NLR: బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలో మెప్మా సహకారంతో సారీ రోలింగ్ షాపును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి షాపును ఓపెన్ చేశారు. పొదుపులో వచ్చే రుణాలతో మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రుణాలను అందజేస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్క మహిళ ఆర్థికంగా ఎదగాలన్నారు.
కృష్ణా: గుడూరు పరిధిలోని చిట్టిగూడూరు గ్రామ శివారులో ఎస్సై దివ్య ప్రకాష్ తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.16,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
NDL: రేపు కోయిలకుంట్ల పట్టణంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నట్లు ఇవాళ వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి తెలిపారు. కోయిలకుంట్ల పట్టణంలో ఉదయం 10 గంటలకు ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్‌ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం స్వర్ణాంధ్ర, స్వచంద్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారని ఆయన అన్నారు.
కర్నూలు: రాష్ట్రంలో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు చేపట్టిన మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
SKLM: ఆదర్శపాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO ఏ. రవి బాబు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఉన్న13 ఆదర్శ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం 6వ తరగతిలో ప్రవేశం కొరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఆయా మండలాల్లో ఉన్న ఆదర్శ పాఠశాలల్లోనే ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్షలు జరుగుతాయిన్నారు. https://www.cse.ap.gov.in/apmలో చూడవచ్చని తెలిపారు.
ప్రకాశం: మార్కాపురం డీఎల్డీవో బాలునాయక్ కంభం పట్టణంలోని తర్లుపాడు రోడ్డుపై జరుగుతున్న చెత్త తొలగింపు పనులను శుక్రవారం పరిశీలించారు. రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించి, పట్టణంలో పరిశుభ్రతను మెరుగుపరచాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పాల్గొన్నారు.
NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో వెలిసి ఉన్న చౌడేశ్వరిదేవి అమ్మవారి ఆలయంలో ఇవాళ పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేక పూలమాలలతో అలంకరించారు. నందవరం గ్రామంలో చౌడేశ్వరి దేవి అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.
KRNL: పదో తరగతి పరీక్షలను ఇబ్బందులు లేకుండా, పకడ్బందీగా నిర్వహించాలని నంద్యాల DRO డి.రామునాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నంద్యాల కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన నిఘా ఉండాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అన్నమయ్య: పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిని అన్నమయ్య జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎల్. రాధిక శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. టీబీ యూనిట్ రికార్డులు, నివేదికలను పరిశీలించి చికిత్స విధానాలపై అధికారులతో సమీక్షించారు. క్షయను తొలి దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని సూచించారు. వైద్య సిబ్బందికి వ్యాధి నిర్మూలనలో మరింత చురుకుదనం అవసరమని పేర్కొన్నారు.
ATP: గుత్తి మండలం ఊటకల్లు గ్రామంలో పాముకాటుకు గురై చికిత్స పొందుతూ జయమ్మ అనే మహిళ శుక్రవారం మృతి చెందింది. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. గత రెండు వారాల క్రితం పాముకాటుకు గురైన జయమ్మను మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
VZM: సీతం కళాశాలలో శుక్రవారం నిర్వహించిన సాంస్కృతిక వైభవం కన్నుల పండుగగా సాగింది. అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలలో నృత్య ప్రదర్శనలు గావిస్తూ విజయనగరం ఖ్యాతిని ఇనుమడింపచేస్తున్న అన్నా నేహా అన్నాథామస్‌కు నటరాజ పురస్కారాన్ని ప్రదానం చేసారు. అనంతరం ఆమె నృత్య ప్రదర్శనకు ప్రేక్షకులందరూ పరవశుతులయ్యారు.
ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా భీమవరం JLB స్కూల్లో విద్యార్థినిలు భువన విజయం రూపకం శుక్రవారం ప్రదర్శించారు. మాతృభాష అభ్యున్నతికి పాటుపడుతున్న కలిగొట్ల గోపాలశర్మ, సాగిరాజు సత్యనారాయణరాజు, వేము వెంకటకృష్ణమోహన్, తెలుగు అధ్యాపకులు రోహిణి, మౌనిక భవానిలను సత్కరించినట్టు HM కృష్ణకుమారి, అల్లు శ్రీనివాసులు తెలిపారు. ఇందులో రిటైర్డ్ MEO.సీతారామరాజు పాల్గొన్నారు.
PPM: వ్యాదుల మూల కారణాలపై దృష్టి సారించి నియంత్రణ చర్యలు చేపట్టాలని DMHO డా ఎస్. భాస్కరరావు స్పష్టం చేశారు. ఉల్లిభద్ర గ్రామంలో శుక్రవారం ఆయన సందర్శించి అక్కడ ఫ్రైడే డ్రైడే నిర్వహణ తీరు పరిశీలించారు. గ్రామంలో గృహ సందర్శనలు చేస్తూ పరిసరాల్లో నీటి తొట్టెలు, కాల్వలు పరిశీలించారు. లార్వా ఉనికి ప్రదేశాలను నియంత్రణ చెయ్యాలి అన్నారు.
ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా జిల్లాలో అదనంగా 15 శనగ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా తెలిపారు. ఈ నెల 21వ తేదీ నుంచి కొత్త కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే 6 కేంద్రాలు పనిచేస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరల ప్రకారం శనగ క్వింటాల్‌కు రూ. 5,875 చెల్లించబడుతుందని తెలిపారు.
BPT: పిడుగురాళ్ల–వాడరేవు జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్చూరు వైపు వస్తున్న కారు, బైక్ బలంగా ఢీకొనడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పర్చూరు SI పులి గోపి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.