినిమాల్లో వీరి కెమిస్ట్రీ కంటే, నిజ జీవితంలో దైవం రాసిన ఈ ప్రేమ కథ మరింత అందంగా ఉండాలని ప్రధాని తన సందేశంలో ఆశీర్వదించారు.
హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తోన్న మూవీ ‘భోగి’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. తాజాగా మేకర్స్ ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో శర్వానంద్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇక అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ మూవీ ఆగస్టు 28న రిలీజ్ కానుంది.