• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

విఘ్నేశ్వర స్వామి ఆలయ ఆదాయం ఎంతంటే..?

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శనివారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.4,01,761 లక్షల ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 513 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 17 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారు అని, 4,871 మంది అన్న ప్రసాదం స్వీకరించారని అన్నారు.

February 21, 2026 / 07:04 PM IST

భద్రాచలం నుంచి అహోబిలానికి తరలివచ్చిన భక్తులు

NDL: ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి తెలంగాణ రాష్ట్రం భద్రాచలం నుంచి 200మంది భక్తులు తరలివచ్చారు. భద్రాచలం అహోబిలం మఠం అర్చకుడు కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో నరసింహస్వామి దీక్షాపరులు, భక్తులు తరలివచ్చి నవ నరసింహ క్షేత్రాలను దర్శించుకున్నారు. అహోబిలం పీఠాధిపతి రంగనాథ యతీంద్రను కలిసి భద్రాచలం నుంచి తెచ్చిన మాలమర్యాదలను ఇచ్చారు.

February 21, 2026 / 07:03 PM IST

దంపతులపై దాడి కేసు నమోదు

అన్నమయ్య: మదనపల్లె మండలంలోని పొన్నేటిపాళ్యం పంచాయతీ పరిధి పనసమాకులపల్లిలో ఆవు చేనులో మేసిందనే కారణంతో దంపతులపై దాడి జరిగింది. గ్రామానికి చెందిన కుక్కల నగేష్, మల్లికార్జున, హరికృష్ణ, మాలతి, రాహుల్ తమను దారుణంగా కొట్టారని బాధితులు శంకర, ఆదిలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు శనివారం తెలిపారు.

February 21, 2026 / 07:03 PM IST

రామాలయం నిర్మాణానికి మాజీ ఎంపీపీ విరాళం

VZM: డెంకాడ మండలం సింగవరం పంచాయితీ లెంకపేట గ్రామంలో నిర్మించనున్న నూతన రామాలయం నిర్మాణానికి మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్ శనివారం విరాళం అందజేశారు. అక్కివరం తన స్వగృహంలో ఆలయ కమిటీ సభ్యులకు రూ.25,000 విరాళం అందజేశారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

February 21, 2026 / 07:02 PM IST

పరీక్షల సమయంలో జిరాక్స్ కేంద్రాల మూసివేత

KRNL: జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సూచనల మేరకు జిరాక్స్, ఇంటర్నెట్ కేంద్రాలను మూసివేయాలని ఉప కార్మిక కమిషనర్ కె. వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఈనెల 23 నుంచి మార్చి 24 వరకు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

February 21, 2026 / 07:01 PM IST

డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు

ASR: జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్ ఆదేశాలతో అరకు సర్కిల్ పరిదిలో శనివారం సీఐ హిమగిరి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, డాగ్ స్క్వాడ్‌తో అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అరకు రైల్వే స్టేషన్లు, అరకులోయ బస్ స్టేషన్‌లో డాగ్ స్క్వాడ్‌తో అణువణువు తనిఖీలు చేపట్టారు. రైలు, బస్సులలో ప్రయాణికుల వద్ద వున్న బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

February 21, 2026 / 07:01 PM IST

బ్లూ పోలీస్ వాహనానికి గ్రీన్సిగ్నల్

PPM: పార్వతీపురం పట్టణంలో బ్లూ పోలీస్ వాహనాన్ని ఏఎస్పీ మనీషా రెడ్డి గ్రీన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల భద్రతే లక్ష్యంగా బ్లూ పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. క్రైమ్ నియంత్రణ, చైన్ స్నాచింగ్, దొంగతనాలు వంటి ఘటనలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

February 21, 2026 / 07:01 PM IST

‘SC, ST కుటుంబాలకు ఉచిత సోలార్ రూఫ్‌టాప్‌లు’

సత్యసాయి జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకం కింద 11,987 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థలు మంజూరైనట్లు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. శనివారం అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే అర్హులైన పేదలకు ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు.

February 21, 2026 / 07:01 PM IST

బాల్య వివాహాల నిర్మూలన చైతన్య రథాన్ని ప్రారంభించిన RDO

ATP: అనంతపురం రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో శనివారం బాల్య వివాహాల నిర్మూలన చైతన్య రథాన్ని ఆర్డీవో కేశవ నాయుడు ప్రారంభించారు. రెడ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి భానుజా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బాల్య వివాహాల నిరోధానికి ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

February 21, 2026 / 07:00 PM IST

‘సమాజ హితం కోసం ఆలోచన కలిగించేవి రెడ్ బుక్స్’

ఏలూరు సీపీఐ కార్యాలయంలో శనివారం రెడ్ బుక్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ.. సమాజ హితం కోసం ఆలోచన కలిగించేలా సమాజంలో దోపిడీ పీడన నుంచి విముక్తి కలిగించేందుకు ఆలోచన కలిగించే గొప్ప పుస్తకాలు రెడ్ బుక్స్ అని కొనియాడారు. ప్రజల మధ్య అంతరాలు లేని గొప్ప సమాజాన్ని నిర్మించాలన్నారు.

February 21, 2026 / 07:00 PM IST

మార్చి 2న విజయవాడలో అంగన్వాడీల మహాధర్నా

W.G: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీల పట్ల వహిస్తున్న నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా మార్చి 2న విజయవాడలో సమస్యల పరిష్కారం కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే రాజా రామ్మోహన్ రాయ్ అన్నారు. జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ముఖ్య కార్యకర్తల సమావేశం భీమవరం సీఐటీయూ కార్యాలయంలో జరిగింది.

February 21, 2026 / 07:00 PM IST

కారును ఢీకొన్న కెమికల్ ట్యాంకర్

KDP: పులివెందుల పట్టణంలోని స్థానిక శ్రీ రంగనాథ స్వామి ఆలయ సమీపంలో శనివారం సాయంత్రం కారును కెమికల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జెంది. ఈ విషయం తెలుసుకున్న ట్రాఫిక్ సీఐ హాజీవల్లి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 21, 2026 / 07:00 PM IST

లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విశేష పూజలు

NLR: రాపూరు మండలం పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం, కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.

February 21, 2026 / 07:00 PM IST

‘చెత్తరహిత సమాజ స్థాపనకు సహకరించాలి’

VZM: చెత్త రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపీడీవో రామకృష్ణ రాజు వెల్లడించారు. స్వచ్ఛాంధ్ర- స్వచ్ఛదివాస్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని కొండవెలగాడలో శనివారం ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో పరిశుభ్రమైన వాతావరణం కల్పించడానికి ప్రజలు సహకారం అవసరమన్నారు. పరిశుభ్రతతోనే రోగాలకు దూరంగా ఉండొచ్చని చెప్పారు.

February 21, 2026 / 06:59 PM IST

జనసేన జిల్లా సమన్వయకర్తగా రవికుమార్

SKLM: జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి పార్లమెంటు నియోజకవర్గాల సభ్యత్వ నమోదు సమన్వయకర్తల పేర్లను శనివారం పార్టీ ప్రకటించింది. ఈ మేరకు శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గానికి సుడా ఛైర్మన్ కోరికన రవి కుమార్‌‌ను సభ్యత్వ నమోదు సమన్వయకర్తగా నియమించింది. జిల్లాలో గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో జనసేన పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేస్తామన్నారు.

February 21, 2026 / 06:56 PM IST