»Net Direct Tax Collection At 8 65 Lakh Crore Rupees From April 1 To September 16 Is Up 23 5 Percent On Year On Year Basis
Tax Collection: నిండిన ప్రభుత్వ ఖజానా.. 23.5 శాతం పెరిగి రూ.8.65లక్షల కోట్లకు చేరిన ప్రత్యక్ష పన్నులు
ఏప్రిల్ 1, 2023 నుండి సెప్టెంబర్ 16 వరకు తాత్కాలిక ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 8,65,117 కోట్లు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 23.5 శాతం వృద్ధి సాధించాయి. గతేడాది ఇదే కాలంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.7,00,416 కోట్లుగా ఉన్నాయి.
Tax Collection: దేశంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల గణాంకాలు ఈసారి బాగా పెరిగాయి. దీంతో ప్రభుత్వ ఖజానా నిండిపోయింది. ఏప్రిల్ 1, 2023 నుండి సెప్టెంబర్ 16, 2023 వరకు దేశ ప్రత్యక్ష పన్ను వసూళ్లు 23.5 శాతం పెరిగి రూ.8.65 లక్షల కోట్లకు చేరాయి. ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఏడాది ప్రాతిపదికన 23.5 శాతం వృద్ధిని సాధించగా, ముందస్తు పన్ను వసూళ్లు కూడా 20.7 శాతం పెరిగి రూ.3,55,481 కోట్లకు చేరుకున్నాయి. ప్రత్యక్ష పన్నుల సేకరణలో కార్పొరేషన్ పన్ను రూ. 4.16 లక్షల కోట్లు, వ్యక్తిగత ఆదాయ పన్ను రూ. 4.47 లక్షల కోట్లు. ఇందులో సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT) కూడా ఉన్నాయి.
ఏప్రిల్ 1, 2023 నుండి సెప్టెంబర్ 16 వరకు తాత్కాలిక ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 8,65,117 కోట్లు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 23.5 శాతం వృద్ధి సాధించాయి. గతేడాది ఇదే కాలంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.7,00,416 కోట్లుగా ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 16 సెప్టెంబర్ 2023 వరకు రూ. 1,21,944 కోట్ల రీఫండ్ జారీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో కార్పొరేషన్ పన్ను రూ.4,16,217 కోట్లు కాగా, సెక్యూరిటీల లావాదేవీల పన్నుతో సహా వ్యక్తిగత ఆదాయపు పన్ను రూ.4,47,291 కోట్లుగా ఉంది. ప్రత్యక్ష పన్నుల స్థూల వసూళ్లు (రిఫండ్లను సర్దుబాటు చేయడానికి ముందు) రూ. 9,87,061 కోట్లుగా ఉన్నాయని, గత ఏడాదితో పోల్చితే రూ. 8,34,469 కోట్లుగా ఉందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. ఈ విధంగా 18.29 శాతం పెరుగుదల కనిపించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ 16 వరకు తాత్కాలిక ముందస్తు పన్ను వసూళ్లు రూ. 3,55,481 కోట్లు కాగా, గతేడాది ఇదే కాలంలో రూ.2,94,433 కోట్లుగా ఉన్నాయి. ఈ విధంగా 20.7 శాతం పెరుగుదల కనిపించింది. పన్ను ఎగవేతను అరికట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయనడానికి, పన్నుల వసూళ్ల ప్రక్రియలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ఇందుకు ఉపకరిస్తున్నదనడానికి నిరంతరం పెరుగుతున్న ప్రత్యక్ష పన్నుల వసూళ్లు, ముందస్తు పన్నుల వసూళ్లే నిదర్శనం.