KKD: పిఠాపురం ఎక్సైజ్ పరిధిలో మద్యం అమ్మకాలు కేవలం MRP ధరలకే జరుగుతున్నాయని ఎక్సైజ్ సూపరింటెండెంట్ అధికారి సుబ్బలక్ష్మి స్పష్టం చేశారు. ఆదివారం తమ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి ఎక్కువ ధరలకు మద్యం అమ్మితే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో పార్టీలో ఆదివారం నూతన చేరికలు జరిగాయి. 31వ డివిజన్ అక్కచెరువుపాడుకు చెందిన పలువురు TDP తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో కష్టపడి పని చేయాలని MLA సూచించారు.
కడప: నగరంలో గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలు, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు జిల్లా పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. ఎస్పీ ఆదివారం పాత బస్టాండ్, రైల్వే స్టేషన్, బుగ్గవంక వంటి ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో గాలింపు చేపట్టారు. స్పెషల్ పార్టీ పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు.డ్రోన్ల నిఘా ద్వారా దాడులు నిర్వహిస్తామన్నారు.
సత్యసాయి: పుట్టపర్తి రూరల్ పరిధిలోని గంగిరెడ్డిపల్లిలో పేకాటాడుతున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. సీఐ సురేష్ పర్యవేక్షణలో ఏఎస్ఐ ప్రసాద్ ఈ దాడులు నిర్వహించారు. నిందితుల నుంచి రూ.44,250 నగదు, 8 మొబైల్ ఫోన్లు, 5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన సురేష్ అనే వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అనకాపల్లి కలెక్టరేట్‌లో ఆదివారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలవేసి నివాళులర్పించారు. బ్రిటిష్ సైన్యాన్ని ముచ్చెమటలు పట్టించిన స్వతంత్ర సమరయోధుడు నరసింహారెడ్డి అని అన్నారు. ఆయన స్ఫూర్తితో ముందుకు నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.
KRNL: ఏపీ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు నాగర్ కర్నూల్ జిల్లా కమ్మేర గ్రామంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా రజక కుటుంబంపై జరిగిన దాడిని ఇవాళ తీవ్రంగా ఖండించారు. దాడిలో పసిబిడ్డ మృతి చెందడం దుర్మార్గమని పేర్కొన్నారు. నిందితులపై హత్య కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి భద్రత, నష్టపరిహారం కల్పించాలని డిమాండ్ చేశారు.
ASR: యువతకు నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమమే మన్ కీ బాత్ కార్యక్రమమని పాడేరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వనుము చిట్టబ్బాయి అన్నారు. ప్రధాని మోడీ మనసులో మాట కార్యక్రమాన్ని ఆదివారం లైవ్ టెలికాస్ట్ ద్వారా కళాశాలలో విద్యార్థులకు చూపించారు. దేశాభివృద్ధికి యువత భాగస్వామ్యం తదితర అంశాలపై కార్యక్రమంలో మాట్లాడడం జరుగుతుందన్నారు.
SKLM: ప్రముఖ పుణ్య క్షేత్రం కాణిపాకం వరసిద్ది వినాయకుణ్ణి ఆదివారం కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో, పూర్ణకుంభతో కేంద్ర మంత్రికి కాణిపాకం వరసిద్ధి వినాయక దేవస్థానం అర్చకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆర్చక స్వాములు శేష వస్త్రం, ప్రసాదం ఆయనకు అందించి, ఆశీర్వదించారు.
VZM: బొండపల్లి మండలంలోని గొల్లుపాలెం గ్రామంలో 100 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఆదివారం ఆ గ్రామంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్ పోతల రమణమ్మ ఆధ్వర్యంలో 100 కుటుంబాలు టీడీపీలో చేరాయి. పార్టీలో చేరిన వారికి రాష్ట్రమంత్రి కొండపల్లి శ్రీనివాస్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఆదివారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.4,24,197 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 658 స్వామివారిని దర్శించుకున్నారని, 16 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారన్నారు. అలాగే, 5,218 మంది అన్న ప్రసాదం స్వీకరించారని పేర్కొన్నారు.
E.G: మాజీ సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలంటూ క్రైస్తవ సోదరులు రాష్ట్ర ఇంటెలెక్చువల్ విభాగం కార్యదర్శి కొడమంచిలి హరీష్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టిన సంగతి విదితమే. రావులపాలెంలో వైసీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఆదివారం నాటికీ గుణదల వరకు సాగనుంది. కూటమి పాలంలో ప్రజలు విసుగు చెందారని రాబోయేది మరల YS జగన్ అని సుధాకర్ అన్నారు.
WG: మన సంస్కృతి సాంప్రదాయాలు చెరగని ముద్రలని, ఉగాది సంక్రాంతి, దసరా లాంటి పండుగలు మన సంప్రదాయ పండుగలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఈ మేరకు ఆదివారం మార్చి 19న శ్రీభీమేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే ఉగాది పురస్కార వేడుకల బ్రోచర్‌ను ఎమ్మెల్యే భీమవరం కార్యాలయంలో ఆవిష్కరించి మాట్లాడారు.
చిత్తూరు జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో “పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్” కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం తెలిపింది. రేపు ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను పోలీస్ ఉన్నతాధికారులకు నేరుగా తెలియజేసే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జోన్-1 కోఆర్డినేటర్‌గా ఉన్న నాగేశ్వరరావు హార్ట్ స్ట్రోక్‌కు గురై మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
NDL: డోన్ మున్సిపల్‌లో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ మున్సిపల్ కార్మికులు, సీఐటీయు నాయకులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా ఆదివారం సన్మానించారు. గతంలో తప్పుగా రిటైర్మెంట్ లిస్ట్‌లో వచ్చిన కార్మికురాలు వెంకటలక్ష్మీ ఉద్యోగంలో తిరిగి చేరడం, కార్మికుల సమస్యలకు కమిషనర్ తక్షణ స్పందనకు ధన్యవాదాలు తెలిపారు.