BPT: చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఆయనకు స్థానిక ప్రజలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఎంపీ పాల్గొని, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
ప్రకాశం: పర్యావరణ పరిరక్షణలో పాములు కీలక పాత్ర పోషిస్తాయని, మార్కాపురం వన్యప్రాణి విభాగం స్నేక్ క్యాచర్ నిరంజన్ అన్నారు. తర్లుపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, పర్యావరణ విద్యలో భాగంగా ‘పాములు-పర్యావరణ హితకారులు’ అనే అంశంపై సోమవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాము కుట్టినప్పుడు భయపడకుండా తీసుకోవలసిన ప్రథమ చికిత్స గురించి వివరించారు.
TPT: ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం కోసం ఏపీ స్టూడెంట్స్ జేఏసీ నిరంతరం శ్రమించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. సోమవారం అమరావతి సచివాలయంలో ఏపీ స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమాద్రి యాదవ్‌కు సూచించారు. నిరంతరం విద్యార్థులకు అందుబాటులో ఉండి వారి హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
కృష్ణా: గుడ్లవల్లేరు మండలంలోని మండల ప్రజా పరిషత్ స్కూల్ ను ఎంపీడీవో ఇమ్రాన్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. పాఠశాలలో హాజరు, మౌలిక వసతులు, పరిశుభ్రత, మధ్యాహ్న భోజన ఏర్పాట్లను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యార్థి అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
AKP: పరవాడ మండలం గొర్లవానిపాలెంలో ఈనెల 26వ తేదీ నుంచి ఉపాధి హామీ పనులను పునఃప్రారంభిస్తున్నట్లు ఎంపీడీవో రమేష్ నాయుడు తెలిపారు. గత కొన్ని రోజులుగా గ్రామంలో ఉపాధి పనులు నిలిపివేయడంతో కూలీలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి సోమవారం ఎంపీడీవో దృష్టికి తీసుకువెళ్లారు.
W.G. బాగా చదువుకుని పెద్ద స్థాయికి ఎదగాలి అంటూ మాజీ మంత్రి డా. కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. అత్తిలి గ్రామానికి చెందిన అందె మీనాక్షి అనే విద్యార్థిని చదువుకు అవసరమైన పుస్తకాలు లేక ఇబ్బంది పడుతోంది అని నాయకుల ద్వారా తెలుసుకున్నారు. ఆమెను సోమవారం తణుకు నివాసానికి పిలిపించి ఆమెకు కావాల్సిన పుస్తకాలను స్వయంగా అందించారు.
CTR: అంగన్వాడి సమస్యల పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ, CITU, IFTU ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. అందులో భాగంగా సోమవారం అంగన్వాడి వర్కర్స్ ఆధ్వర్యంలో నగరిలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి వర్కర్లు మాట్లాడుతూ.. ఇప్పుడు జరుగుతున్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.
TPT: శ్రీకాళహస్తి SDPO నరసింహమూర్తి ఆధ్వర్యంలో, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో రాత్రి తనిఖీల సమయంలో, కావేరి ట్రావెలకు చెందిన ప్రైవేట్ బస్సు డ్రైవర్ ఎం.జానయ్య అధిక మోతాదులో మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది. నిందితుడిపై తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, కోర్టు 12 రోజుల పాటు జైలు శిక్ష విధించింది.
GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బీసీలు అధికంగా ఉన్న నేపథ్యంలో బీసీ భవన నిర్మాణాన్ని ఈ బడ్జెట్‌లోనే వేగవంతంగా ప్రారంభించాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అసెంబ్లీలో కోరారు. వెలగపూడిలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో “బీసీ సంక్షేమం”పై జరిగిన చర్చలో ఆమె పాల్గొన్నారు.
తూ.గో: రాజమహేంద్రవరంలోని లాలాపేట చెరువు చౌడేశ్వరి నగర్ ప్రాంతంలో ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. పాల వ్యాపారి 46 మంది రైతుల వద్ద పాలు సేకరించి 106 కుటుంబాలకు పోశాడన్నారు. ఎవరైనా అనారోగ్యానికి గురైతే కాల్ సెంటర్‌కు (94940 60060)ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.
తూ.గో: రాజమండ్రిలో కల్తీ పాల వల్ల జరిగిన మరణాలు, అనారోగ్య ఘటనలపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఈ ఘటనకు సంబంధించి 106 కుటుంబాలకు పాలు సరఫరా అయినట్లు గుర్తించామని, ఇప్పటికే ఆయా కుటుంబాల నుంచి శాంపిల్స్ సేకరించి విచారణ జరుపుతున్నామని తెలిపారు. అనారోగ్యానికి కల్తీ పాలే కారణమని వెల్లడించారు.
కడప: ప్రొద్దుటూరు కేంద్రాలుగా వైవీయూ పీజీ తొలి సెమిస్టర్ పరీక్షలు సోమవారం కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య మొదలయ్యాయి. వైవీయూ క్యాంపస్‌లో జరుగుతున్న పరీక్షలను వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.చీఫ్ సూపరింటెండెంట్ గది నుంచి సీసీ కెమెరాల ద్వారా జరుగుతున్న పర్యవేక్షణను పరిశీలించారు.
KRNL: ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆదేశాల మేరకు నందవరం మండలం నందవరం 1, 2, 3 గ్రామాల కమిటీలను పూర్తి చేశారు. గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసి కమిటీలను రూపొందించి ఇంఛార్జ్‌కు సోమవారం అందజేశారు. గ్రామ స్థాయి నుంచే పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ కమిటీలు పనిచేస్తాయని నాయకులు తెలిపారు.
NDL: ఆళ్లగడ్డ నియోజకవర్గం లో ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రం ఎగువ అహోబిలం ఆలయంలో సోమవారం హుండీ కానుకల లెక్కింపు ప్రారంభమైంది. ఆలయ ప్రధాన అర్చకులు అధికారుల ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు సీసీ కెమెరాలు పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సేవా సమితి సభ్యులు పాల్గొని కానుకల లెక్కింపులో తమ సేవలు అందించారు.
GNTR: ఐసీడీఎస్ బడ్జెట్ పెంపుతో పాటు అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫిరంగిపురం మండల పరిషత్ కార్యాలయం సమీపంలో అంగన్వాడీలు మంగళవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షలను ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు జి. రమణ ప్రారంభించారు.