AKP: అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని మహిళ శనివారం మృతి చెందినట్లు మునగపాక ఎస్సై ప్రసాదరావు తెలిపారు. మండలంలో గణపర్తి గ్రామ సమీపంలో ఈనెల 19వ తేదీన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మహిళ తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. స్థానికులు వెంటనే అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో చేర్పించినట్లు వెళ్లడించారు.
కృష్ణా: గుడివాడ మండలం మల్లాయిపాలెం రైల్వే గేట్ వద్ద హెల్మెట్ ధరించడంపై ఎస్సై చంటిబాబు వాహనదారులకు ఇవాళ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు వాహనంపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ప్రజల భద్రత పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు.
KDP: రాజంపేటలోని మారుతి ప్రసన్న లాడ్జి వద్ద ఉన్న కెనరా బ్యాంకు ఏటిఎం వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్ ఉదయగిరి రాజాపై మద్యం మత్తులో వచ్చిన యువకులు దాడికి పాల్పడ్డారు. బ్యాంకులోకి వెళ్తున్న వారిని ప్రశ్నించడంతో చైర్‌తో తలపై దాడి చేయగా రాజాకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన సెక్యూరిటీ గార్డును రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ELR: శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామి, అమ్మవార్లను గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ రాజగోపురం వద్ద అధికారులు మంత్రికి ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచననలు అందజేసి శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాలు, చిత్రపటంతో మంత్రిని సత్కరించారు.
SKLM: నరసన్నపేట(M) చిక్కాలవలస కి చెందిన అమృత్ కుమార్ CRPF జవాన్ మణిపూర్ లో విధి నిర్వహణలో గుండెపోటుతో మరణం చెందారు. ఆయన పార్థివదేహాన్ని అధికారులు ఆదివారం స్వగ్రామానికి తీసుకువచ్చారు. జడ్పిటిసి కృష్ణ చైతన్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జవాన్ అంతిమయాత్రలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయ.
E.G: కడియం మండలం వేమగిరిలో ఆధ్యాత్మిక వైభవం మొదలైంది. కెవిఆర్ లేఔట్‌లో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పూలరథంపై భక్తులు ఊరేగించారు. వందలాదిమంది మహిళా భక్తులు సంప్రదాయ పసుపు చీరలు ధరించి చేత కాషాయ జెండాలు పట్టి నమో వెంకటేశా అంటూ ముందుకు సాగారు. ఈనెల 26వ తేదీన ఆలయ ప్రతిష్ట జరగనుంది.
GNTR: రాష్ట్రంలోని పేద ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అత్యంత శ్రద్ధ తీసుకుంటుందని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. పొన్నూరు మండల పరిధిలోని 25 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆదివారం రూ. 13,15,872/- చెక్కులను పంపిణీ చేశారు. లబ్ధిదారులు చెక్కులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ATP: ఉరవకొండ గవిమఠం శ్రీచంద్రమౌళీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. మఠం ప్రాంగణంలో అర్చకుల మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా గంగపూజ, కంకణధారణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కరిబసవేశ్వర స్వామి జీవసమాధి వద్ద నాగపూజ జరిపారు. నేడు స్వామివారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.
KKD: గత YCP ప్రభుత్వం రాష్ట్రంలో ల్యాండ్, సాండ్, వైన్, మైన్ ఇలా అన్ని వనరులను దోచుకుందని కాకినాడ MLA వనమాడి కొండబాబు ఆరోపించారు. శనివారం TDP కార్యాలయంలో కూటమి నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. చివరికి తిరుమల లడ్డూను కూడా వదలలేదని విమర్శించారు. కల్తీ జరిగిన విషయాన్ని మాజీ ఛైర్మన్ సుబ్బారెడ్డి అంగీకరించారని తెలిపారు.
NDL: ధర్మవరం-మచిలీపట్నం రైలులో కడప జిల్లా ఎర్రగుంట్లకు వస్తూ వివాహిత అదృశ్యమైనట్లు ఎర్రగుంట్ల రైల్వే పోలీసులు తెలిపారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. తన భార్య శ్రీదేవి వైజాగ్‌లోని అత్తగారింటికి వెళ్లి తిరిగి వస్తుండగా అదృశ్యమైనట్లు నంద్యాలకు చెందిన భర్త జగదీశ్వర్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.
KDP: సిద్ధవటం మండలం భాకరాపేట గ్రామ సమీపంలో ఉన్న APSP 11వ పోలీసు బెటాలియన్లో ఆదివారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్ రాజశేఖర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసి ప్రాణాలర్పించిన దీశాలి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని కొనియాడారు.
KDP: సిద్ధవటం మండలం భాకరాపేట గ్రామ సమీపంలో ఉన్న APSP 11వ పోలీసు బెటాలియన్లో ఆదివారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్ రాజశేఖర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసి ప్రాణాలర్పించిన దీశాలి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని కొనియాడారు.
అల్లూరి జిల్లా రిజిస్ట్రార్‌గా సీహెచ్ నరసింహమూర్తి నూతనంగా బాధ్యతలను చేపట్టారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న నరసింహమూర్తికి ప్రభుత్వం రిజిస్ట్రార్‌గా పదోన్నతి కల్పించి అల్లూరి జిల్లాకు నియమించింది. నూతనంగా బాధ్యతలను స్వీకరించిన ఆయనకు శనివారం ఉద్యోగులు, కార్యాలయం సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ELR: నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. సబ్ కలెక్టర్ వినూత్న ఆదివారం మాట్లాడుతూ.. రెవిన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించాలన్నారు. ప్రతి సమస్య ఆన్ లైన్ చేసి నిర్ణీత వ్యవధిలో పరిష్కరించడం జరుగుతుందన్నారు.
తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. దర్శనం కోసం కృష్ణతేజ అతిథి భవనం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న మొత్తం 82,043 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే 32,299 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అదే రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.74 కోట్లుగా నమోదైంది.