ఈ రోజుల్లో దేశంలో చాలా మంది వ్యక్తులు ప్రతి చిన్న, పెద్ద చెల్లింపు కోసం UPIని ఉపయోగిస్తున్నారు. ఇంటర్నెట్ లేదా సర్వర్ సమస్య కారణంగా చాలా సార్లు చెల్లింపు నిలిచిపోతున్నాయి. దీంతో ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆర్బీఐ తాజా నిర్ణయంతో కొన్ని కోట్ల మందికి ఉపశమనం లభించింది.
సైబర్ మోసాలను అరికట్టేందుకు మొబైల్ ఫోన్ కనెక్షన్‌ల విషయంలో టెలికాం శాఖ కఠినంగా వ్యవహరించడం ప్రారంభించింది. ఈ చర్యలో భాగంగా టెలికాం శాఖ ఇప్పటివరకు 1.14 కోట్ల క్రియాశీల మొబైల్ ఫోన్ కనెక్షన్‌లను పరీక్షించింది.
ఓ వ్యక్తికి మంచి జీతంతో ఓ కంపెనీలో ఉద్యోగం(job) వచ్చింది. కొన్ని రౌండ్ల ఇంటర్వ్యూ తర్వాత తక్షణమే నియమించుకున్నారు. కానీ ఉద్యోగంలో చేరిన మొదటి రోజు తర్వాత తన జాబ్ కు రాజీనామా చేశాడు. అయితే అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu) బర్త్ డే ఈరోజు(ఆగస్టు 9). 48వ ఏడాదిలోకి అడుగుపెట్టేశారు. సుమారు 20 ఏళ్లకుపైగా తెలుగు సినీ పరిశ్రమలో పలు చిత్రాలు చేస్తూ టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్న ఈ స్టార్ హీరో బయోగ్రఫీ, ఆస్తుల(property) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఫోర్బ్స్ జాబితాలో దివి ల్యాబ్స్ అధినేత మురళి దివికి చోటు దక్కింది. రూ.53 వేల కోట్ల ఆస్తులతో ఆయన హైదరాబాద్‌లోనే రిచ్చెస్ట్ మ్యాన్‌గా చరిత్ర సృష్టించాడు.
జూలై 2023లో జూన్‌తో పోలిస్తే శాఖాహారం ప్లేట్ ధర 34 శాతం పెరిగింది. నాన్ వెజ్ ప్లేట్ ద్రవ్యోల్బణం 13 శాతం పెరిగింది.ఫుడ్ ప్లేస్ ధరపై రేటింగ్ ఏజెన్సీ CRISIL నెలవారీ సూచిక ప్రకారం.. జూలై నెలలో వరుసగా మూడవ నెలలో శాఖాహారం థాలీ ధరలో పెరుగుదల ఉంది.
LIC జీవన్ లాభ్ పాలసీలో మీరు ప్రతి నెలా 7,572 మాత్రమే ఆదా చేసుకోవాలి. దీనితో మీరు మెచ్యూరిటీపై రూ.54 లక్షల భారీ ఫండ్ పొందుతారు. ఇది LIC పరిమిత ప్రీమియం, నాన్ లింక్డ్ పాలసీ. పాలసీదారు మరణించిన సందర్భంలో కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తుంది.
ఇకనుంచి Zomato ప్రతి ఆర్డర్‌పై రూ. 2 ప్లాట్‌ఫారమ్ రుసుమును వసూలు చేయడం ప్రారంభించింది. దాని అదనపు రుసుములు ఎంపిక చేసిన వినియోగదారుల నుండి మాత్రమే వసూలు చేయబడుతున్నాయి. Zomato త్వరిత వాణిజ్య ప్లాట్‌ఫారమ్ Blinkit ఇందుకు మినహాయింపును ఇచ్చింది.
ఆన్‌లైన్ సేల్ సీజన్ ప్రారంభమైంది. మొదట ఆగస్ట్ 15... ఆ తర్వాత రక్షాబంధన్ ఆపై దసరా-దీపావళి. ఈ సందర్భంగా ప్రతి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ఆఫర్ల వర్షం కురిపిస్తాయి.
LIC ఆధార్ శిలా పథకం నాన్-లింక్డ్, వ్యక్తిగత జీవిత బీమా పథకం. ఈ పథకంలోని ప్రత్యేకత ఏమిటంటే ఇందులో కేవలం మహిళలు మాత్రమే పెట్టుబడి పెట్టగలరు. ఈ పాలసీ మెచ్యూరిటీపై, పెట్టుబడిదారుడు నిర్ణీత మొత్తాన్ని పొందుతారు.
ఆగస్టు 4తో ముగిసిన వారంలో BSE సెన్సెక్స్ 439 పాయింట్లు( 0.66 శాతం) పడిపోయి 65,721 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 129 పాయింట్లు( 0.7 శాతం) క్షీణించి 19,517 పాయింట్ల వద్ద ముగిసింది. వారంలో అత్యధికంగా నష్టపోయిన వాటిలో హీరో మోటోకార్ప్, ఎస్‌బిఐ, అపోలో హాస్పిటల్స్ ఉన్నాయి.
కొన్ని చోట్ల టమాట ధరల్లో ఉపశమనం లభించినా.. ఉల్లి ధర కూడా త్వరలో పెరుగుతుందన్న వార్తలు సామాన్యుల గుండెల్లో గుబులుపెట్టిస్తోంది. ఉల్లి ధర రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉందని ఓ నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ఉల్లి ధర రూ.28 నుంచి రూ.32 వరకు ఉంది.
ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్ల దిగుమతులపై ఆంక్షలను సడలిస్తూ తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆక్టోబర్ 31 వరకు దిగుమతులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.