• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

తెలుగు వీరుడు నరసింహారెడ్డి వర్ధంతి వేడుకలు

NDL: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి త్యాగం యువతకు స్ఫూర్తిదాయకమని, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని జిల్లా రెవెన్యూ అధికారి డి. రాము నాయక్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో స్వాతంత్య్ర సమరయోధుల్లో ఒకరైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 179వ వర్ధంతి కార్యక్రమ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

February 22, 2026 / 03:32 PM IST

వందరోజుల ప్రణాళికను పరిశీలించిన ఎమ్మెల్యే

SKLM: ఎచ్చెర్ల మండలం బొంతల కోడూరు ప్రభుత్వ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థుల కోసం అమలు చేస్తున్న “వంద రోజులు ప్రణాళిక-భవిష్యత్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఈశ్వరరావు ఆదివారం పరిశీలించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ నాయకత్వంలో అమలవుతున్న ఈ కార్యక్రమం విద్యార్థుల ఫలితాలను మెరుగుపర్చేందుకు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

February 22, 2026 / 03:31 PM IST

రాచూరులో బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

సత్యసాయి: రొద్దం మండలం రాచూరు గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఆదివారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. రొద్దం మండల టీడీపీ కన్వీనర్ నరహరి మాట్లాడుతూ.. మంత్రి సవిత ఆదేశాల మేరకు రాచూరు బస్టాండ్ నుంచి జక్కలచెరువు గ్రామం వరకు రూ.1 కోటి నిధులతో బీటీ రోడ్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ రహదారి నిర్మాణంతో గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం అవుతాయని తెలిపారు.

February 22, 2026 / 03:30 PM IST

‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి త్యాగం యువతకు స్ఫూర్తి’

KDP: స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేశారని, ఆయన యువతకు స్ఫూర్తి అని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా రేనాటి సూర్యచంద్రుల సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ప్రొద్దుటూరులోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

February 22, 2026 / 03:27 PM IST

అబ్బుర పరుస్తున్న బుడ్డోడి ప్రతిభ

W.G: పాలకొల్లు శంభునిపేటలో ప్రాతః కాలంలో కొన్ని క్షణాలపాటు దృగ్విషంగా కనువిందు చేసిన ‘ఎర్రని సూరీడ్ని’ ఒకటో తరగతి చదువుతున్న వడ్డి గౌరీ శంకర్ అనే బుడతడు సెల్ ఫోన్లో బందించాడు. ఆదివారం తల్లి శైలజతో కలిసి వాకింగ్ చేస్తుండగా తల్లి చేతిలోని సెల్ఫోన్ తీసుకుని క్లిక్ మనిపించాడు. ఈ ఫోటోని వీక్షించిన వారందరూ గౌరీ శంకర్ ఫోటోగ్రఫీ ప్రతిభను ఔరా అంటూ మెచుకుంటున్నారు.

February 22, 2026 / 03:21 PM IST

ఘనంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమం

ATP: గుంతకల్‌లోని రెడ్డి సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆదివారం తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 179వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సంఘ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రాణత్యాగాన్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, రెడ్డి సోదరులు పాల్గొన్నారు.

February 22, 2026 / 03:20 PM IST

శ్రీ పోలేరమ్మ తల్లి సన్నిధిలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

NLR: అల్లూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ పోలేరమ్మ తల్లిని ఆదివారం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజల ఆయురారోగ్యాలు, సుఖశాంతుల కోసం అమ్మవారిని ప్రార్థించారు. గ్రామదేవతల ఆశీస్సులతో సమాజం సుభిక్షంగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

February 22, 2026 / 03:20 PM IST

వైసీపీ ఎమ్మెల్సీలను బర్తరఫ్ చేయాలి: ఎమ్మెల్యే

E.G: వైసీపీ ఎమ్మెల్సీలను బర్తరఫ్ చేయాలని రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పేర్కొన్నారు. మండపేట టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సభ గౌరవాన్ని కాలరాసారనీ విమర్శించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అగౌరవపర్చారనీ పేర్కొన్నారు. ఈ అపచారానికి జగన్ లెంపలు వేసుకోవాలన్నారు.

February 22, 2026 / 03:20 PM IST

రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం

అనకాపల్లి కలెక్టరేట్‌తో పాటు జిల్లాలో మున్సిపల్, డివిజన్, మండల స్థాయిలో పీజీఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్ కార్యక్రమాలను ఈనెల 23వ తేదీన నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. స్వయంగా రాలేని వారు meekosam.ap.gov.in వెబ్ సైట్ ద్వారా తమ అర్జీలను పంపించాలని సూచించారు.

February 22, 2026 / 03:19 PM IST

ఉరుసులో ఎంపీ, ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

KRNL: గంజహళ్లి గ్రామంలో మహాత్మ బడే సాహెబ్ 332వ ఉరుసు మహోత్సవానికి ఆదివారం ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే బీ.వి జయ నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. దర్గా వద్ద పీఠాధిపతులు ముస్లిం సంప్రదాయంలో స్వాగతం పలికి, అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన వారికి టీడీపీ శ్రేణులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.

February 22, 2026 / 03:16 PM IST

ఘనంగా జిల్లా స్థాయి పారా బాడ్మింటన్ పోటీలు

VZM: జిల్లా స్థాయి పారా బాడ్మింటన్ పోటీలు రాజీవ్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అధ్యక్షులు కె.దయానంద్ మాట్లాడుతూ.. వీల్ చైర్, ఆర్థో కేటగిరిలకు సంబందించి మెన్, ఉమెన్ విభాగాలకు పోటీలు నిర్వహించామని, జిల్లా వ్యాప్తంగా 28 మంది హాజరు కాగా 20 మంది ఎంపికయ్యారన్నారు. వీరు ఈనెల 25, 26వ తేదీలలో జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని అన్నారు.

February 22, 2026 / 03:16 PM IST

‘ప్రతి కుటుంబంలో వ్యాపారవేత్త తయారవ్వాలి’

PPM: ప్రతి కుటుంబంలో ఒకరు వ్యాపారవేత్తగా తయారవ్వాలని జిల్లా డీఆర్డీఏ పీడీ ఏం సుధారాణి తెలిపారు. ఆదివారం వీరఘట్టం మండలం తలవరం గ్రామంలో మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలలో రుణాలు తీసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందిస్తామని పేర్కున్నారు.

February 22, 2026 / 03:14 PM IST

తాడేపల్లిగూడెంలో ఉచిత కంటి వైద్య శిబిరం

W.G: తాడేపల్లిగూడెం కడగట్లలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఫైర్ ఆఫీసర్ మురళి కొండబాబు ప్రారంభించారు. పోషకాహార లోపంతో కంటి సమస్యలు వస్తున్నాయని ఆయన హెచ్చరించారు. లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స పొందకపోతే చూపు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. శిబిరంలో రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు.

February 22, 2026 / 03:12 PM IST

మండల సమస్యలపై గలమెత్తిన సభ్యులు

VZM: గరివిడిలో ఆదివారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాడి వేడి వేడిగా సాగింది. ఎంపీడీవో సుబ్రమణ్యం అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ మీసాల విజయలక్ష్మి, జడ్పీటీసీ సభ్యుడు వాకాడ శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. యూరియాపై రైతులు ఆందోళన చెందుతున్నారని, అధిక ధరలకు ప్రైవేట్ షాపులు అమ్ముతున్నారని ఆరోపించారు.

February 22, 2026 / 03:12 PM IST

వసతి గృహంలో హ్యాపీ సండేను వివరించిన ఎమ్మెల్యే

అన్నమయ్య: మదనపల్లెలో బాలికల వసతి గృహంలో ఆదివారం హ్యాపీ సండే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరై.. పిల్లలందరికీ హ్యాపీ సండే పై వివరించి, ఆదివారం హ్యాపీ సండే ప్రాముఖ్యతను ఎమ్మెల్యే పిల్లలకు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తీసుకొచ్చారన్నారు.

February 22, 2026 / 03:11 PM IST