• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్రజలకు కలెక్టర్ కీలక సూచనలు

E.G: రాజమండ్రిలో గణేశ్వరరావు నుంచి కొనుగోలు చేసిన పాలు, ఇతర పాల ఉత్పత్తులను వినియోగించరాదని కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం స్పష్టం చేశారు. అతడు సరఫరా చేసిన పాలు కల్తీ అయినట్లు గుర్తించామన్నారు. ఈ పాలు, వాటి ద్వారా తయారైన పెరుగు, కోవా, నెయ్యి, మీగడ వంటి పదార్థాలు ఎక్కడ నిల్వ ఉన్నా వెంటనే తొలగించి, సురక్షితంగా నాశనం చేయాలని ఆదేశించారు.

February 24, 2026 / 06:20 PM IST

కారు, ఆర్టీసీ బస్సు ఢీ.. తప్పిన ప్రమాదం

ATP: శింగనమల మండల కేంద్రంలోని శివపురం పెద్దమ్మ గుడి వద్ద మంగళవారం ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ బస్సు అనంతపురం నుంచి తార్పర్తి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

February 24, 2026 / 06:19 PM IST

ప్రముఖ పారిశ్రామికవేత్త రామచంద్ర రావు మృతి

W.G: ప్రముఖ పారిశ్రామికవేత్త, గౌతమి సాల్వెంట్స్ కర్మాగారం అధినేత మల్లిన రామచంద్రరావు(90) మంగళవారం సాయంత్రం మృతి చెందారు. గత కొంతకాలంగా అస్వస్థతకు గురైన రామచంద్రరావు ఇవాళ సజ్జాపురంలోని ఆయన స్వగృహంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రామచంద్రరావు మృతి పట్ల ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్‌తో పాటు పలువురు సంతాపం తెలిపారు.

February 24, 2026 / 06:18 PM IST

‘బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది’

SKLM: జిల్లాలో డయేరియా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ సతీమణి స్వాతి శంకర్ మంగళవారం రిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచుతామని బాధితులకు భరోసా కల్పించారు.

February 24, 2026 / 06:18 PM IST

మనస్థాపానికి గురై యువకుడి మృతి

PPM: కురుపాం మండలం తోటగూడ గ్రామానికి చెందిన ఆరిక లక్ష్మణరావు ఆత్మహత్య చేసుకున్నాడు. నిత్యం మద్యం సేవిస్తూ ఉండటంపై తండ్రి మందలించడంతో మనస్థాపానికి గురై గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు తొలుత కురుపాం ఆసుపత్రికి, అనంతరం విజయనగరం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.

February 24, 2026 / 06:17 PM IST

నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: ఎస్పీ

ఏలూరు: జిల్లాను నేరరహితంగా తీర్చిదిద్దేందుకు పోలీసు అధికారులంతా సమిష్టిగా కృషి చేయాలని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశించారు. మంగళవారం సబ్ డివిజనల్ పోలీసు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. నమోదైన కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలని, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.

February 24, 2026 / 06:17 PM IST

కోట్ల మోసం.. హోంశాఖ కీలక ఆదేశాలు..!

NDL: ఆళ్లగడ్డలో నిరుద్యోగులను మోసగించిన ‘ఓ సొల్యూషన్ స్కీమ్’ సంస్థపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఉద్యోగాల పేరుతో రూ. 35 కోట్లు వసూలు చేసిన నిర్వాహకుల ఆస్తులను జప్తు చేస్తూ మంగళవారం హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిందితులు బాధితుల సొమ్ముతో కొనుగోలు చేసిన స్థిర, చరాస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది.

February 24, 2026 / 06:12 PM IST

పవర్ గ్రిడ్ చర్యలపై ఆవేదన..!

KDP: వియన్‌పల్లె మండలం ఐ కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు శివ నాగేశ్వర్ రెడ్డి చీని తోటలో పవర్ గ్రిడ్ సిబ్బంది తన అనుమతి లేకుండా చెట్లు తొలగించారని ఆరోపిస్తూ మహిళలతో కలిసి నిరసన తెలిపారు. చిన్న పిల్లలలా పెంచుకున్న చెట్లను నష్టపరిహారం లేకుండా పీకివేయడం బాధాకరమని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం పై అధికారులు తక్షణం స్పందించి న్యాయం చేయాలని కోరారు.

February 24, 2026 / 06:11 PM IST

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: కే.కే. రాజు

VSP: పదవులు పొందిన ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని వైసీపీ జిల్లా అధ్య‌క్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు. జిల్లాలో నూతనంగా నియమితులైన వివిధ విభాగాల నాయకులు కేకే రాజును కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

February 24, 2026 / 06:11 PM IST

మహిళల భద్రతపై శక్తి టీం విస్తృత అవగాహన

సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శక్తి టీం బృందాలు మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. పాఠశాల విద్యార్థినులు, రద్దీ ప్రాంతాల్లోని మహిళలు, పొలాల్లో పనిచేసే కూలీలకు రక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. ఈవ్ టీజింగ్, వేధింపులు వంటి ఘటనలు ఎదురైతే సహించకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

February 24, 2026 / 06:10 PM IST

నాటుసారా సీజ్ చేశాం: ఎక్సైజ్ సీఐ

NDL: 5 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకొని స్వాధీనం చేసుకున్నట్లు నందికొట్కూరు ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు తెలిపారు. మంగళవారం మిడుతూరు(M ) కాజీపేట వద్ద దాడులు నిర్వహించామని తెలిపారు. ఈ దాడులలో గడివేముల (M) లక్ష్మయ్య కుంట తండాకు చెందిన ఓ వ్యక్తి వద్ద 5 లీటర్లు, అల్లూరులో ఓ మహిళ వద్ద 4 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకొని సీజ్ చేసామన్నారు.

February 24, 2026 / 06:10 PM IST

ఆదోనిలో దేవాలయ భూమి కబ్జా ఆరోపణలు

KRNL: ఆదోని శుక్రవారం పేటలో సర్వే నంబర్ 315లోని 4 ఎకరాలు 2 సెంట్ల దేవాలయ భూమిని వైసీపీ నాయకుడు రఘునాథ్ అక్రమంగా కబ్జా చేశారని ఇవాళ బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనను ఖండిస్తూ బీజేపీ నార్త్ మండలం ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. దేవాలయ ఆస్తులను రక్షించి భూమిని తిరిగి ప్రజలకు అప్పగించాలని ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు.

February 24, 2026 / 06:07 PM IST

బాపట్ల వ్యవసాయ కళాశాలకు వర్సిటీ హోదా

BPT: బాపట్ల వ్యవసాయ కళాశాలకు విశ్వవిద్యాలయ హోదా కల్పించాలని 1965-69 బ్యాచ్ పూర్వ విద్యార్థులు కోరారు. మంగళవారం కళాశాలలో జరిగిన సమ్మేళనంలో వారు ప్రభుత్వానికి ఈ విజ్ఞప్తి చేశారు. కళాశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా అసోసియేట్ డీన్ డా.ప్రసూన రాణితో పాటు పలువురు అధ్యాపకులను ఘనంగా సత్కరించారు.

February 24, 2026 / 06:04 PM IST

‘అర్హులైన వారందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేస్తాం’

CTR: జిల్లాలో అర్హులైన వారందరికీ అక్రిడేషన్ కార్డుల మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన DMAC రెండవ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్, ఎన్ వేలాయుధం, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

February 24, 2026 / 06:00 PM IST

వేలాది మందికి ప్రాణదాత ఇక లేరు!

E.G: గౌరీపట్నం వాస్తవ్యులు, కార్డియాలజిస్ట్ ముళ్లపూడి వెంకటరత్నం (88) సోమవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. తన కుమార్తె జ్ఞాపకార్థం అమెరికా నుంచి వచ్చి గాజులరామారంలో ఆసుపత్రిని స్థాపించారు. మూడున్నర దశాబ్దాలుగా స్వయంగా 20 వేలకు పైగా ఆపరేషన్లు చేసి పేదలకు వైద్యం అందించారు. ఆయన మరణం తీరని లోటని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

February 24, 2026 / 06:00 PM IST