• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేతల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం

GNTR: శాసనమండలిలో వైసీపీ నేతలు ప్రదర్శించిన తీరును సభ్య సమాజం హర్షించదని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి విమర్శించారు. శనివారం తన క్యాంప్ కార్యాలయంలో మాట్లాడిన ఆమె, వేంకటేశ్వరస్వామి ఫోటోలు పట్టుకుని, కాళ్లకు షూలు వేసుకుని సభలోకి రావడం అపచారమని మండిపడ్డారు. దేవుడి పట్ల భక్తి లేని ఇలాంటి చర్యలు క్షమించరానివని ఆగ్రహం వ్యక్తం చేశారు.

February 21, 2026 / 04:35 PM IST

తల్లిదండ్రులకు చెంతకు చేర్చిన పట్టణ పోలీసులు

PPM: బొబ్బిలి పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఏడాది వయస్సు ఉన్న తన మనవరాలితో పొరపాటున పార్వతీపురం వచ్చారు. అక్కడ అచేతనగా ఉండడంతో అతనిని స్థానికులు వాకబు చేయగా పొంతనలేని సమాధానం చెప్పారు. వెంటనే పట్టణ సీఐ వెంకటరావుకు సమాచారం అందించగా, చిన్నారిని, వృద్ధుని పోలీసు సంరక్షణలో ఉంచి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారికి పాపను సురక్షితంగా అందించారు.

February 21, 2026 / 04:32 PM IST

‘ప్రసూతి ఆసుపత్రిలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం’

TPT: తిరుపతి ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది గర్భిణీలు మరియు వారి కుటుంబ సభ్యులకు పరిశుభ్రత, మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన కల్పించారు. మరుగుదొడ్ల వినియోగం, వ్యక్తిగత పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించారు.

February 21, 2026 / 04:31 PM IST

పట్టణ అభివృద్ధికి దాతలు సహకారం మరువలేనిది: ఎమ్మెల్యే

W.G: భీమవరం పట్టణ అభివృద్ధిలో దాతల సహకారం పాత్రల ఎంతో ఉందని, వారి సహాయ సహకారాలు మరువలేనివని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం-తాడేరు రోడ్డులో విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ సహకారంతో ఏర్పాటు చేసిన పంచారామ క్షేత్రమైన శ్రీ సోమేశ్వర స్వామి ఆలయ ముఖ ద్వారం ఆర్చ్‌ను శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్, సిబ్బంది పాల్గొన్నారు.

February 21, 2026 / 04:30 PM IST

మహిళలపై వైసీపీ నేతల వ్యాఖ్యలపై ఆగ్రహం

KDP: టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వెంకటేశ్వర స్వామిని కూడా నీచ రాజకీయాలకు వైసీపీ వాడుకుంటోందని ఆరోపించారు. మహిళలను కించపరిచే విధంగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ హయాంలో భూతులు మాట్లాడిన వారికే మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని భూపేష్ రెడ్డి అన్నారు.

February 21, 2026 / 04:30 PM IST

పాఠశాలలో విజిలెన్స్ కమిటీ సభ్యుల తనిఖీలు

ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలోని సీతానగరం ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలో శనివారం విజిలెన్స్ కమిటీ సభ్యులు డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలోని సరుకుల నిల్వలను, స్టాక్ రికార్డులను పరిశీలించారు. రికార్డుల్లో చూపిస్తున్న సరుకు నిల్వలకు, అక్కడ ప్రత్యక్షంగా ఉన్న నిల్వలకు ఏమాత్రం పొంతన లేదని దీనిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు.

February 21, 2026 / 04:30 PM IST

‘సొంత ఆదాయ వనరులు పెంచుకోవాలి’

TPT: సత్యవేడులో నిర్వహించిన పంచాయతీ సెక్రటరీల శిక్షణలో ఎంపీడీవో చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రతి పంచాయతీ సొంత ఆర్థిక వనరులను పెంపొందించుకోవాలని సూచించారు. ఇంటి పన్ను, ఆస్తి పన్ను, చెరువుల వేలం, సంతలు, భవన అనుమతులు, లైసెన్సులు, అద్దెలు వంటి మార్గాల ద్వారా ఆదాయం పెంచుకోవచ్చన్నారు. ప్రభుత్వ గ్రాంట్లపై మాత్రమే ఆధారపడకుండా పన్నులు సకాలంలో వసూలు చేయాలని అన్నారు.

February 21, 2026 / 04:23 PM IST

ఆదోని జిల్లా సాధన ఉద్యమం 98వ రోజు

KRNL: ఆదోని జిల్లా సాధన ఉద్యమం శనివారానికి 98వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు రఘురామయ్య, కృష్ణమూర్తి గౌడ్ మాట్లాడుతూ.. ప్రజల మోనోభావాలను కూటమి ప్రభుత్వం గౌరవించాలని నాయకులు డిమాండ్ చేశారు. న్యాయబద్ధమైన పోరాటంపై నిర్లక్ష్యం తగదని, సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి ఆదోని జిల్లాపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని JAC నాయకులు కోరారు.

February 21, 2026 / 04:21 PM IST

వైద్య ఖర్చుల కోసం LOC పత్రం అందజేత

E.G: కొవ్వూరు మండలం మద్దూరులంక గ్రామానికి చెందిన ఆకుల రాజకుమారికి వైద్య ఖర్చులకోసం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.5 లక్షల విలువైన LOC పత్రాన్ని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శనివారం కుటుంబ సభ్యులకు అందజేశారు. అవసర సమయంలో బాధితులకు ప్రభుత్వం తోడుగా నిలవడం ఎంతో ముఖ్యమన్నారు. అర్హులైన కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తానన్నారు.

February 21, 2026 / 04:20 PM IST

కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NLR: ఇందుకూరుపేట పంచాయతీలోని శ్రీ ఇందుపూరమ్మ దేశమ్మ దేవతల మహా కుంభాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. అర్చకులు ఎమ్మెల్యేకు ప్రత్యేక పూజలు చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు.

February 21, 2026 / 04:20 PM IST

ఇద్దరు అంతర్ జిల్లా దొంగల అరెస్ట్

ATP: అనంతపురంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ. 25 లక్షల విలువైన 143 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులలో ఒకరైన బాష @ కురుబ రామాంజినేయులు పాత నేరస్థుడని, అతనిపై 15 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

February 21, 2026 / 04:20 PM IST

జీరో వేస్ట్ లిట్టర్ గవర్నెన్స్

VZM: స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జీరో వేస్ట్ లిట్టర్ గవర్నెన్స్ కింద శనివారం రాజాం పురపాలక సంఘ పరిధిలో పోలిపల్లి అమ్మవారి గుడి దగ్గర నుంచి బొబ్బిలి రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. శుభ్రతను ప్రోత్సహించి, చెత్త లేని పరిసరాలను సాధించే లక్ష్యంతో ఈ కార్యక్రమం రూపొందించబడిందని మున్సిపల్ కమిషనర్ రామచందర్రావు తెలిపారు.

February 21, 2026 / 04:10 PM IST

జాతీయ రహదారులను పరిశీలించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ

W.G: ఆకివీడులో ఆర్ అండ్ బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి కృష్ణ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్ హెచ్ 165లోని పలు రహదారులను ఆయన పరిశీలించారు. స్థానిక అధికారులతో చర్చించారు. ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణ రాజుతో ఆయన ప్రత్యేక సమావేశం అయ్యారు. ఆయన వెంట జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఇంఛార్జ్ తహశీల్దార్ ఫరూక్, ఆర్ఐ ఆంజనేయులు పాల్గొన్నారు.

February 21, 2026 / 04:04 PM IST

శ్రీ కాళహస్తీశ్వర స్వామి సేవలో ఎంపీ

SKLM: శ్రీకాకుళం ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామి చిత్రపటాన్ని తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జయదేవ్ పాల్గొన్నారు.

February 21, 2026 / 04:03 PM IST

వీఎంఆర్డీఏలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం

VSP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెల మూడవ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వీఎంఆర్డీఏలో ప్రత్యేక శుభ్రత కార్యక్రమం చేపట్టారు. ఛైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో ఉద్యోగ్ భవన్ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను ఉద్యోగులు తొలగించి శుభ్రపరిచారు. అనంతరం కార్యదర్శి మురళీకృష్ణ సిబ్బందితో పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు.

February 21, 2026 / 04:02 PM IST