»Xiaomi Pad 6 With Snapdragon 870 Soc 144hz Lcd Display Launched In India
Xiaomi: షావోమి ప్యాడ్స్ అదరహో.. రెండు వేరియంట్స్‌లో రిలీజ్
షావోమి రెండు ట్యాబ్స్ రిలీజ్ చేసింది. టాప్ ఫీచర్లతో భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఒక్కో ట్యాబ్‌పై ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఇన్ స్టంట్ రూ.3 వేల క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తోంది.
Xiaomi Pad 6 With Snapdragon 870 SoC, 144Hz LCD Display Launched in India
Xiaomi Pad 6: ట్యాబ్ మార్కెట్లో రెండు ప్రీమియం మోడల్స్‌ను షావోమి (Xiaomi) రిలీజ్ చేసింది. ప్యాడ్ 6 పేరుతో అవీ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఏడేళ్ల తర్వాత భారత మార్కెట్లో ట్యాబ్‌లను షివోమి ప్రవేశపెట్టింది. షివోమి ప్యాడ్ 5ని కీ బోర్డ్, స్టైలస్‌తో విడుదల చేయగా.. అప్పుడు కూడా మంచి స్పందన వచ్చింది.
షావోమి ప్యాడ్ 6 (Xiaomi Pad 6) 6జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజీ వల్ల ప్యాడ్ 6 ధర రూ.26,999గా ఉంది. అదే 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో మరో రూ.3 వేల డిస్కౌంట్ వస్తోంది. అంటే 23,999, 25,9999కి రెండు ట్యాబ్స్ వస్తాయి. గ్రాపైట్ గ్రే, మిస్ట్ బ్లూ కలర్లో లభిస్తున్నాయి. ప్యాడ్ 6.. 11 ఇంచుల ఎల్సీడీ డిస్ ప్లేతో వస్తోంది. 144 హెర్జ్ రీఫ్రెష్ రేటు ఇస్తోంది. హెచ్డీఆర్ 10 ప్లస్ డాల్జీ విజన్‌కు స్క్రీన్ సపోర్ట్ చేస్తోంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్షన్ ఇచ్చారు. ఆండ్రాయిడ్ 13 మీద మొబైల్ రన్ అవుతుంది. జూన్ 21వ తేదీ నుంచి అమెజాన్, ఎంఐ.కామ్, ఇతర రిటైల్ స్టోర్స్‌లలో ట్యాబ్ అందుబాటులో ఉంటుంది. షావొమి పాడ్ 6 కీ బోర్డ్, కవర్, స్మార్ట్ పెన్ ధరలు రూ.4,999, రూ.1499, రూ.5999గా ఉంది.
ప్యాడ్ 6 క్వాల్కామ్ స్పాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ ఇచ్చారు. 8840 ఎంఏహెచ్ బ్యాటరీ రాగా 33 వాట్ ఫాస్ట్ చార్జీంగ్ అవనుంది. వెనకాల 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 8 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. 6.51 ఎంఎం మందంతో పలుచగా ఉంటుంది. బరువు కేవలం 490 గ్రాములు మాత్రమే ఉంటుంది.