అమెరికా ఆర్థిక అత్యవసర స్థితిలోకి వెళ్లిపోయిందని టెస్లా CEO ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. అప్పులపై ప్రభుత్వం చెల్లిస్తున్న వడ్డీలు ఏడాదికి ట్రిలియన్ డాలర్లు (రూ.84 లక్షల కోట్లు) దాటిపోయాయని, రక్షణ రంగానికి చేసిన కేటాయింపుల కంటే ఇది ఎక్కువని పేర్కొన్నారు. ఈ వడ్డీ చెల్లింపులు ఫెడరల్ ట్యాక్స్ ఆదాయంలో 23 శాతమని తెలిపారు. జాతీయ రుణం 35.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని పేర్కొన్నారు.