• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న పాట్నా హైకోర్టు న్యాయమూర్తి

VSP: సింహాచలం సింహాద్రి అప్పన్నను పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.అనుపమ చక్రవర్తి తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. వారికి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధ స్వాగతం పలికి కప్ప స్తంభం అలింగనం చేయించారు. అనంతరం స్వామి దర్శనం కల్పించారు. వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

February 22, 2026 / 10:33 AM IST

చినపారుపూడిలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కు పంపిణీ

కృష్ణా: మానవత్వంతో పేదలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. పెదపారుపూడి మండలం చినపారుపూడి గ్రామంలో శ్యామల రాజు కుటుంబానికి మంజూరైన రూ. 1,64,543 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కును వారి గృహానికి వెళ్లి స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

February 22, 2026 / 10:31 AM IST

శ్రీ కొత్తమ్మ తల్లి ధర్మాదాయ హుండీ లెక్కింపు 27న

SKLM: ఉత్తరాంధ్ర ఇలవేల్పు భక్తుల పాలిట కల్పవల్లి శ్రీ కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి ధర్మాదాయ హుండీ లెక్కింపు ఫిబ్రవరి 27 న ఆలయం ప్రాంగణంలో జరుగుతుందని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వాకచర్ల రాధాకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోంపేట దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఆలయం పాలకమండలి ఆలయం భక్తులు పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో లెక్కింపు జరుగుతుందన్నారు.

February 22, 2026 / 10:30 AM IST

రూ. 91 లక్షల బకాయి.. 3 దుకాణాలు సీజ్

నెల్లూరు నగరపాలక సంస్థకు అద్దె, రెన్యువల్ బకాయిలు చెల్లించని కారణంగా కమిషనర్ వై.ఓ నందన్ ఆదేశాల మేరకు శనివారం అధికారులు 3 దుకాణాలను సీజ్ చేశారు. ప్రకాశం పంతులు కాంప్లెక్స్‌లో షాప్ నం. 8 (రూ. 24.55 లక్షలు), ఏ.సి. బొమ్మ కాంప్లెక్స్‌లో షాప్ నం. 9, 10 బకాయిలు ఉండటంతో రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో ఈ చర్యలు తీసుకున్నారు.

February 22, 2026 / 10:30 AM IST

ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెం గ్రామం రాళ్ళరేవు హైస్కూల్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో ప్రధానంగా మధుమేహం, గుండె ఎముకలు, ఊపిరితిత్తులు, దంత, స్త్రీల ప్రసూతి, జనరల్ సర్జరీ, జనరల్ వ్యాధులకు వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు.

February 22, 2026 / 10:30 AM IST

క్రికెట్ ఆడిన మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి

ATP: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హ్యాపీ సండే కార్యక్రమం గుంతకల్లు రైల్వే క్రీడా మైదానంలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి హాజరయ్యారు. అనంతరం ఆమె కాసేపు క్రికెట, బ్యాట్మెంటన్ ఆటలను ఆడారు. కమిషనర్ మాట్లాడుతూ.. జీవితంలోని పని ఒత్తిడిని పక్కనపెట్టి ‘హ్యాపీ సండే’ను ఒక ఆనందం వేదికగా మార్చుకుందామని ప్రజలకు సూచించారు.

February 22, 2026 / 10:30 AM IST

ప్రమాదంలో గాయపడిన గుర్తు తెలియని మహిళ

AKP: అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని మహిళ శనివారం మృతి చెందినట్లు మునగపాక ఎస్సై ప్రసాదరావు తెలిపారు. మండలంలో గణపర్తి గ్రామ సమీపంలో ఈనెల 19వ తేదీన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మహిళ తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. స్థానికులు వెంటనే అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో చేర్పించినట్లు వెళ్లడించారు.

February 22, 2026 / 10:24 AM IST

హెల్మెట్ ధరించడంపై వాహనదారులకు అవగాహన

కృష్ణా: గుడివాడ మండలం మల్లాయిపాలెం రైల్వే గేట్ వద్ద హెల్మెట్ ధరించడంపై ఎస్సై చంటిబాబు వాహనదారులకు ఇవాళ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు వాహనంపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ప్రజల భద్రత పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు.

February 22, 2026 / 10:17 AM IST

కెనరా బ్యాంకు సెక్యూరిటీ గార్డ్‌పై దాడి

KDP: రాజంపేటలోని మారుతి ప్రసన్న లాడ్జి వద్ద ఉన్న కెనరా బ్యాంకు ఏటిఎం వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్ ఉదయగిరి రాజాపై మద్యం మత్తులో వచ్చిన యువకులు దాడికి పాల్పడ్డారు. బ్యాంకులోకి వెళ్తున్న వారిని ప్రశ్నించడంతో చైర్‌తో తలపై దాడి చేయగా రాజాకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన సెక్యూరిటీ గార్డును రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

February 22, 2026 / 10:15 AM IST

శ్రీ స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న మంత్రి

ELR: శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామి, అమ్మవార్లను గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ రాజగోపురం వద్ద అధికారులు మంత్రికి ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచననలు అందజేసి శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాలు, చిత్రపటంతో మంత్రిని సత్కరించారు.

February 22, 2026 / 10:07 AM IST

చిక్కాలవలసలో విషాద ఛాయలు

SKLM: నరసన్నపేట(M) చిక్కాలవలస కి చెందిన అమృత్ కుమార్ CRPF జవాన్ మణిపూర్ లో విధి నిర్వహణలో గుండెపోటుతో మరణం చెందారు. ఆయన పార్థివదేహాన్ని అధికారులు ఆదివారం స్వగ్రామానికి తీసుకువచ్చారు. జడ్పిటిసి కృష్ణ చైతన్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జవాన్ అంతిమయాత్రలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయ.

February 22, 2026 / 10:03 AM IST

వేమగిరిలో మొదలైన ఆధ్యాత్మిక వైభవం

E.G: కడియం మండలం వేమగిరిలో ఆధ్యాత్మిక వైభవం మొదలైంది. కెవిఆర్ లేఔట్‌లో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పూలరథంపై భక్తులు ఊరేగించారు. వందలాదిమంది మహిళా భక్తులు సంప్రదాయ పసుపు చీరలు ధరించి చేత కాషాయ జెండాలు పట్టి నమో వెంకటేశా అంటూ ముందుకు సాగారు. ఈనెల 26వ తేదీన ఆలయ ప్రతిష్ట జరగనుంది.

February 22, 2026 / 10:01 AM IST

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

GNTR: రాష్ట్రంలోని పేద ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అత్యంత శ్రద్ధ తీసుకుంటుందని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. పొన్నూరు మండల పరిధిలోని 25 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆదివారం రూ. 13,15,872/- చెక్కులను పంపిణీ చేశారు. లబ్ధిదారులు చెక్కులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

February 22, 2026 / 10:00 AM IST

ప్రారంభమైన ఉరవకొండ గవిమఠం బ్రహ్మోత్సవాలు

ATP: ఉరవకొండ గవిమఠం శ్రీచంద్రమౌళీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. మఠం ప్రాంగణంలో అర్చకుల మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా గంగపూజ, కంకణధారణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కరిబసవేశ్వర స్వామి జీవసమాధి వద్ద నాగపూజ జరిపారు. నేడు స్వామివారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.

February 22, 2026 / 10:00 AM IST

‘రాష్ట్ర వనరులన్నీ వైసీపీ నేతలు దోచుకున్నారు’

KKD: గత YCP ప్రభుత్వం రాష్ట్రంలో ల్యాండ్, సాండ్, వైన్, మైన్ ఇలా అన్ని వనరులను దోచుకుందని కాకినాడ MLA వనమాడి కొండబాబు ఆరోపించారు. శనివారం TDP కార్యాలయంలో కూటమి నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. చివరికి తిరుమల లడ్డూను కూడా వదలలేదని విమర్శించారు. కల్తీ జరిగిన విషయాన్ని మాజీ ఛైర్మన్ సుబ్బారెడ్డి అంగీకరించారని తెలిపారు.

February 22, 2026 / 10:00 AM IST