కోనసీమ: రామచంద్రపురంలో ఆదివారం మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో 26 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు ఉపాధి ప్రాజెక్టు డైరెక్టర్ రామ్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు రామచంద్రపురం పట్టణంలో 36 జాబ్ మేళాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు మంత్రి, కూటమి సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం అభినందనలు తెలిపారు.
SKLM: బీజేపీ జిల్లా అధ్యక్షులు తేజేశ్వరరావు ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ 2026 కార్యక్రమం గాయత్రీ కాలేజ్లో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు గోపీ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బూత్ స్థాయి నుంచి బీజేపీ పార్టీ బలోపేతం చేయాలని కార్యకర్తలకు మార్గ నిర్దేశం చేశారు.
WG: జిల్లాలో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ టైమ్ లో విద్యార్థులు ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని అధికారులు తెలిపారు. ఇవాళ రాత్రి తగినంత నిద్రపోయి, రేపు ఉదయం తేలికపాటి అల్పాహారం తీసుకుని పరీక్షా కేంద్రానికి ముందుగానే బయల్దేరాలని పేర్కొన్నారు. హాల్ టికెట్, పెన్నులు వంటి అవసరమైన వస్తువులను పడుకునే ముందే రెడీ చేసుకోవాలని సూచించారు.
NDL: మహానందీశ్వర స్వామి దేవస్థానంలో నిర్మించనున్న 55 గదుల వసతి సముదాయానికి ఎన్ఆర్ఐ దాత సరోజినీ వడ్లమూడి రూ.1.25 లక్షలు విరాళంగా ప్రకటించారు. మొదటి అంతస్తు నిర్మాణానికి ముందుగా రూ.65 లక్షల చెక్కును ఆలయ ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డికి అందజేశారు. తన తల్లిదండ్రులు వీరమాచినేని వీర రాఘవయ్య, నాగభూషణమ్మ జ్ఞాపకార్థంగా ఈ విరాళం అందజేస్తున్నట్లు తెలిపారు.
AKP: జనసేన పార్టీ బలోపేతానికి పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం రాంబిల్లి మండలం వెంకటాపురం జనసేన పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్టీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారించాలన్నారు.
అన్నమయ్య: రామాపురం సుద్దమల్ల గ్రామంలోని ఓబుల్ రెడ్డిగారిపల్లె దిగువ హరిజనవాడలో నిర్మాణ దశలో ఉన్న శ్రీరామాలయ పనులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ ఓ ట్రస్ట్ ద్వారా రూ.10 లక్షల నిధులు మంజూరు చేసినట్లు గుర్తుచేస్తూ.. నాణ్యతలో రాజీ లేకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
CTR: బైరెడ్డిపల్లి మండలంలో జరిగిన కార్యక్రమంలో ఎన్. అమర్నాథ్ రెడ్డి లబ్ధిదారులకు ఈ-సైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం రూ.112.50 కోట్ల బ్యాంక్ లింకేజీ చెక్కులను అందజేశారు. మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని, ప్రతి ఇంటికో మహిళా పారిశ్రామికవేత్తగా రాణించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయకత్వమే అవసరమని పేర్కొన్నారు.
KRNL: మంత్రాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలోని శ్రీ రాఘవేంద్ర స్వామిని ఆదివారం అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రాలయం టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్ర రెడ్డి తనయులు టీడీపీ యువనేత రాకేష్ రెడ్డి, టీడీపీ నాయకులు రామిరెడ్డి, సురేష్ నాయుడు, మల్లికార్జున, వెంకటేష్ ఎంపీకి శాలువా కప్పి సన్మానించారు.
ATP: కళ్యాణదుర్గం నియోజకవర్గం నాగిరెడ్డిపల్లిలో ఆదివారం YCP ఆధ్వర్యంలో ‘జనం మాట-జగనన్న బాట’ డిజిటల్ రచ్చబండ నిర్వహించారు. రాష్ట్రంలోనే మొదటిసారి జూమ్ మీటింగ్ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టడం విశేషం. మాజీ ఎంపీ తలారి రంగయ్య, ఇతర ముఖ్య నేతలు పాల్గొని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకానికి మద్దతుగా తీర్మానం చేశారు.
TPT: అవిలాలలో జిల్లా TDP కార్యాలయ శంకుస్థాపన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, MLC దీపక్ రెడ్డి, తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ శంకుస్థాపన పునాది మాత్రమే కాకుండా కార్యకర్తల ఆశయాలకు శాశ్వత నిలయం అని తెలిపారు.
KDP: దిగువరాచపల్లె గ్రామంలో నిర్వహించిన గ్రామసభ కార్యక్రమానికి నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబు నాయకత్వంతోనే సాధ్యమని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలని సూచించారు.
VZM: జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్‌లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు.
కృష్ణా: అవనిగడ్డ గుర్రపు చెరువు వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. గర్భాలయంలో అమ్మవారు, ఆలయం ఎదుట ధ్వజస్తంభ ప్రతిష్ట వేద పండితులచే జరిపించారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ విచ్చేసి అమ్మవారి ప్రతిష్టా మహోత్సవంలో భాగస్వాములయ్యారు.
KKD: రేపటి నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి పరీక్షా కేంద్రాలను సామర్లకోట ఎస్సై రాజా ఆదివారం పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి స్టేషన్ సిబ్బందితో కలిసి సామర్లకోట పట్టణంలో గల పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
E.G: దొంగతనాలతో దూబచర్ల గ్రామ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని, దొంగతనాలను అదుపు చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారని CITU జిల్లా నాయకులు కొక్కిరిపాటి వెంకట్రావు ఆదివారం విమర్శించారు. బస్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికుల మొబైల్ ఫోన్స్, ఇళ్లలోని విలువైన వస్తువులు చోరీకి గురవుతున్నాయని ఆయన చెప్పారు. ఈ మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.