త్వరలోనే ముడి చమురు ధరలు తగ్గొచ్చని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో చమురు సంస్థ మార్జిన్లు బాగా పెరిగాయంది. కాబట్టి పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు రూ.2-3 చొప్పున తగ్గించేందుకు వీలుందని పేర్కొంది. కాగా.. ఈ ఏడాది మార్చిలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.2 చొప్పున తగ్గించారు. అప్పటి నుంచి వీటి ధరల్లో మార్పు లేదు.