»Toyota Urban Cruiser Taisor Suv Launched In India
Taisor : దేశీయ మార్కెట్లోకి టయోటా టైజర్.. ధర ఎంతంటే?
ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా తాజాగా ఎంట్రీ లెవెల్ ఎస్యూవీ అర్బన్ క్రూజర్ టైజర్ని భారత మార్కెట్లో విడుదల చేసింది. దీనికి సంబంధించిన ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Toyota Taisor : దేశీయ మార్కెట్లోకి టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ విడుదలైంది. ఎంట్రీ లెవెల్ ఎస్యూవీ అయిన టైజర్కి సంబంధించిన ధరలు ఇలా ఉన్నాయి. ముంబయి షోరూంలో దీని ప్రారంభ ధర రూ.7.73 లక్షలు కాగా గరిష్ఠ ధర 13.03 లక్షలకు గా ఉంది. ఈ విషయమై టయోటా(Toyota) కిర్లోస్కర్ డిప్యూటీ ఎండీ తాజాషీ అసజుమా మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ఎస్‌యూవీలకు ఆదరణ పెరుగుతోందన్నారు. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని తాము కూడా ఈ విభాగంలో మరిన్ని మోడళ్లను పరిచయం చేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు.
కేమ్రీ, ఇన్నోవా, ఫార్చ్యూనర్ మోడళ్లు తమ టాప్ సెల్లింగ్ కార్లుగా ఉన్నాయని తాజాషీ అన్నారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా తమ సంస్థ కొత్త కార్లను డిజైన్ చేయడంపై దృష్టి సారించిందని చెప్పారు. చిన్న కార్ల నుంచి పెద్ద కార్లకు ఇప్పుడిప్పుడే ట్రెండ్ మారుతోందని అన్నారు. దానికి అనుగుణంగానే తాము కార్లను డిజైన్ చేస్తున్నట్లు చెప్పారు.
ఈ టైజర్ కారు(Taisor Car)లో హానీ కూంబ్ గ్రిల్, రీ డిజైన్డ్ ఫ్రంట్ బంపర్, కొత్త ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ , 16 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఈ టయోటా టైజర్ ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులో 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో ఛార్జ్డ్ ఇంజిన్ ఉంటాయి. పెట్రోల్ ఇంజిన్ 89 Bhp పవర్ తో వస్తోంది. 113 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే టర్బో పెట్రోల్ యూనిట్ 99 Bhp పవర్‌తో వస్తుంది. ఇది 148 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్లు మాన్యువల్, ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి.