డిసెంబర్ నెలలో కొత్త పాలసీ తీసుకొస్తామని ఎల్ఐసీ ప్రకటించింది. దీనికి మంచి ఆదరణ లభిస్తోందని పేర్కొంది.
టెక్ రంగంలో మరో భారీ డీల్ కుదిరింది. US-ఆధారిత హార్డ్‌వేర్ కంపెనీ బ్రాడ్‌కామ్.. డెస్క్‌టాప్ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ప్రొవైడర్ VMwareను సొంతం చేసుకుంది. అందుకోసం ఏకంగా 69 బిలియన్ డాలర్లను(రూ.5.7 లక్షల కోట్లు) ఆఫర్ చేసింది.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్, బాబా రామ్‌దేవ్ కు చెందిన పతంజలి ఇప్పుడు ఒకరితో ఒకరు ముఖాముఖిగా వచ్చారు. ఒకరోజు ముందు తప్పుదోవ పట్టించే ప్రకటనలపై రామ్‌దేవ్‌కు చెందిన పతంజలిని సుప్రీంకోర్టు మందలించింది.
ఇండోనేషియాలోని సెంట్రల్ జావాలోని సలాటిగా టౌన్లో ఉన్న పితు రూమ్స్ 'ప్రపంచంలోని అత్యంత సన్నని హోటల్'గా పరిగణించబడుతుంది.
టాటా టెక్నాలజీస్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) నేడు ప్రారంభమైంది. మొదటి రోజు ట్రేడ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే సభ్యత్వ ప్రక్రియ మొదలైంది. నవంబర్ 24 వరకు దీనిని తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే దీని ధర ఎంత? లాట్ సైతం ఎంత అనే వివరాలు ఇప్పుడు చుద్దాం.
దేశంలోని వ్యాపారులంతా నవంబర్ 23 నుండి ప్రారంభమయ్యే పెళ్లిళ్ల సీజన్లో వినియోగదారుల డిమాండ్లను తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. నవంబర్ 23 నుంచి ప్రారంభం కానున్న పెళ్లిళ్ల సీజన్లో ఈసారి ఆశాజనకంగా ఉంది.
పిల్లలకు డిజిటల్ విద్యను అందించే BYJU సంస్థలో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ED బైజస్ కార్యాలయాలపై దాడులు చేసింది. కంపెనీకి సంబంధించిన పలు డాక్యుమెంట్లు, డిజిటల్ డేటాను కూడా స్వాధీనం చేసుకున్నారు.
కృత్రిమ మేధపై దృష్టిపెట్టిన అమెరికా టెక్ దిగ్గజం అమెజాన్ తన అలెక్సా వాయిస్ యూనిట్ విభాగంలో కోతలకు తెరతీసింది. మారిన వాణిజ్య ప్రాధాన్యాలు, జనరేటివ్ ఏఐపై దృష్టి మళ్లించడం తదితర కారణాలతో అలెక్సా వాయిస్ అసిస్టెంట్ విభాగంలో సిబ్బందిని తొలగిస్తున్నట్టు పేర్కొంది.
ఈ సాంకేతక యుగంలో పెను సంచలనంగా మారిన కృత్రిమ మేధస్సు(Artificial Intelligence) ఆధారిత టెక్నాలజీ చాట్‌జీపీట్(ChatGPT)ని రూపొందించిన శామ్ ఆల్ట్‌మన్(Sam Altman)ను సీఈవో బాధ్యతల నుంచి తొలగిస్తూ ఓపెన్ఏఐ(OpenAI) సంస్థ నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్(Microsoft) ఆర్థిక మద్దతు గల ఓపెన్ఏఐ సంస్థ ఆయనను విశ్వసించకపోవడమే కారణమని ఒక ప్రకటనలో తెలిపింది.
భారత స్టాక్ మార్కెట్లు(indian stock markets) శుక్రవారం నష్టాలతో ముగిశాయి. అయితే నిన్న ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం కారణంగా బ్యాంకింగ్ స్టాక్స్ మందగించాయి. కానీ నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు మాత్రం గ్రీన్‌లో కొనసాగాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
8,283 క్లరికల్ పోస్టుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు అర్హత కల్గిన ఉద్యోగార్థులు రేపటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇటివల కాలంలో పర్సనల్ లోన్స్ ఎక్కువయ్యాయి. అనేక ఫీన్ టెక్ సంస్థలు నిమిషాల్లోనే సెక్యూరిటీ లేకుండా లోన్స్ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు ఇచ్చే వ్యక్తి గత రుణాలను కట్టడి చేయడానికి కీలక నిబంధనలను జారీ చేసింది. అవెంటో ఇప్పుడు చుద్దాం.
యూకో బ్యాంక్ ఖాతాదారుల అకౌంట్లలో రూ.820 కోట్ల నగదు జమ అయ్యింది. సాంకేతిక తప్పిదం వల్ల ఇలా జరిగిందని.. 79 శాతం నగదు రివకరీ చేశామని బ్యాంక్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
దేశంలోని 4 పెద్ద మెట్రోల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర మరోసారి తగ్గింది. ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ కొత్త ధరలను నవంబర్ 16 నుంచి అమలులోకి తెచ్చింది.
డిస్నీ హాట్‌స్టార్ ప్రపంచ కప్‌లోని మిగిలిన నాకౌట్ మ్యాచ్‌లలో భారీగా సంపాదించేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. డిస్నీ హాట్‌స్టార్ నాకౌట్ , ఫైనల్ మ్యాచ్‌ల కోసం ప్రకటన స్లాట్లను 10 సెకన్లకు రూ. 30 లక్షలకు విక్రయించబోతోంది.