»Ordered Veg But Recieved Delivery Of Nonveg Food Now Zomato And Mcdonalds Gets Penalised
Zomato Penalty: వెజ్ బదులు నాన్ వెజ్ డెలివరీ.. జొమాటో, మెక్‌డొనాల్డ్‌లకు కోర్టు జరిమానా
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో, ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ చైన్ మెక్‌డొనాల్డ్స్ లకు జోధ్ పూర్ లోని వినియోగదారుల కోర్టు భారీ జరిమానా విధించింది. తమకు లక్ష రూపాయల జరిమానా విధించినట్లు జొమాటో స్వయంగా శుక్రవారం వెల్లడించింది.
Zomato Penalty: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో, ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ చైన్ మెక్‌డొనాల్డ్స్ లకు జోధ్ పూర్ లోని వినియోగదారుల కోర్టు భారీ జరిమానా విధించింది. తమకు లక్ష రూపాయల జరిమానా విధించినట్లు జొమాటో స్వయంగా శుక్రవారం వెల్లడించింది. జోధ్‌పూర్‌లోని వినియోగదారుల కోర్టు వారిద్దరికీ లక్ష రూపాయల జరిమానా విధించింది. వినియోగదారుల రక్షణ చట్టం 2019ని ఉల్లంఘించినందుకు రెండు కంపెనీలకు ఈ జరిమానా విధించబడింది. ఇది కాకుండా.. వారు రూ. 5000 లీగల్ ప్రొసీడింగ్స్ కూడా చెల్లించాల్సి ఉంటుంది.
ఒక కస్టమర్ Zomato నుండి ఆహారాన్ని ఆర్డర్ చేశాడు. కస్టమర్ వెజిటేరియన్ ఫుడ్ ఆర్డర్ చేశాడు. మెక్‌డొనాల్డ్స్ పొరపాటున కస్టమర్ కు వెజ్‌కి బదులుగా నాన్-వెజ్ ఫుడ్‌ను పంపారు. ఈ విషయమై కోర్టులో ఫిర్యాదు చేశారు. జోధ్‌పూర్‌లోని జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార ఫోరం (2) కేసును విచారిస్తున్నప్పుడు, కంపెనీలు వినియోగదారుల రక్షణ చట్టం 2019ని ఉల్లంఘించినట్లు గుర్తించింది. దీంతో కోర్టు వారిద్దరికీ లక్ష రూపాయల జరిమానా విధించింది. చట్టపరమైన చర్యలకు అయ్యే ఖర్చులను కంపెనీలే భరించాలని వినియోగదారుల కోర్టు కూడా అంగీకరించింది. ఇందుకోసం రెండు కంపెనీలు రూ.5000 చెల్లించాలని కోరింది. ఈ విధంగా ఖర్చులు, జరిమానా మొత్తం కలుపుకుని రెండు కంపెనీలు రూ.1లక్ష 5వేలు చెల్లించాల్సి వచ్చింది. ఇద్దరూ సమానంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అంటే ఇద్దరూ రూ.52,500 చెల్లించాల్సి ఉంటుంది. అయితే వినియోగదారుల కోర్టు ఆదేశాలపై అప్పీల్ చేస్తామని Zomato చెబుతోంది. అప్పీల్‌ను దాఖలు చేసే ప్రక్రియలో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఇందుకోసం కంపెనీ తన న్యాయ సలహాదారుల నుంచి సలహాలు తీసుకుంటోంది.