• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లు వ్యవసాయ రంగానికి మొండి చెయ్యి

KRNL: కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లలో వ్యవసాయ రంగానికి తగిన నిధులు కేటాయించలేదని నాయకులు రైతు సంఘం, సీపీఐ పలు ప్రజా సంఘాల నాయకులు విరేష్, ఆంజనయ్య విమర్శించారు. ఇవాళ పెద్దకడబూరు తహశీల్దార్ కార్యాలయం నందు ధర్నా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లలో వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని తీవ్రంగా విమర్శించారు.

February 23, 2026 / 12:46 PM IST

‘కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లు వ్యవసాయ రంగానికి మొండి చెయ్యి’

KRNL: కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లలో వ్యవసాయ రంగానికి తగిన నిధులు కేటాయించలేదని నాయకులు రైతు సంఘం, సీపీఐ పలు ప్రజా సంఘాల నాయకులు విరేష్, ఆంజనయ్య విమర్శించారు. ఇవాళ పెద్దకడబూరు తహశీల్దార్ కార్యాలయం నందు ధర్నా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లలో వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని తీవ్రంగా విమర్శించారు.

February 23, 2026 / 12:46 PM IST

అమలాపురం PGRSకు 200 అర్జీలు: జేసీ

కోనసీమ: అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి ప్రజల వద్ద నుంచి సమస్యలపై 200 అర్జీలు వచ్చాయని జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఆమె అడిగి తెలుసుకుని వాటిపై అర్జీలను స్వీకరించారు.

February 23, 2026 / 12:45 PM IST

పెనుకొండలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం

సత్యసాయి: పెనుకొండ మండలం అంబేద్కర్ సర్కిల్‌లో కూటమి నేతలు సోమవారం నిరసన చేపట్టారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. భారతీయ జనతా యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు కుళ్లాయప్ప యాదవ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి, చెప్పులతో తొక్కి నిరసన వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ హటావో – దేశ్ కో బచావో’ అంటూ నినాదాలు చేశారు.

February 23, 2026 / 12:40 PM IST

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన ఎస్సై

ప్రకాశం: కంభంలోని పరీక్ష కేంద్రాలను ఎస్సై శివకృష్ణారెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని, కేంద్రాల వద్ద ఎవరు గుంపులుగా ఉండరాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

February 23, 2026 / 12:38 PM IST

రామచంద్రపురంలో అన్న క్యాంటీన్ తనిఖీ

కోనసీమ: రామచంద్రపురంలోని అన్న క్యాంటీన్‌ను జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉదయభాస్కర్ సోమవారం తనిఖీ చేశారు. ఆహార పదార్థాలను స్వయంగా రుచిచూసి నాణ్యతను పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి భోజన సౌకర్యాలపై ఆరా తీశారు. పేదలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, శుచీశుభ్రతతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అధికారులను, నిర్వాహకులను ఆయన ఆదేశించారు.

February 23, 2026 / 12:30 PM IST

ఘనంగా మాజీ కేంద్రమంత్రి జయంతి వేడుకలు

VZM: దివంగత మాజీ కేంద్రమంత్రి కింజరాపు ఎర్రం నాయుడు 69వ జయంతి సందర్భంగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇవాళ రణస్థలం మండలం జె. ఆర్. పురం సూర్య పబ్లిక్ స్కూల్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళర్పించారు. ఈ సందర్బంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రణస్థలం మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు లంక శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.

February 23, 2026 / 12:30 PM IST

ఏలూరులో బిజెపి స్వచ్ భారత్ కార్యక్రమం

ELR: సంత్ గాడ్గే బాబా జయంతి సందర్భంగా  ఇవాళ ఏలూరు అశోక్ స్తంభం సెంటర్ వద్ద స్వచ్ఛభారత్ కార్యక్రమం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు చౌటపల్లి విక్రమ్ కిషోర్ , జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు అగ్రహారపు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం పరిసరాలను పరిశుభ్రం చేశారు.

February 23, 2026 / 12:27 PM IST

ఏలూరులో బీజేపీ స్వచ్ఛ భారత్ కార్యక్రమం

ELR: సంత్ గాడ్గే బాబా జయంతి సందర్భంగా  ఇవాళ ఏలూరు అశోక్ స్తంభం సెంటర్ వద్ద స్వచ్ఛభారత్ కార్యక్రమం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు చౌటపల్లి విక్రమ్ కిషోర్ , జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు అగ్రహారపు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం పరిసరాలను పరిశుభ్రం చేశారు.

February 23, 2026 / 12:27 PM IST

విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

BPT: ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ నేటి నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కృషి, పట్టుదలే విజయానికి మార్గమని పేర్కొన్నారు. ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు విజయాలతో వెలిగిపోవాలని ఆకాంక్షించారు.

February 23, 2026 / 12:27 PM IST

రైలు కింద పడి ప్రైవేట్ టీచర్ ఆత్మహత్య

PLD: మాచర్ల – విజయవాడ ప్యాసింజర్ రైలు కింద పడి వీరిశెట్టి వైష్ణవి (29) అనే మహిళ మృతి చెందారు. సోమవారం గురజాల రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలు ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఈ విపరీత నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

February 23, 2026 / 12:25 PM IST

కనీస పనికి కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్

ATP: రాయదుర్గం పట్టణంలోని CDPO కార్యాలయం ఎదుట సోమవారం అంగన్వాడీ వర్కర్లు ధర్నా చేపట్టి నిరసనలు తెలిపారు. CITU జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున ఆధ్వర్యంలో అంగన్వాడీలు వేతనాలు పెంచాలంటూ నిరసనలు తెలిపారు. కనీస పనికి కనీస వేతనం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 12:23 PM IST

పరిగిలో యానిమేటర్లతో సమీక్షా సమావేశం

సత్యసాయి: పరిగి మండలంలోని వెలుగు కార్యాలయంలో 14 పంచాయతీల యానిమేటర్లతో సోమవారం సమావేశం నిర్వహించారు. మండల టీడీపీ కన్వీనర్ గోవింద్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి లబ్ధిదారునికి చేరేలా చురుకుగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పనిచేయాలని యానిమేటర్లకు దిశానిర్దేశం చేశారు.

February 23, 2026 / 12:23 PM IST

ఇంటర్ పరీక్షల వేళ పటిష్ట పోలీస్ బందోబస్తు

అన్నమయ్య: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా సోమవారం జిల్లావ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ భద్రత కట్టుదిట్టం చేశారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

February 23, 2026 / 12:22 PM IST

‘స్వచ్ఛ భారత్‌కు స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా’

E.G: స్వచ్ఛ భారత్‌కు అసలైన స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు PVN మాధవ్ పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రిలో నిర్వహించిన స్వచ్చ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి పరిసరాలను పరిశుభ్రం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంత్ గాడ్గే బాబా జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

February 23, 2026 / 12:20 PM IST