SKLM: ఎచ్చెర్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో ఇవాళ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాధికారి యూ. సాయికుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 13 ప్రముఖ ప్రైవేట్ సంస్థలు పాల్గొని సుమారు 400 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. 18–30 ఏళ్లు మధ్య వయస్సు గల నిరుద్యోగ యువతీ యువకులు అర్హులు అని ఆయన పేర్కొన్నారు.
ATP: గార్లదిన్నె మండలంలోని కల్లూరు రైల్వేస్టేషన్ సమీపంలో ఆదివారం చైన్ స్నాచింగ్ జరిగింది. ధర్మవరానికి చెందిన శారద తన బంధువులతో కలిసి యాదగిరి వెళ్తుండగా బీదర్ రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు వేగం తగ్గడంతో గుర్తుతెలియని దొంగ.. ఆమె మెడలోని మూడు తులాల మంగళసూత్రాన్ని లాక్కెళ్లాడు. బాధితురాలు రైలు చైన్ లాగి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కోనసీమ: కాంగ్రెస్ నేతలు దేశ ప్రతిష్టను దిగజార్చేలా ప్రవర్తిస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. అమలాపురం పట్టణం గడియార స్తంభం సెంటర్లో ఆదివారం సాయంత్రం బీజేపీ యువమోర్చా అధ్యక్షులు గానాల కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చొరబడి సృష్టించిన అల్లర్లను ఖండిస్తూ నిరసన చేపట్టామన్నారు.
W.G: పోడూరు మండలం కొమ్ముచిక్కాల టీడీపీ క్యాంప్ కార్యాలయంలో రూ .23,16,107 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం 40 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆచంట నియోజకవర్గంలో రూ. కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించామన్నారు.
ELR: విదేశాల్లో వైద్య పీజీ సీట్లు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి నిలువునా ముంచిన ఘటన జంగారెడ్డిగూడెంలో వెలుగుచూసింది. పట్టణానికి చెందిన షంషీర్ అహ్మద్ కుమార్తె, మేనల్లుడికి సీట్ల కోసం మహబూబ్ నగర్‌కు చెందిన గుండా రాఘవ రూ.19.50 లక్షలు వసూలు చేశాడు. పలుదఫాలుగా నగదు తీసుకొని సీట్లు ఇప్పించకుండా కాలయాపన చేయడంతో బాధితుడు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు.
CTR: గంటవూరు సమీపంలోని శనీశ్వరాలయం వద్ద ఉన్న ఓ దుకాణంలో దొంగ బీభత్సం సృష్టించాడు. బైక్‌పై హెల్మెట్, మాస్కుతో వచ్చిన అగంతకుడు షాపులో సిగరెట్ కావాలని అడిగి, యజమాని జ్యోతి మెడలోని గొలుసు లాగేందుకు ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో దొంగ ఆమె చెవిని తుంచి కమ్మలు, మాటీలు (14గ్రా) లాక్కెళ్లాడు. తీవ్ర రక్తశ్రావమైన బాధితురాలికి ఐదు కుట్లు పడ్డాయి.
ELR: ఇంటర్ విద్యార్థులకు SP ప్రతాప్ శివ కిషోర్ తీపి కబురు చెప్పారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 30 నిమిషాల ముందు చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రానికి వెళ్లడానికి ఆలస్యం అవుతుంటే ఏలూరులోని కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, ఫైర్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పోలీసు వాహనాలు పరీక్షా కేంద్రానికి తరలించడానికి సిద్ధంగా ఉంటాయన్నారు.
AKP: చీడికాడ మండలం మంచాల మోడల్ స్కూల్‌లో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సీహెచ్.వెంకటలక్ష్మి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 2025-26లో 5వ తరగతి చదువుతున్న వారు అర్హులని పేర్కొన్నారు. మార్చి 31లోగా దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా పంపించాలని కోరారు. ఏప్రిల్ 12వ తేదీన ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు.
GNTR: IERP స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులను సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించి రెగ్యులర్ ఉపాధ్యా యులుగా గుర్తించి పే స్కేలు అమలు చేయాలని NTA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనిగల హైమారావు డిమాండ్ చేశారు. ఆదివారం ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు నివాసంలో కలిసి NTA సభ్యత్వం అందజేసి, వినతిపత్రం అందించారు.
KRNL: బతుకుతెరువుకోసం కూలీలు వలసబాట పట్టారు. నందవరం నాగలదిన్నె గ్రామానికి చెందిన 50 మంది ఆదివారం రాత్రి రెండు బొలేరో వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. గ్రామాల్లో ఉపాధి పనులు ప్రారంభించక గుంటూరు మిర్చి కోతలకు వలసలు వెళ్తున్నామన్నారు. గత మూడు రోజుల్లో ఆరు వాహనాల్లో 200 మంది వలసల వెళ్లారని గ్రామస్తులు తెలిపారు.
NTR: విజయవాడ రాజీవ్ పార్క్ నుంచి గంగూరు కూడలి వరకు 14KM పొడవున ఆరు వరుసల ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మాణంపై ప్రభుత్వం రెండు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ఒకే ఎలివేటెడ్ మార్గంగా నిర్మించాలా లేక కనకదుర్గ వారధి–BENZ సర్కిల్, BENZ సర్కిల్–గంగూరు వరకు రెండు భాగాలుగా నిర్మించాలా అనే అంశంపై చర్చ సాగుతోంది. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద భూ సేకరణ జరగనుందని అధికారులు తెలిపారు.
VSP: విద్యుత్ సమస్యలపై సోమవారం డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎండీ పృథ్వీ రాజ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సంస్థ పరిధిలో శ్రీకాకుళం నుంచి పశ్చిమగోదావరి జిల్లా వరకు 11 జిల్లాలకు చెందిన వినియోగదారులు 8688400499 నెంబర్‌కు ఉదయం 10:30 నుంచి 11:30 గంటల వరకు ఫోన్ చేసి సమస్యలు తెలియజేయాలన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
KRNL: కర్నూలు నాలుగవ పట్టణ సీఐ విక్రమ్ సింహా న్యాయవాది పవన్‌పై దాడి చేసిన ఘటనకు నిరసనగా ఇవాళ జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు విధులను బహిష్కరించనున్నారు. జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు హరినాథ్ చౌదరి, ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటేశ్వర్లు తెలిపారు. సీఐపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు.
W.G: భీమవరం జిల్లా టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకులు ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు మాట్లాడుతూ.. గత 5 సంవత్సరాల్లో తిరుమల లడ్డూలు కల్తీ జరగలేదని వైసీపీ నాయకులు అనడం లేదని అన్నారు. పూర్తిస్థాయిలో కల్తీ జరిగిందని అన్నారు. మాజీ సీఎం గుడికి వెళ్లినప్పుడు డిక్లరేషన్ కూడా ఇవ్వరని విమర్శించారు.
KRNL: ప్రభుత్వం తరఫున ఏజీపీగా నియమించడంతో నిబద్ధతతో ప్రజలు, ప్రభుత్వానికి సేవలు అందించాలని MLA బీవీ జయనాగేశ్వరరెడ్డి సూచించారు. ఏజీపీగా ఎంపికైన రషీదుల్లా, న్యాయవాదులు ఆదివారం MLA బీవీని సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వృత్తి పట్ల అంకితభావంతో పని చేయాలని సూచించారు. ప్రజలకు అవసరమైనప్పుడుల్లా సేవలు అందించి మన్ననలు పొందాలన్నారు.