మార్కాపురం బాయ్స్ హై స్కూల్‌లో ఆదివారం స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్యమ వ్యవస్థాపకులు లార్డ్ బాడెన్ పావెల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చిన్నతనం నుంచే దేశభక్తిని, సేవా భావాన్ని అలవర్చుకోవాలని హెచ్ఎం చంద్రశేఖర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
కృష్ణా: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ఆదివారం సాయంత్రం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. 30మంది లబ్ధిదారులకు రూ. 41,61,456లను చెక్కుల రూపంలో ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ASR: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని స్థానిక ఎస్సై ఎల్.సురేష్ సూచించారు. మండలంలోని తూటంగి గ్రామ పంచాయతీ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. గంజాయి సాగు, రవాణా వంటి అక్రమాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలని, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని తెలిపారు.
VSP: అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ క్రికెటర్ శేఖర్‌కి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి మంజూరైన రూ.3 లక్షల చెక్కును గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అందజేశారు. ఈ దందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అన్నమయ్య: వీరబల్లి మండలం దిగువరాచపల్లెలో ఆదివారం టీడీపీ పార్టీ గ్రామసభ జరిగింది. ఈ కార్యక్రమానికి రాజంపేట టీడీపీ ఇంఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. CM చంద్రబాబు నాయకత్వంతోనే పేదల ఆర్థిక ఉన్నతి,రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక వైకాపా కుట్ర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.
PPM: జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి ఆదేశాల మేరకు పార్వతీపురం, సాలూరు పట్టణ కేంద్రాలలోడాగ్ స్క్వాడ్, బి.డి టీం సిబ్బందితో ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనుమానస్పద వస్తువులను నిశితంగా పరిశీలించారు. ప్రజలను అప్రమత్తంతో పాటు, ఎలాంటి సంఘ విద్రోహ ఘటనలు జరగకుండా ముందుస్తు చర్యలలో భాగంగా విస్తృత తనిఖీలు చేపట్టారు.
NDL: నంది కొట్కూరు మండలo, వడ్డెమానులో మారేమ్మ నూతన గుడిప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎమ్మెల్య జయసూర్య, మాండ్ర శివానంద రెడ్డి హాజరయ్యారు. ముందు తల్లి మారేమ్మ ను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ సర్పంచి దామోదర్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
శ్రీకాకుళంలోని జి.టి.రోడ్డులోని జామియా మసీదులో ఆదివారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో వన్ టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పైడిపు నాయుడు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని సీఐ తెలిపారు. అలాగే, ముస్లిం భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రశంసనీయమని కొనియాడారు.
KDP: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్‌ను ఆయన నివాసంలో బద్వేల్‌కు చెందిన డీసీసీ బ్యాంక్ ఛైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి శాలువా, పూల బొకే అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగినట్లు ఆయన తెలిపారు.
కర్నూలు: ఎనిమిదో వేతన సంఘంనేపథ్యంలో జీతాల పెరుగుదల పై చర్చలు జరుగుతున్న వేళ, సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులతో మోసాలకు పాల్పడుతున్నారని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లను లక్ష్యంగా చేసుకుని 8వ సీపీసీ శాలరీ కాలిక్యులేటర్ పేరుతో వాట్సాప్ సందేశాలు పంపుతూ మోసగాళ్లు అమాయక ప్రజలను వలలో వేస్తున్నారన్నారు.
W.G: పిల్లలలో సృజనాత్మక శక్తిని ప్రోత్సహించడానికి మార్చి 1న నరసాపురం బాలోత్సవం నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వహణ కమిటీ ప్రధాన కార్యదర్శి పూరిళ్ళ శ్రీనివాస్ తెలిపారు. మార్చి 1న వైఎన్ కాలేజీలో పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనం, స్పాట్ డ్రాయింగ్, వ్యాసరచన, తెలుగు కథారచన, దేశభక్తి, అభ్యుదయ గీతాలాపన, జానపద నృత్యం, క్లాసికల్ డ్యాన్స్ నిర్వహిస్తామన్నారు
ATP: జిల్లాలో రేపటి నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించినట్లు ఎస్పీ పి. జగదీష్ ఆదివారం తెలిపారు. 64 పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరిసర ప్రాంతాలను సైలెంట్ జోన్లుగా ప్రకటించామన్నారు. పరీక్ష పత్రాలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
VZM: బొబ్బిలి కుమ్మరివీధిలో నివాసం ఉంటున్న మర్రి మాధవిదేవి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. మాధవి చైతన్య పాఠశాలలో గణితం టీచర్‌గా పని చేస్తున్నట్లు తెలిపారు. కొంతకాలంగా ఆమెను భర్త నరేష్ అనుమానంతో వేధిస్తున్నాడని పేర్కొన్నారు. నీవు చనిపోతేనే దరిద్రం పోతుందని పదే పదే అనడంతో మనస్తాపానికి గురైన మాధవి శనివారం రాత్రి ఉరివేసుకుందని ఆమె తల్లి ఫిర్యాదు చేశారు.
AKP: మాడుగుల ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రెస్ క్లబ్ సమావేశం ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ.. జర్నలిస్టులు వాస్తవాలను వెలికి తీసే విధంగా పని చేయాలని సూచించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
సత్యసాయి: మడకశిర మండలం కల్లుమరి గ్రామంలో మారెమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు సతీమణి ఎం.ఎస్. ఉమాదేవి పాల్గొన్నారు. గ్రామ మహిళలు ఆమెకు ఘనస్వాగతం పలకగా, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వక్కలిగ కార్పొరేషన్ ఛైర్మన్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.