• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు

CTR: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 23 నుంచి జరగబోయే ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్మీడియెట్ డీఐఈవో రఘుపతి ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, ప్రతి కేంద్రం వద్ద కళాశాల పేరు, పరీక్ష కేంద్రం నంబర్ కనిపించేలా ఫ్లెక్సీలు చేయాలన్నారు. నో సెల్‌ఫోన్ జోన్ అని విద్యార్థులకు అర్థమయ్యేలా బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.

February 20, 2026 / 09:03 AM IST

నేడు హుండీ ఆదాయం లెక్కింపు

SKLM: జలుమూరు మండలం శ్రీ ముఖలింగం క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాల అనంతరం స్వామివారి హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించనున్నట్లు ఆలయ ఈవో కె.ఏడు కొండలు గురువారం ప్రకటనలో తెలిపారు. ఆలయ నిబంధనల మేరకు దేవ దాయ శాఖ అధికారులు, పాలక మండలి, అర్చకుల సమక్షంలో లెక్కింపు నిర్వహించనున్నట్లు తెలిపారు.

February 20, 2026 / 09:02 AM IST

నేడు సామాజిక న్యాయ దినోత్సవం

GNTR: నేడు అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి కోటా మాలాద్రి తెలిపారు. గుంటూరులోని మల్లయ్య లింగం భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశ సంపద కొద్దిమంది కార్పొరేట్ల చేతుల్లో కేంద్రీకృతమైందని, అసమానతలు పెరిగాయని విమర్శించారు.

February 20, 2026 / 09:01 AM IST

గురుకుల పాఠశాలలో కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

NDL: బుచ్చి(మం) రామచంద్రపురం గురుకుల పాఠశాలలో కరెంటు షాక్ తగిలి ఓ కూలి మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పాఠశాల ప్రహరీపై ఇనుప ముల్ల కంచె ఏర్పాటు చేస్తుండగా నెల్లూరుకు చెందిన ఓ కూలి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే బుచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి నుంచి నెల్లూరుకు తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు.

February 20, 2026 / 08:56 AM IST

మద్యానికి బానిసైన వ్యక్తి ఆత్మహత్య

VZM: మద్యానికి బానిసైన భర్తను భార్య మందలించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయనగరంలో జరిగింది. వన్ టౌన్ ఎస్సై ఎస్సై అశోక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్‌కు చెందిన బెవర శ్రీనివాస్ (28) కూలీ పనులు చేస్తు జీవనం సాగించే వాడు. మద్యానికి బానిస కావడంతో ఆయన భార్య రేవతి మందలించింది.

February 20, 2026 / 08:48 AM IST

కారు బోల్తా ఘటనలో మహిళ మృతి

ASR: రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామ మడేరు అనకట్ట సమీపంలో శుక్రవారం ఉదయం కారు బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో కొండపల్లి గ్రామానికి చెందని బీరబోయిన సీతారత్నం (30) మృతి చెందినట్లు జడ్డంగి PHC డా. నాగార్జున తెలిపారు. ఈ ప్రమాదంలో బీరబోయిన బాబూరావు, బీరబోయిన దమయంతి, లక్ష్మీ, వరప్రసాద్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం.

February 20, 2026 / 08:47 AM IST

అనంతపురంలో చీని ధరలకు రెక్కలు

ATP: అనంతపురం వ్యవసాయ మార్కెట్‌లో గురువారం చీనీకాయలు టన్ను గరిష్ఠంగా రూ.25 వేల ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి రాఘవేంద్రకుమార్ తెలిపారు. మార్కెట్‌కు మొత్తం 462 టన్నుల దిగుమతి రాగా, నాణ్యతను బట్టి కనిష్ఠంగా రూ.8 వేలు, సరాసరిగా రూ.17 వేల ధర లభించినట్లు పేర్కొన్నారు. గత కొన్ని రోజులతో పోలిస్తే ధరలు ఆశాజనకంగా ఉన్నాయని రైతులు వ్యక్తం చేస్తున్నారు.

February 20, 2026 / 08:46 AM IST

‘చంద్రబాబు సర్కారు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి’

W.G: చంద్రబాబు సర్కారు చేస్తున్న మోసాలు, అన్యాయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పార్టీ శ్రేణులు కృషిచేయాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు చేస్తానన్న మంచిని చేయకుండా వాటి నుంచి ప్రజలను దృష్టి మరల్చేందుకు ప్రశ్నించిన వారిపై కేసులు నమోదుచేస్తున్నారని విమర్శించారు.

February 20, 2026 / 08:38 AM IST

తిరుమలలో పిల్లలు కిడ్నాప్.. మహిళ అరెస్ట్

అన్నమయ్య: కలకడకు చెందిన శివమ్మ(42) తిరుమలలో ఇద్దరు బాలికలను కిడ్నాప్ చేసింది. ప.గో జిల్లా తనుకుకు చెందిన కుటుంబం గురువారం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చింది. కాగా చిన్నారులు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైల్లో తీసుకెళ్తుండగా కొవ్వూరు రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని, నిందితురాలిపై కేసు నమోదు చేసే అరెస్ట్ చేశారు.

February 20, 2026 / 08:35 AM IST

అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్: కలెక్టర్

సత్యసాయి: భారతీయ వాయుసేనలో అగ్నివీర్ వాయు పోస్టుల భర్తీ కోసం నిర్వహించే ఓపెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీని జిల్లా యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ కోరారు. గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మార్చి 9 ఎంపికలు జరుగుతాయన్నారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.

February 20, 2026 / 08:35 AM IST

వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా చెరుకుల జనార్ధన్ యాదవ్

తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం సర్పంచ్, వైసీపీ సీనియర్ నాయకుడు చెరుకుల జనార్ధన్ యాదవ్‌ను రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా పార్టీ కేంద్ర కార్యాలయం నియమించింది. ఈ సందర్భంగా ఆయన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే డా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానని తెలిపారు.

February 20, 2026 / 08:34 AM IST

పాఠశాలకు 60 బెంచీలు వితరణ

CTR: మందస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థి సంఘం డస్క్ బెంచీలను వితరణగా అందజేశారు. సుమారు రూ. 90 వేలు విలువగల 60 డస్క్ బెంచీలను పాఠశాలకు అందజేసి దాతృత్వాన్ని చాటారు. HM శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అసోసియేషన్ ఫౌండర్ ప్రొఫెసర్ మోహన్ ఆచారి నిధుల సమీకరణ జరిపి చేస్తున్న కృషి ఆదర్శప్రాయం అని కొనియాడారు.

February 20, 2026 / 08:33 AM IST

గన్నవరంలో నేటి కూరగాయల ధరలు ఇవే.!

కృష్ణా: గన్నవరం రైతు బజారులో శుక్రవారం కూరగాయల ధరలు కేజీల్లో ఇలా ఉన్నాయి. టమాట రూ.15, వంగ రూ.20-రూ.22, బెండ రూ.24, కాకర కేజీ రూ.32, బీరకాయ రూ.26-28, కాలీఫ్లవర్ ఒక్కటి రూ.15-20, క్యాబేజీ రూ.15గా నమోదయ్యాయి. క్యారెట్ రూ.31, దొండకాయ రూ.38, బంగాళాదుంప రూ.22, ఉల్లిపాయలు రూ.23, గోరు చిక్కుళ్లు రూ.28గా ఉన్నాయి. ఫ్రెంచ్‌బీన్స్ రూ.75, క్యాప్సికం రూ.67గా ఉన్నాయి.

February 20, 2026 / 08:32 AM IST

పీఆర్సీలను వెంటనే చెల్లించాలని ఉద్యోగుల నిరసన

NTR: తిరువూరు లోని కేడీసీసీ బ్యాంక్ కార్యాలయం వద్ద నియోజకవర్గ పరిధిలోని తిరువూరు, గంపలగూడెం, ఏ కొండూరు, విసన్నపేట మండలాల సహకార సంఘాల ఉద్యోగులు నిరవధిక సమ్మెలో భాగంగా 4వ రోజు నిన్న ధర్నా చేశారు. జీవో నెం 36 అమలు చేయాలని, 2019 నుంచి 2024 వరకు పెండింగ్‌లో ఉన్న పీఆర్సీలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

February 20, 2026 / 08:32 AM IST

‘పరీక్షల పట్ల భయం లేకుండా రాయాలి’

ప్రకాశం: ఇంటర్ పరీక్షల నేపథ్యంలో అంబేడ్కర్ గురుకులాల విద్యార్థులతో కొండేపి ఏమ్మెల్యే, మంత్రి స్వామి అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షల పట్ల భయం లేకుండా రాయాలని సూచించారు. ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండాలన్నారు. గురుకుల విద్యార్థుల కొరకు పరీక్షలు రాసేందుకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

February 20, 2026 / 08:31 AM IST