• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

లబ్ధిదారులకు ఈ-సైకిళ్లు పంపిణీ

CTR: బైరెడ్డిపల్లి మండలంలో జరిగిన కార్యక్రమంలో ఎన్. అమర్నాథ్ రెడ్డి లబ్ధిదారులకు ఈ-సైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం రూ.112.50 కోట్ల బ్యాంక్ లింకేజీ చెక్కులను అందజేశారు. మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని, ప్రతి ఇంటికో మహిళా పారిశ్రామికవేత్తగా రాణించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయకత్వమే అవసరమని పేర్కొన్నారు.

February 22, 2026 / 05:13 PM IST

ఎంపీని కలిసిన టీడీపీ నేతలు

KRNL: మంత్రాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలోని శ్రీ రాఘవేంద్ర స్వామిని ఆదివారం అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రాలయం టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్ర రెడ్డి తనయులు టీడీపీ యువనేత రాకేష్ రెడ్డి, టీడీపీ నాయకులు రామిరెడ్డి, సురేష్ నాయుడు, మల్లికార్జున, వెంకటేష్ ఎంపీకి శాలువా కప్పి సన్మానించారు.

February 22, 2026 / 05:10 PM IST

కళ్యాణదుర్గంలో వినూత్నంగా డిజిటల్ రచ్చబండ

ATP: కళ్యాణదుర్గం నియోజకవర్గం నాగిరెడ్డిపల్లిలో ఆదివారం YCP ఆధ్వర్యంలో ‘జనం మాట-జగనన్న బాట’ డిజిటల్ రచ్చబండ నిర్వహించారు. రాష్ట్రంలోనే మొదటిసారి జూమ్ మీటింగ్ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టడం విశేషం. మాజీ ఎంపీ తలారి రంగయ్య, ఇతర ముఖ్య నేతలు పాల్గొని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకానికి మద్దతుగా తీర్మానం చేశారు.

February 22, 2026 / 05:10 PM IST

జిల్లా TDP పార్టీ కార్యాలయంకు శంకుస్థాపన

TPT: అవిలాలలో జిల్లా TDP కార్యాలయ శంకుస్థాపన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, MLC దీపక్ రెడ్డి, తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ శంకుస్థాపన పునాది మాత్రమే కాకుండా కార్యకర్తల ఆశయాలకు శాశ్వత నిలయం అని తెలిపారు.

February 22, 2026 / 05:09 PM IST

‘గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం అవసరం’

KDP: దిగువరాచపల్లె గ్రామంలో నిర్వహించిన గ్రామసభ కార్యక్రమానికి నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబు నాయకత్వంతోనే సాధ్యమని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలని సూచించారు.

February 22, 2026 / 05:08 PM IST

‘రేపు కలెక్టరేట్‌లో అర్జీల స్వీకరణ’

VZM: జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్‌లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు.

February 22, 2026 / 05:03 PM IST

వైభవంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రతిష్ట

కృష్ణా: అవనిగడ్డ గుర్రపు చెరువు వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. గర్భాలయంలో అమ్మవారు, ఆలయం ఎదుట ధ్వజస్తంభ ప్రతిష్ట వేద పండితులచే జరిపించారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ విచ్చేసి అమ్మవారి ప్రతిష్టా మహోత్సవంలో భాగస్వాములయ్యారు.

February 22, 2026 / 05:01 PM IST

ఇంటర్ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఎస్సై

KKD: రేపటి నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి పరీక్షా కేంద్రాలను సామర్లకోట ఎస్సై రాజా ఆదివారం పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి స్టేషన్ సిబ్బందితో కలిసి సామర్లకోట పట్టణంలో గల పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

February 22, 2026 / 05:00 PM IST

‘దూబచర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి’

E.G: దొంగతనాలతో దూబచర్ల గ్రామ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని, దొంగతనాలను అదుపు చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారని CITU జిల్లా నాయకులు కొక్కిరిపాటి వెంకట్రావు ఆదివారం విమర్శించారు. బస్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికుల మొబైల్ ఫోన్స్, ఇళ్లలోని విలువైన వస్తువులు చోరీకి గురవుతున్నాయని ఆయన చెప్పారు. ఈ మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.

February 22, 2026 / 05:00 PM IST

ఇంటర్ పరీక్షలకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ

కోనసీమ: రేపటి నుంచి ప్రారంభంకానున్న ఇంటర్ పరీక్షల కోసం కోనసీమ వ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాహుల్ మీనా ఆదివారం తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, విద్యార్థులు నిమిషం నిబంధనను పాటిస్తూ 10 నిమిషాల ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులందరూ ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి విజయం సాధించాలన్నారు.

February 22, 2026 / 05:00 PM IST

గంగాణమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

GNTR: పెదకాకాని మండలం తక్కెళ్ళపాడు గ్రామంలోని శ్రీశ్రీశ్రీ గంగాణమ్మ తల్లి దేవస్థానం 10వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అమ్మవారికి పూజలు చేసి పూజా సామాగ్రి గదిని ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

February 22, 2026 / 04:59 PM IST

VIDEO: రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు.. ఇబ్రహీంపట్నం నుంచి కొండపల్లి వైపుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న ఓ వ్యక్తి ద్విచక్ర వాహనం అదుపుతప్పి బారికేడ్లను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారన్నారు. ఈ విషయంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

February 22, 2026 / 04:54 PM IST

తిరుపతిలో ‘డయల్ యువర్ కమిషనర్’కు పిలుపు

తిరుపతి నగర ప్రజలు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను వినియోగించుకోవాలని కమిషనర్ ఎన్. మౌర్య సూచించారు. సోమవారం ఉదయం 10.30 నుంచి 11.30 వరకు కార్యక్రమం నిర్వహిస్తామని, 0877-2227208 నంబర్‌కు కాల్ చేసి సమస్యలు తెలియజేయాలని తెలిపారు.

February 22, 2026 / 04:51 PM IST

గరుగు చింతలపల్లి చెరువును పరిశీలించిన మహేశ్వర్ రెడ్డి

ATP: గరుగు చింతలపల్లి చెరువుకు నీరు విడుదల చేయకపోవడంపై వైసీపీ మండల అధ్యక్షుడు పొన్నపాటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాకే శైలజానాథ్ నాయకత్వంలో అధికారులకు విన్నవించినా ఫలితం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. రెండేళ్లుగా చెరువు ఎండిపోవడంతో సాగు, తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదన్నారు.

February 22, 2026 / 04:50 PM IST

రేపు యథావిధిగా మీకోసం కార్యక్రమం

ప్రకాశం: ఒంగోలులో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ‘మీకోసం కార్యక్రమం’ (PGRS), రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజా బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మండల స్థాయిలలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. అలాగే, నమోదైన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు

February 22, 2026 / 04:47 PM IST