వేసవిలో ఎండ నుంచి రాగానే అతిగా చల్లటి నీరు తాగడం ఆరోగ్యానికి హానికరం. దీనివల్ల జీర్ణక్రియ మందగించి గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. అకస్మాత్తుగా శరీర ఉష్ణోగ్రత మారడం వల్ల తలనొప్పి కలగవచ్చు. ఇది రక్త ప్రసరణ, గుండె లయపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి, ఎండలో తగినంత జాగ్రత్తగా ఉంటూ, సాధారణ ఉష్ణోగ్రత గల నీటిని తాగడమే శ్రేయస్కరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బత్తాయి జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి, జలుబు వంటి సమస్యల నుంచి కాపాడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. ఇది చర్మానికి మంచి మెరుపును ఇస్తుంది. తక్షణ శక్తిని అందిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు ఈ జ్యూస్ తాగితే బెటర్.
పిల్లలతో ఉండటానికి, వారితో సమయం గడపడానికి మధ్య చాలా తేడా ఉంది. వారు ఆడుకుంటున్నప్పుడు పక్కనే కూర్చుని ఫోన్ చూడటం నిజమైన తోడు అనిపించుకోదు. మీరూ ఒక చిన్నపిల్లవాడిలా మారి వారితో కలిసి ఆడటం, వారిని నవ్వించడం అసలైన సమయం. ఎందుకంటే వారు కోరుకునేది మీ సమయాన్ని మాత్రమే, కేవలం మీ ఉనికిని కాదు. పిల్లలతో మనస్ఫూర్తిగా గడపండి.
ఆరోగ్యవంతమైన జీవనానికి గాఢ నిద్ర ఎంతో అవసరం. పక్కపై చేరగానే నిద్ర పట్టక ఇబ్బంది పడేవారికి ‘మిలిటరీ మెథడ్’ అద్భుత పరిష్కారం. మొదట ముఖ కండరాలను సడలించి, భుజాలను కిందికి వదిలేస్తూ శ్వాసను నెమ్మదిగా వదలాలి. కాళ్లు, చేతులను భారరహితంగా ఉంచి మనసును ప్రశాంతమైన స్థితిలోకి తీసుకురావాలి. 6 వారాల నిరంతర సాధనతో ఈ పద్ధతి ద్వారా బెడ్ ఎక్కిన నిమిషాల్లోనే గాఢ నిద్రలోకి జారుకోవచ్చు.
కొందరు రాత్రి వేళల్లో జీన్స్ ప్యాంట్ ధరించే నిద్రపోతారు. ఇలా చేస్తే ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పూట వీటిని ధరిస్తే కంఫర్ట్ లేక సరిగ్గా నిద్రపట్టదు. శరీర ఉష్ణోగ్రత పెరిగి నిద్రాభంగం కలుగుతుంది. జీన్స్ బిగుతుగా ఉండటంతో ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. అలర్జీ, దద్దుర్లు, నడుం నొప్పి, ఉబ్బరం, లైంగిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది.
గ్రీన్ యాపిల్స్‌లో అనేక పోషకాలు ఉంటాయని, రోజూ తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. మలబద్ధకం సమస్య ఉన్న వారికి చక్కని ఔషధంలా పనిచేస్తుంది. డయేరియా నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణాశయం, పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు రాకుండా చూస్తుంది.
మండే ఎండల వేళ ‘చల్లని బీరు’ దాహాన్ని తీరుస్తుందని చాలామంది భావిస్తారు. కానీ బీరు తాగినప్పుడు తాత్కాలికంగా హాయిగా అనిపించినా.. బీరులోని ఆల్కహాల్ శరీరాన్ని త్వరగా డీహైడ్రేషన్‌కు గురిచేస్తుంది. దీనివల్ల శరీరం మరింత వేడెక్కి నీరసించిపోయి మూత్రపిండాలపై ఒత్తిడి పెరిగి, ఎండదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. అందుకే బీరు కంటే కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు తాగడం మంచిది.
మట్టి కుండలో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అతిగా దాహం వేయదు. ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి. శరీరం ఎప్పుడూ చల్లగా ఉంటుంది. డిహైడ్రేట్‌కు గురికారు. జీర్ణసంబంధిత సమస్యలు దూరమవుతాయి. జలుబు, దగ్గు తగ్గుతుంది. శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. రక్తపోటు కంట్రోల్‌లో ఉంటుంది.
వేసవిలో అధికంగా కూల్ డ్రింక్స్ తాగితే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇది టైప్-2 డయాబెటిస్‌కు ముందస్తు సంకేతంగా పరిగణించబడుతుంది. అధిక చక్కెర లివర్‌లో కొవ్వుగా మారి నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్యను కలిగిస్తుంది. దంతాల ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతాయి. సోడాలో ఉండే ఫాస్పారిక్, కార్భోనిక్ యాసిడ్లు దంతాల పైపొరను దెబ్బతీసి దంతాలు పుచ్చిపోవడానికి కారణమవుతాయి.
లంచ్ బాక్స్‌లో కూరగాయలు ఎక్కువ ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్లేట్‌లో సగం భాగం వండిన కూరగాయలు లేదా పచ్చని ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. పావు భాగం పప్పు, పనీర్ లేదా గుడ్డు వంటి ప్రోటీన్ ఆహారానికి కేటాయించాలి. మిగిలిన పావు భాగం మాత్రమే అన్నం లేదా చపాతి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల తక్కువ క్యారీలకే కడుపు నిండుతుంది. పోషకాలు సమృద్ధిగా అందుతాయి
సన్‌ఫ్లవర్ గింజలు కేవలం చిరుతిండి మాత్రమే కాదు, ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి అద్భుతమైన వరం. ప్రతిరోజూ గుప్పెడు గింజలను ఆహారంలో చేర్చుకుంటే బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ఉండే విటమిన్-E, సెలీనియం చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడి సహజమైన మెరుపును ఇస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరచడమే కాకుండా గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
రొమ్ము క్యాన్సర్ మహిళలకే వస్తుందనుకుంటే పొరపాటే. పురుషులు కూడా వస్తుందని HYDలోని ESIC మెడికల్ కాలేజీ విశ్లేషణలో వెలుగులోకి వచ్చింది. పురుషుల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ల స్థాయిలు పెరగడం, కాలేయ సంబంధిత సమస్యలు, అధిక బరువు, జన్యుపరమైన కారణాలతో ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. రొమ్ము భాగంలో గడ్డలు, చనుమొనలు లోపలికి వెళ్లడం, చర్మం రంగులో మార్పులు లక్షణాలు కనిపిస్తాయి.
చాలామంది ఉదయం బ్రేక్ ఫస్ట్ స్కిప్ చేస్తుంటారు. అలా చేయకుండా ఒక అరటిపండు, గ్లాస్ పాలు తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అరటిపండులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించడమే కాకుండా రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అంతేకాదు అరటిపండు గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది.
తమలపాకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తమలపాకులను నీటిలో మరిగించి తాగడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. చిగుళ్లు దృఢపడతాయి. వీటిలోని యాంటీసెప్టిక్ గుణాలు చర్మ అలర్జీలను, దురదలను నయం చేస్తాయి. గాయాలపై వీటి రసం రాసి కట్టుకడితే త్వరగా మానుతాయి. భోజనం తర్వాత వీటిని నమలడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
ఖాళీ కడుపుతో గ్లాసు నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ నుంచి కోలుకుని జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కనీసం 10 నిమిషాలు యోగా లేదా ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. కాసేపు ఎండలో గడపడం వల్ల విటమిన్-డి అందుతుంది. నానబెట్టిన బాదం లేదా పండ్లతో కూడిన ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి. ఆ రోజంతా చేయాల్సిన పనుల జాబితా సిద్ధం చేసుకుంటే బెటర్.