• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదనకు ముగింపు ఎప్పుడో?

PPM: అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని AITUC జిల్లా కార్యదర్శి కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం పార్వతీపురంలోని స్థానిక కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ నెల 23న పార్వతీపురంలో అగ్రిగోల్డ్ బాధితుల విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ముప్పాళ్ళ నాగేశ్వరరావు హాజరవుతారని పేర్కొన్నారు.

February 21, 2026 / 11:07 AM IST

చోళసముద్రం టోల్ ప్లాజా సమీపంలో వాహనాలు తనిఖీలు

సత్యసాయి: లేపాక్షి మండలం చోళసముద్రం టోల్ ప్లాజా సమీపంలో హిందూపురం రూరల్ సీఐ జనార్ధన్, ఎస్సై నరేంద్ర ఆధ్వర్యంలో శనివారం వాహన తనిఖీలు నిర్వహించారు.హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులను గుర్తించి వారికి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించి, అక్కడికక్కడే కొత్త హెల్మెట్లు కొనుగోలు చేయించేలా చర్యలు చేపట్టారు.

February 21, 2026 / 11:06 AM IST

బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారికి

VSP: బురుజుపేట కనకమహాలక్ష్మి ఆలయంలో శనివారం వేకువజాము నుంచి వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి తులసీదళార్చనలు చేపట్టారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ పూజలలో ఇద్దరు ఉభయ దాతలు పాల్గొన్నారు. దేవస్థానం అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

February 21, 2026 / 11:03 AM IST

ఈ నెల 23న చిత్తూరు పోలీస్‌స్టేషన్‌లో ఫర్నిచర్ వేలం

CTR: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో ఉపయోగించిన ఫర్నిచర్, ఎలక్ట్రికల్, స్పోర్ట్స్, కిచెన్ పరికరాలకు ఈనెల 23న బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్టు అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. ఉదయం 10:30 గంటలకు ప్రశాంత్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో వేలం జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్నవారు ఏ సెక్షన్ సూపరింటెండెంట్ పుష్పరాజ్‌ను సంప్రదించాలని సూచించారు.

February 21, 2026 / 10:58 AM IST

వంగపల్లి పేటలో కాలువ పక్కన భారీగాపేరుకుపోయిన చెత్త

VZM: చీపురుపల్లి టౌన్ వంగపల్లి పేటలో కాలువ పక్కన భారీగా చెత్త పేరుకుపోయింది. ఈ చెత్త వలన దోమల బెడద ఎక్కువగా ఉందని, దీంతో రోగలు బారిన పడే అవకాశం ఉంటుందని స్థానికులు భయపడుతున్నారు. శ్రీ కనకమాలక్ష్మి తల్లి పండగ తరుణంలో జనాల తాకిడి ఎక్కువగా ఉంటుంది కనుక అధికారులు స్పందించి వెంటనే చెత్తను తొలగిస్తారని స్థానికులు కోరుతున్నారు.

February 21, 2026 / 10:55 AM IST

రామాలయ నిర్మాణానికి రూ.27,000 విరాళం

VZM: మెరకముడిదాం మండలం సిరియాల పేట గ్రామంలో రామాలయం నిర్మాణ చేపడుతున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి చీపురుపల్లి టీడీపీ మాజీ ఇంఛార్జ్ త్రిమూర్తులు రాజు రూ. 27,000 అందించారు. మోటర్ బోరు నిమిత్తం గ్రామస్థులు ఆయనను సంప్రదించగా ఈ సాహాయం అందించారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ పనులు ముగింపు దశకు వచ్చాయని తెలిపారు.

February 21, 2026 / 10:54 AM IST

ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

ప్రకాశం: కనిగిరి మోడల్ స్కూల్‌లో ఆరో తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ ఈనెల 24వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ప్రిన్సిపల్ డాక్టర్ ఎద్మావతి తులసి తెలిపారు. మార్చి 31వ తేదీ ఫీజు చెల్లింపుకు చివరి తేదీగా నిర్ణయించారు. ఏప్రిల్ 27న ప్రవేశ పరీక్ష నిర్వహించి అదే రోజు ఫలితాలు విడుదల చేస్తామన్నారు.

February 21, 2026 / 10:49 AM IST

పాఠశాలలను పరిశీలించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ

ELR: జిలుగుమిల్లీ మండల పరిధిలో ఉన్న పలు ప్రభుత్వ పాఠశాలలను శనివారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా.గోపి మూర్తి పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వద్ద నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులు ఎదుర్కొనే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరిస్తానని వారికి తెలిపారు.

February 21, 2026 / 10:47 AM IST

రేపు రూ. 42 లక్షల విలువైన చెక్కుల పంపిణీ

ATP: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అనారోగ్యం, ప్రమాదాల బారిన పడిన బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు చొరవతో మంజూరైన రూ. 42 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఆదివారం పంపిణీ చేయనున్నారు. ఉదయం 9:30 గంటలకు ప్రజావేదిక కార్యాలయంలో 29 మంది లబ్ధిదారులకు ఈ చెక్కులను ఎమ్మెల్యే అందజేస్తారు.

February 21, 2026 / 10:45 AM IST

‘స్వామి కళ్యాణ మహోత్సవాల మొదటి శుభలేఖ అందుకున్నారు’

E.G: కోరుకొండలో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఈనెల 27వ తేదీ నుంచి వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణను ఆలయ అధికారులు శనివారం కలిసి ఉత్సవాలకు సంబంధించి మొదటి శుభలేఖను అందజేశారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

February 21, 2026 / 10:45 AM IST

యాదవ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా జక్కుల కృష్ణ

PLD: జిల్లా యాదవ యువజన సంఘం అధ్యక్షుడిగా మాచవరం మండలం రేగులగడ్డకు చెందిన జక్కుల కృష్ణ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు చింకా నారాయణ ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. జిల్లాలోని యాదవుల హక్కుల కోసం పోరాడుతూ, నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానన్నారు.

February 21, 2026 / 10:45 AM IST

శివుడికి అభిషేకం.. విదేశీ భక్తుల భజన

TPT: జిల్లా రేణిగుంట శ్రీరాజరాజేశ్వరీ దేవి జ్ఞానపీఠంలో మహా శివలింగ ప్రతిష్ఠాపన శుక్రవారం ఘనంగా జరిగింది. 32 దేశాల నుంచి 140 మంది విదేశీ భక్తులు హాజరయ్యారు. శివనామ స్మరణల మధ్య రుద్రాభిషేకం, మహా చండీ హోమం నిర్వహించారు. జర్మనీ గురూజీ పరమహంస విశ్వనంద స్వామీజీ చేతుల మీదగా పూజా కార్యక్రమాలు జరిగాయి. విదేశీ భక్తులు సైతం శివ నామ స్మరణలతో మైమరిచిపోయారు.

February 21, 2026 / 10:44 AM IST

‘ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి’

SKLM: పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో స్వచ్ఛ ఆంధ్రా–స్వర్ణాంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు . ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ వజ్జ బాబూరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పీరుకట్ల విఠల్ రావు పాల్గొని పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. ఆసుపత్రి పరిసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.

February 21, 2026 / 10:39 AM IST

చోరీ కేసులో నిందితుడికి 3 నెలల జైలు శిక్ష

ప్రకాశం: దొంగతనాలే వృత్తిగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న దొంగకు 3 నెలలు జైలుశిక్ష విధిస్తూ శుక్రవారం గిద్దలూరు కోర్టు తీర్పించింది. కంభంకు చెందిన రసూల్ అనే పాత నేరస్తుడు కంభం మండలం నర్సిరెడ్డిపాలెం పోలేరమ్మ గుడిలో ఉండి పగలగొట్టి నగదు దోచుకున్నాడు. అలానే కంభంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న బాలాజీ ఎలక్ట్రికల్ షాపులో రసూల్ చోరీకి పాల్పడ్డాడని ఎస్సై తెలిపారు.

February 21, 2026 / 10:38 AM IST

జాతీయ వీల్ చైర్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌‌గా పాలకొల్లు వాసి

W.G. వీల్ చైర్ క్రికెట్‌లో పాలకొల్లు కుర్రాడు మురపాక నళిని రాజశేఖర్ సత్తా చాటుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖలో ఫిబ్రవరి 23 నుంచి 28 వరకు 5వ జాతీయ వీల్ చైర్ క్రికెట్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు రాజశేఖర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు ఏసీఏ శుక్రవారం ప్రకటించింది.

February 21, 2026 / 10:29 AM IST