దేశీయ స్టాక్ మార్కెట్లు(stock market) గురువారం మరో అరుదైన ఘనతను చేరుకున్నాయి. బుల్ రన్‌ను కొనసాగిస్తూ భారతీయ స్టాక్ సూచీలు గురువారం ఉదయం గరిష్టాలను తాకాయి. ఈ ప్రక్రియలో సెన్సెక్స్(sensex) 66,000 బెంచ్‌మార్క్ మార్క్‌ను అధిగమించింది.
ప్రపంచ దిగ్గజ ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా త్వరలోనే భారత్ మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తుంది. 20 లక్షల నుంచే ప్రారంభ ధర ఉన్నట్లు తెలుస్తోంది.
దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేటి నుంచి రెండు రోజుల పాటు ఫ్రాన్స్ దేశంలో పర్యటించనున్నారు. పారిస్ నగరంలో జూలై 14వ తేదీన జరిగే బాస్టిల్ డే పరేడ్‌లో ప్రధాని ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుగనున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 400 మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
భారతదేశం(india) పేదరికంలో గణనీయమైన తగ్గింపు నమోదనట్లు ప్రముఖ సంస్థ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(UNDP) వెల్లడించింది. కేవలం 15 ఏళ్లలో 415 మిలియన్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపింది.
కొత్త నథింగ్ ఫోన్ (2) ప్రీమియం ఫీచర్లతో వచ్చేసింది. నథింగ్ ఫోన్ (1) కంటే మెరుగైన డిజైన్ , స్పెసిఫికేషన్లతో వస్తుంది. మొదటి చూపులో మునుపటి నథింగ్ ఫోన్ 1లాగా కనిపించవచ్చు. కానీ కొత్త మిడ్-రేంజ్ నథింగ్ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే సన్నగా, మరింత మెరుగైన్ డిజైన్ తో తీర్చిదిద్దారు.
మార్కెట్లోకి హ్యూందాయ్ కంపెనీ కొత్త కారును విడుదల చేసింది. తక్కువ ధరకే స్పోర్ట్స్ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు మొత్తం బడ్జెట్ అంచనాలో 26.05 శాతానికి చేరుకున్నట్లు తెలిపింది. అలాగే ఈ సంవత్సరం నికర లైవ్ టాక్స్ లు 17.63 శాతం పెరిగిందని తెలిపింది.
అతిపెద్ద సోషల్ మెసేజింగ్ యాప్ WhatsApp తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకువస్తూనే ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన వాట్సాప్ స్టిక్కర్లకు సంబంధించిన కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
థ్రెడ్ యాప్ వాడే వినియోగదారులు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇది ఇన్‌స్టాగ్రామ్‌కు కనెక్ట్ అయ్యి ఉంటుంది. థ్రెడ్ లోని మీ డేటా డిలీట్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ కూడా డిలీట్ చేయాల్సి ఉంటుంది.
ట్రైన్‌మ్యాన్ పోర్టల్‌లో ఆన్లైన్ టిక్కెట్‌ను కొనుగోలు చేయడం ద్వారా PNR వివరాలకు సంబంధించిన అన్ని వివరాలను పొందుతారు. భవిష్యత్తులో ఎక్కడికైనా ప్రయాణించాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, మీరు ఈ పోర్టల్ నుండి టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు.
మనీలాండరింగ్‌కు సంబంధించిన చట్టంలోని నిబంధనలను సవరిస్తూ, జిఎస్టి నెట్వర్క్ (జిఎస్టిఎన్)తో సమాచారాన్ని పంచుకోవడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)కి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. దీని వల్ల జీఎస్టీలో తప్పులు చేసే వారిపై కూడా ఈడీ విచారణ చేపట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డీమెర్జ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యూనిట్ బోర్డులో ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా, మాజీ CAG రాజీవ్ మెహ్రిషి డైరెక్టర్లుగా నియమితులైనట్లు కంపెనీ జూలై 8న పేర్కొంది. అయితే ఈ సంస్థను జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్(Jio Financial Services)గా మార్చేందుకు ఈ మేరకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇండియన్ ఆయిల్ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల్లోని మొత్తం ఏడు రాష్ట్రాల్లో ఎల్పిజి బాట్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడంతో పాటు ఇన్ఫ్రా డెవలప్మెంట్పై కంపెనీ పూర్తిగా దృష్టి సారించిందని చెప్పారు.
ఇండియాలో 47 శాతం మంది ఉద్యోగులు(employees) తమ ఉద్యోగాల పట్ల భద్రత లేదని వెల్లడించారు. అయితే సర్వే చేయబడిన 17 దేశాలలో సగటు 38 శాతం కంటే ఇది ఇండియా(india)లోనే ఎక్కువ ఉండటం విశేషం.