• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: MLA

PLD: వినుకొండ TDP కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ ఆంజనేయులు ఆదివారం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారితో ఆయన ముఖాముఖి మాట్లాడి వినతులు స్వీకరించారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇతర ప్రభుత్వ పథకాల మంజూరులో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే తన ప్రధాన ధ్యేయమన్నారు.

February 22, 2026 / 02:27 PM IST

వరాహ నదిలో ప్లాస్టిక్ వ్యర్ధాలు ఏరివేత

AKP: ఎస్.రాయవరం మండలం వమ్మవరం వద్ద ఆదివారం సంత్ నిరంకారీ మిషన్ ఆధ్వర్యంలో వరాహ నదిలో ప్లాస్టిక్ వ్యర్ధాలు నాచు తొలగించి శుభ్రం చేశారు. మిషన్ కసింకోట సెక్టార్‌కు చెందిన సంయోజకులు కె చిదంబరావు, నాగరాజు, ప్రచారకులు సత్యవతి, వెంకటలక్ష్మి మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వ్యర్ధాలు వల్ల నది జలాలు కలుషితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

February 22, 2026 / 02:25 PM IST

మొనకూరులో ‘కార్డన్ అండ్ సెర్చ్’

TPT: మొనకూరు పరిధిలోని ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో రూరల్ సర్కిల్ సీఐ, ఎస్సైలు సిబ్బందితో కలిసి కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. పలు ఇళ్లలో సోదాలు నిర్వహించి, రికార్డులు లేని 15 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. మద్యం సేవనం, గంజాయి వినియోగం వంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడకూడదని హెచ్చరించారు. మహిళలు, పిల్లల పట్ల గౌరవప్రదమైన ప్రవర్తనతో కొనసాగాలని సూచించారు.

February 22, 2026 / 02:25 PM IST

నూతన బస్సు సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే

E.G: కొవ్వూరు RTC బస్‌స్టాండ్ వద్ద కొవ్వూరు నుంచి తాళ్లపూడి, పోలవరం వెళ్ళే నూతన బస్ సర్వీస్‌ను కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు ఇవాళ ప్రారంభించారు. ఈ బస్సు సర్వీస్ కొవ్వూరు డిపో నుంచి సాయంత్రం 5.45 నిమిషాలకు ప్రారంభమవుతుందని తెలిపారు. కావున ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

February 22, 2026 / 02:25 PM IST

ఉయ్యాలవాడ నరసింహ రెడ్డికి ఘన నివాళి

చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి 179వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చిత్తూరు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

February 22, 2026 / 02:25 PM IST

బాపట్లలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

బాపట్లలో ఆదివారం టీడీపీ పార్లమెంట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి, ఎంపీ కృష్ణప్రసాద్, పలువురు ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పార్టీ బలోపేతం, అభివృద్ధి పనుల వేగవంతం, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలన్నారు.

February 22, 2026 / 02:25 PM IST

మద్యం దుకాణాలను పరిశీలించిన ఎక్సైజ్ సీఐ

VZM: చీపురుపల్లిలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర సందర్భంగా ఆదివారం మద్యం దుకాణాలను ఎక్సైజ్ సీఐ చక్రవర్తి పరిశీలించారు. షాపుల వద్ద రద్దీ చేపట్టకూడదని షాపుల యాజమాన్యాలకి సూచించారు. పండుగ పురస్కరించుకొని అధిక ధరల అమ్మినట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ వినియోగించాలని సూచన చేశారు.

February 22, 2026 / 02:24 PM IST

బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

NDL: నందికొట్కూరు(M) కొనేటమ్మ పల్లెలో సర్పంచ్ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో రూ.1.90 కోట్లతో చేపడుతున్న బీటీ రోడ్డు నిర్మాణానికి MLA జయసూర్య, తదితరులు ఆదివారం భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు. రహదారులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని భావించి CM బీటీ రోడ్లు వేస్తున్నారని తెలిపారు.

February 22, 2026 / 02:23 PM IST

‘వసతి గృహంలో సౌకర్యాలు బాగున్నాయి’

NLR: బుచ్చిరెడ్డిపాలెం ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని డీడిీ శోభారాణి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను హామీ పరిశీలించారు. ఇంటర్, పదవ తరగతి విద్యార్థులు ఎలా చదువుతున్నారని ఆరా తీశారు.విద్యార్థులకు పెట్టే భోజనాన్ని ఆమె స్వయంగా రుచి చూసి పరిశీలించారు. వసతి గృహంలో సౌకర్యాలు బాగున్నాయని విద్యార్థులు చెప్పారన్నారు.

February 22, 2026 / 02:22 PM IST

రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చిన సీఐ

కృష్ణా: గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో టూ టౌన్ సీఐ హనీష్ కుమార్ ఆదివారం రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. సీఐ మాట్లాడుతూ.. రౌడీ షీటర్లు ఎలాంటి అల్లర్లకు పాల్పడినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇకనైనా చెడు వ్యసనాలకు దూరంగా ఉండి చేసిన తప్పులను సరిదిద్దుకుని, సమాజంలో మంచి వ్యక్తులుగా జీవించాలని సూచించారు.

February 22, 2026 / 02:18 PM IST

ఘనంగా శ్రీ పెద్దమ్మ తల్లి దేవర పండుగా..!

KDP: జమ్మలమడుగుల శ్రీ పెద్దమ్మ తల్లి దేవర 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఆదివారం వైభవంగా నిర్వహించారు. 1050 కలశాలతో ముద్దనూరు రోడ్డులోని శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం నుంచి ప్రారంభమైంది. ఈ దేవరను వీక్షించడానికి జమ్మలమడుగు చుట్టుపక్కల ప్రజలు ఉదయాన్నే భారీగా తరలివచ్చారు. పోలీసులు ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

February 22, 2026 / 02:18 PM IST

మల్లిపూడిలో అభివృద్ధి పనులకు శ్రీకారం..!

 W.G: పెనుమంట్ర మండలం మల్లిపూడిలో రూ.47.50 లక్షలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులను MLA పితాని సత్యనారాయణ ఆదివారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని ఆయన తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతోనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

February 22, 2026 / 02:18 PM IST

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి

పార్వతీపురం పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని నిర్వహించారు. డీఎస్పీ థామస్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడి, భారతీయులకు అండగా నిలిచిన మహనీయుడిగా ఆయనను స్మరించారు.

February 22, 2026 / 02:17 PM IST

‘మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం ముందుంటుంది’

PLD: మైనారిటీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మద్దినగర్‌లో రూ. 30 లక్షలతో నిర్మించనున్న ముస్లిం కమ్యూనిటీ హాల్‌కు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మైనారిటీల ప్రయోజనాల కోసం ఈ భవన నిర్మాణాన్ని చేపట్టామన్నారు. గత పాలకులు ముస్లింలకు ఏమీ చేయలేదని అన్నారు.

February 22, 2026 / 02:17 PM IST

జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

VZM: రేపటి నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానున్న జామి శ్రీ ఎల్లారమ్మ తల్లి అమ్మవారి జాతర ఏర్పాట్లను ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆమె, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్ల వద్ద పక్కా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

February 22, 2026 / 02:17 PM IST