• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పాల్గొన్న ఎస్పీ

KDP: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో ఎస్పీ విశ్వనాథ్ పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 156 ఫిర్యాదులు స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడి చట్టపరమైన గడువులో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్‌చైర్లు ఏర్పాటు చేసి, వారి వద్దకే వెళ్లి ఫిర్యాదులు స్వీకరించారు.

March 9, 2026 / 05:40 PM IST

శివాలయంలో హుండీ మాయం

కృష్ణా: పెనమలూరు మండలం యనమలకుదురు శివాలయంలో హుండీ నగదు మాయం కావడం కలకలం రేపింది. ఆలయ హుండీలో ఉన్న సుమారు రూ.10 లక్షల నగదు కనిపించకపోవడంతో ట్రస్ట్ ఛైర్మన్ సంఘ నరసింహారావు పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.

March 9, 2026 / 05:40 PM IST

‘సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు’

అనకాపల్లి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు సమస్యలపై అర్జీలను సమర్పించారు. కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని పరిశీలించి వారితో మాట్లాడారు. పీజీఆర్ఎస్‌లో అధికారుల దృష్టికి వచ్చిన సమస్యలను సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.

March 9, 2026 / 05:38 PM IST

కనుపూరు జాతరకు బస్సు ఛార్జీలు ఇవే..!

TPT: చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతరకు గూడూరు ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గూడూరు ఆర్టీసీ డిపో మేనేజర్ చెంచులక్ష్మి తెలిపారు. గూడూరు నుంచి కనుపూర్‌కు రూ.45 , నెల్లూరు నుంచి రూ.100, నాయుడుపేట నుంచి రూ.60, సూళ్లూరుపేట నుంచి రూ.90 ఉన్నట్లు తెలిపారు.

March 9, 2026 / 05:38 PM IST

పన్నుల వసూళ్లలో వేగం పెంచాలి: కమిషనర్

GNTR: పన్నుల వసూళ్లపై రెవెన్యూ అధికారులు, ఇన్‌స్పెక్టర్లు మరింత శ్రద్ధ చూపాలని గుంటూరు కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశించారు. ముఖ్యంగా తాగునీటి కుళాయి, మీటర్ ట్యాప్ ఛార్జీల వసూళ్లపై నిఘా పెట్టాలని స్పష్టం చేశారు. సోమవారం కొరెటెపాడులో పర్యటించిన ఆయన, అక్కడి చెరువు వాకింగ్ ట్రాక్, పార్కులను సందర్శించి పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు.

March 9, 2026 / 05:35 PM IST

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

KRNL: ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయనాగేశ్వర్ రెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఇవాళ పంపిణీ చేశారు. మూడు మండలాలు, పట్టణానికి చెందిన 16 మంది లబ్ధిదారులకు రూ.10,35,356 విలువైన చెక్కులు అందజేశారు. గత 20 నెలల్లో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 249 మందికి రూ.1.96 కోట్ల ఆర్థిక సహాయం అందినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

March 9, 2026 / 05:31 PM IST

తలారి రంగయ్యకు భద్రత కల్పించాలి: వైసీపీ

ATP: మాజీ ఎంపీ తలారి రంగయ్యకు ప్రాణహాని ఉందని, ఆయనకు తక్షణమే 2+2 పోలీసు భద్రత కల్పించాలని YCP నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం అనంతపురంలోని ఎస్పీ కార్యాలయంలో జరిగిన ‘స్పందన’ కార్యక్రమంలో ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. కళ్యాణదుర్గం ఈ-స్టాంప్ కుంభకోణంపై రంగయ్య హైకోర్టులో పిల్ దాఖలు చేశారని, బాధ్యుల నుంచి ముప్పు పొంచి ఉందని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

March 9, 2026 / 05:30 PM IST

ఎమ్మెల్యేను కలిసిన అడ్వకేట్ పిచ్చయ్య

ప్రకాశం: కనిగిరి సివిల్ జడ్జి కోర్టు (జూనియర్ డివిజన్)కు నూతనంగా ఏజీపీగా నియమితులైన సీనియర్ అడ్వకేట్ పాశం పిచ్చయ్య కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేపిచ్చయ్యకి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేసి, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

March 9, 2026 / 05:30 PM IST

ప్రధానోపాధ్యాయునికి జాతీయ అవార్డు

VZM: గుంకలాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డా. వెలమల శ్రీనివాస్ విద్యా రంగంలో అందించిన విశిష్ట సేవలకు గాను రాష్ట్రీయ సేవా సమ్మాన్ – 2026 అవార్డ్స్ కార్యక్రమంలో జాతీయ అవార్డు అందుకున్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డిని శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనను అభినందించారు.

March 9, 2026 / 05:28 PM IST

‘గ్రీవెన్స్ పరిష్కారానికి తొలి ప్రాధాన్యత’

PPM: సచివాలయ పరిధిలో నిర్వహిస్తున్న విలేజ్ రెవెన్యూ క్లినిక్ ద్వారా అందిన వినతుల పరిష్కారానికి తొలి ప్రాధాన్యతను ఇవ్వాలని జేసీ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి రెవిన్యూ అధికారులకు స్పష్టం చేశారు. సోమవారం తన ఛాంబర్‌లో జిల్లాలోని తహసీల్దార్లతో కీలక సమావేశాన్ని జేసీ నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న వివిధ రెవెన్యూ పనుల పురోగతిపై ఆయన సమగ్రంగా సమీక్షించారు.

March 9, 2026 / 05:26 PM IST

కదిరిలో రేపు కీలక ఘట్టం.. తరలిరానున్న భక్తులు

సత్యసాయి: కదిరిలోని ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మరథోత్సవానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం ఉదయం 8:25 నుంచి 8:45 గంటల మధ్య శుభ మేష లగ్నంలో రథం కదలనుందని అర్చకులు తెలిపారు. ఈ చారిత్రక వేడుకను వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు పలు ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు.

March 9, 2026 / 05:23 PM IST

‘ప్రతి FPOకు రూ.15 లక్షల కార్పస్ ఫండ్’

VZM: రాష్ట్రంలోని ప్రతి మండలంలో ఉన్న రైతు ఉత్పత్తిదారుల సంఘాల (FPOలు) బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరించారు. ప్రతి FPOకు రూ.15 లక్షల కార్పస్ ఫండ్ కేటాయించామని తెలిపారు. ఈ నిధులతో ట్రాక్టర్లు, డ్రోన్లు వంటి వ్యవసాయ యంత్రాలను కొనుగోలు చేసి అద్దె ప్రాతిపదికన రైతులు వినియోగించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.

March 9, 2026 / 05:19 PM IST

పంట నమోదు వివరాలు సరిచూసుకోండి: ఏవో

NDL: రబి సీజన్‌కు సంబంధించి బండి ఆత్మకూరు మండలంలో 15,740 మంది రైతులు 36,303 ఎకరాల్లో పంటల సాగుకు సంబంధించి ఈ-పంట నమోదు చేసినట్లు మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ తెలిపారు. బండి ఆత్మకూరు మండలం ఏ- కోడూరు రైతు సేవ కేంద్రంలో ప్రదర్శించి ఈ- పంట ముసాయిదా జాబితా ప్రదర్శనను ఇవాళ ఆయన పరిశీలించారు. తప్పులుంటే రైతు సేవ కేంద్రం సిబ్బందికి తెలియజేసి సరి చేసుకోవాలన్నారు.

March 9, 2026 / 05:16 PM IST

463 అర్జీలను స్వీకరించిన కలెక్టర్

ATP: జిల్లా కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి 463 అర్జీలను స్వీకరించినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తామన్నారు.

March 9, 2026 / 05:13 PM IST

కిడ్నీ బాధితుడికి రూ.30 వేలు ఆర్థిక సాయం

కోనసీమ: పోలవరం మండలం కేసనకూరుపాలెం గ్రామానికి చెందిన వాసంశెట్టి శ్రీనివాస్ తన రెండు కిడ్నీలు పాడై అత్యవసర చికిత్స పొందుతున్నాడు. శ్రీనివాస్ కుటుంబ ఆర్థిక పరిస్థితిని కూటమి నాయకులు మంత్రి సుభాష్ దృష్టికి తీసుకువచ్చారు. వారి ధీనస్థితికి స్పందించిన మంత్రి తక్షణ సహాయంగా రూ. 30 వేలు చెక్కును అందజేశారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

March 9, 2026 / 05:12 PM IST