దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Market) బుధవారం (ఆగస్టు 2న) భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఒక దశలో సెన్సెక్స్(sensex) 550 పాయింట్లు, నిఫ్టీ 165 పాయింట్లు కోల్పోయింది. మరోవైపు ఆసియా మార్కెట్లు సైతం నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.
గత నెల రోజులుగా మసాలా దినుసుల ధరలు అనేక రెట్లు పెరిగాయి. విశేషమేమిటంటే గత 15 రోజుల్లో కొన్ని మసాలా దినుసుల ధర రెట్టింపుకు పైగా పెరిగింది. దీంతో ప్రతి వర్గానికి జేబుపై భారం పెరిగింది.
మణిపూర్‌లో జరిగిన హింస అక్కడి ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపింది. దీని ఫలితం ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన జూలై 2023కి సంబంధించిన GST వసూళ్ల గణాంకాల ప్రకారం.. GST వసూళ్లు తగ్గిన ఏకైక రాష్ట్రం మణిపూర్.
మనీలాండరింగ్ విచారణలో భాగంగా హీరో మోటోకార్ప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పవన్ ముంజాల్, మరికొందరిపై ED దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. PMLA నిబంధనల ప్రకారం ఢిల్లీ, పొరుగున ఉన్న గురుగ్రామ్‌లోని ప్రాంగణాల్లో సోదాలు జరిగాయి.
వచ్చే ఏడాది హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా-ఈ రేసు విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. గత ఏడాది హైదరాబాద్లో నిర్వహణ సరిగ్గా చేయలేదని అందుకే వచ్చే ఏడాది నిర్వహించనున్న దానిపై క్లారిటీ రాలేదని తెలుస్తోంది. గతంలో నిర్వహించిన సమయంలో జరిగిన లోపాలు సరిచేస్తేనే వచ్చే ఏడాది ఈ రేసు నిర్వహించే సూచనలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి.
ఐటీఆర్‌ల దాఖలులో సరికొత్త మైలురాయి నమోదైంది. జూలై 30న ఒక్కరోజు సాయంత్రం 6.30 వరకే కోటి 30 లక్షల మంది ఐటీఆర్(ITR)లు దాఖలు చేసినట్లు ఇన్ కం ట్యాక్స్ అధికారులు ప్రకటించారు. రేపే(జులై 31) చివరి రోజు అయిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఫైల్ చేస్తున్నారు.
అమెజాన్ మరో సరికొత్త డీల్స్ తో ముందుకొస్తుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ డీల్ ఆగస్టు 5 నుంచి 9 వరకు కొనసాగనుంది. అమెజాన్ ఫ్రీడమ్ ఫెస్టివల్ డీల్లో ఖాతాదారులకు ఎలక్ట్రానిక్స్, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, ఫ్యాషన్, బ్యూటీ బేసిక్స్, హోమ్, కిచెన్, టీవీలతో సహా పలు వస్తువులపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
డ్రైవర్ లేని కారును మైనస్ జీరో అనే స్టార్టప్ కంపెనీ రెడీ చేస్తోంది. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలోనే ఉంది. త్వరలోనే ఈ కారు అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో బెంగళూరులోని వీధుల్లో ఈ కారు ప్రత్యక్షం అవ్వడంతో స్థానికులు వింతగా చూస్తూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.