• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మంత్రిను కలిసిన నిరుద్యోగ జేఏసీ నేత

NTR: గత YCP నిర్ణయాలు వల్ల చాలామంది ఉద్యోగవయోపరిమితి కోల్పోయారు, కనుక ఉద్యోగ వయోపరిమితి పెంచాలి అని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ కోరారు. ఈ మేరకు మంత్రి నారా లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు జోనల్ రీనోటిఫికేషన్ చేసి, ఉగాది నాటికి అన్ని శాఖల ఉద్యోగ ఖాళీలను నింపేందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి తెలిపారు.

February 28, 2026 / 09:07 AM IST

కిడ్నీ వ్యాధిగ్రస్తుడికి రూ.10,000 పెన్షన్

సత్యసాయి: ధర్మవరం పట్టణం 8వ వార్డు కేశవనగర్‌కు చెందిన కిడ్నీ వ్యాధిగ్రస్తుడు ఉదయ్ కుమార్‌కు మంత్రి సత్యకుమార్ ప్రత్యేక చొరవతో రూ.10,000 పెన్షన్ మంజూరైంది. నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు శనివారం ఉదయ్ కుమార్‌కు పెన్షన్ మొత్తాన్ని స్వయంగా అందజేశారు. కష్టకాలంలో ఆదుకున్న మంత్రికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

February 28, 2026 / 09:03 AM IST

జనాభా లెక్కల సేకరణపై శిక్షణ: కమిషనర్

E.G: రాజమండ్రి కమిషనర్ రాహుల్ మీనా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జనాభా లెక్కల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో అయన మాట్లాడుతూ.. డిజిటల్ పద్ధతిలో రెండు దశల్లో ప్రక్రియను పారదర్శకంగాపూర్తి చేయాలని, నేషనల్ ట్రైనర్స్ ఇచ్చే పద్ధతిని అనుసరించాలని సూచించారు.

February 28, 2026 / 09:02 AM IST

ఎండపల్లిలో పింఛన్లు పంపిణీ చేసిన MPDO

AKP: కోటవురట్ల మండలం ఎండపల్లిలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీడీవో చంద్రశేఖర్ శనివారం ఉదయం ప్రారంభించారు. మండలంలో ఉదయం 7 గంటల నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగిందన్నారు. 9,274 మందికి పింఛన్లను సాయంత్రంలోగా పంపిణీ చేయాలని సిబ్బందిని ఆదేశించామన్నారు. ఉదయం 8:30 గంటల వరకు 3,532 మందికి పింఛన్లు అందజేసామన్నారు.

February 28, 2026 / 09:02 AM IST

వంద శాతం ఇంటి పన్నులు వసూళ్లు చేయాలి: MPDO

AKP: అధికారులు సిబ్బంది ఇంటి పన్నుల వసూళ్లపై దృష్టి సారించాలని డివిజన్ అభివృద్ధి అధికారిణి మంజులవాణి ఆదేశించారు. సబ్బవరం ఎంపీడీవో కార్యాలయంలో ఇంటి పన్నుల వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. పనుల వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డిజిటల్ విధానంలో పనులు చెల్లించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

February 28, 2026 / 09:02 AM IST

కంభంలో శక్తి యాప్ పై అవగాహన

ప్రకాశం: కంభం పట్టణంలో శుక్రవారం స్థానిక మహిళలకు, పాఠశాల విద్యార్థులకు పోలీసులు భద్రతా అంశాలపై పలు సూచనలు చేశారు. ఆపదలో మహిళలను రక్షించే శక్తి యాప్ గురించి వివరించి, వారి మొబైల్ ఫోన్లలో శక్తి యాప్ డౌన్లోడ్ చేయించారు. అత్యవసర సమయంలో ఈ యాప్ పోలీసులకు ఎలా సమాచారం అందిస్తుందో ప్రత్యక్షంగా చూపించారు.

February 28, 2026 / 09:02 AM IST

బాలలయంలో విగ్రహ ప్రతిష్ట పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం బాలాలయంలో స్వామివారి టేకు విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమం ఆలయ ఈవో విజయరాజు ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమానికి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం హాజరయ్యారు. ముందుగా ఆలయ అర్చకులు వారిని స్వాగతం పలికారు. అనంతరం విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

February 28, 2026 / 09:00 AM IST

ఎమ్మెల్యేకు వెటర్నరీ విద్యార్థుల వినతి

VZM: చీపురుపల్లి MLA కిమిడి కళా వెంకటరావును శుక్రవారం గరివిడి వెటర్నరి కాలేజీ విద్యార్థులు కలిసారు. రాష్ట్ర వ్యాప్తంగా 2000 మందికి పైగా వెటర్నరీ గ్రాడ్యుయేట్లు వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ నియామకాల కోసం ఎదురుచూస్తున్నారని ఈ పోస్ట్‌ గ్రామీణ పశుసంవర్థక వ్యవస్థలో అత్యంత కీలకమన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసువెళ్లాలని ఆయనకు వినతిపత్రం అందించారు.

February 28, 2026 / 09:00 AM IST

జోరుగా సాగుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

PPM: కొమరాడ గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం శనివారం ఉదయాన్నే ప్రారంభమైంది. ఇందులో భాగంగా సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సొమ్మును అందించారు. కొమరాడ మండల రైతు అధ్యక్షుడు బత్తిలి శ్రీను ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 6 గంటల నుంచే పంపిణీ చేసినట్లు సచివాలయ సిబ్బంది తెలిపారు.

February 28, 2026 / 09:00 AM IST

డయేరియాకు ‘ఈ-కోలి’ బ్యాక్టీరియానే కారణం: కమిషనర్

SKLM: నగరంలో సేకరించిన తాగునీటి నమూనాల్లో ప్రమాదకరమైన ‘ఈ-కోలి’ బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ధారణ అయిందని, ఇదే డయేరియా వ్యాప్తికి ప్రధాన కారణమని ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. శుక్రవారం ఆయన నగరంలోని డయేరియా ప్రాంతాల్లో పర్యటించారు. ఇప్పటివరకు 158 డయేరియా కేసులు నమోదు కాగా, 47 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు.

February 28, 2026 / 09:00 AM IST

ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CTR: నిండ్ర మండలం కైపాకం నందు నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ శనివారం స్థానిక కూటమి నాయకులతో కలిసి పింఛన్‌లు పంపిణీ చేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నందు మాత్రమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం వృద్దులు, వితంతువులకు ప్రతి నెల అందిస్తున్నామని తెలిపారు.

February 28, 2026 / 08:52 AM IST

తిరుపతిలో రుయాలో ఉచితంగా డయాలసిస్

తిరుపతి రుయా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. రెండు మెషీన్లు ఏర్పాటు చేయగా వీటిని శుక్రవారం ప్రారంభించారు. గతంలోనే నెఫ్రోప్లస్ ఆధ్వర్యంలో పేదలకు డయాలసిస్ చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో, తీవ్రమైన కిడ్నీ సమస్య ఉన్నవారికి ఈ కొత్త సెంటర్లో ఉచితంగా డయాలసిస్ చేస్తారు. నేటి నుంచే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 24 గంటలు ఇది తెరిచే ఉంటుంది.

February 28, 2026 / 08:50 AM IST

కనిగిరిలో నేడు ప్రత్యేక సమావేశం

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ప్రత్యేక సమావేశం జరగనుంది. మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం, మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వైస్ ఛైర్మన్లు, పాలక సభ్యులు అధికారులు పాల్గొంటారని అన్నారు.

February 28, 2026 / 08:47 AM IST

రేపే గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలు

ELR: పెదవేగి అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి, ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాలకు మార్చి 1న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రమేష్ బాబు తెలిపారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 28, 2026 / 08:47 AM IST

నేడే ట్రెడ్ లైసెన్స్ ఫీజు చెల్లింపు చివరి రోజు..!

KRNL: 2026-27 సంవత్సరానికి ట్రెడ్ లైసెన్స్ ఫీజు చెల్లింపుకు నేడు చివరి తేదీగా ఉంది అని కమిషనర్ హరిప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఫ్యాక్టరీ యజమానులు, వ్యాపారస్థులు ఫీజు చెల్లించి రసీదు, లైసెన్స్ ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని అయన సూచించారు. తరవాత, మార్చి 1వ నుంచి 25% మరియు ఏప్రిల్ నుంచి 50% అపరాధ రుసుముతో ఫీజు చెల్లించవలసి వస్తుందని హెచ్చరించారు.

February 28, 2026 / 08:46 AM IST