»Israel Hamas War Failed Ambani Mittals Plan Loss Could Be Up To Rs 2500 Crore
Israel Hamas Attack: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. ఫ్లాప్ అయిన అంబానీ-మిట్టల్ ప్లాన్.. రూ. 2500 కోట్ల నష్టం
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం టెలికాం రంగంపై పెను ప్రభావం చూపుతుంది. ఈ యుద్ధం కారణంగా 5G నెట్‌వర్క్‌లో ఉపయోగించే దిగుమతి చేసుకున్న గేర్ ధర ప్రారంభ దశలో రూ. 2000 నుండి 2500 కోట్ల వరకు పెరగవచ్చు.
Israel Hamas Attack: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం టెలికాం రంగంపై పెను ప్రభావం చూపుతుంది. ఈ యుద్ధం కారణంగా 5G నెట్‌వర్క్‌లో ఉపయోగించే దిగుమతి చేసుకున్న గేర్ ధర ప్రారంభ దశలో రూ. 2000 నుండి 2500 కోట్ల వరకు పెరగవచ్చు. ఇది భారతదేశంలోని అగ్రశ్రేణి టెలికాం కంపెనీలకు సమస్యలను సృష్టించవచ్చు. భారతదేశంలో ప్రారంభమైన 5G రోల్అవుట్ వేగం మందగించవచ్చని అంచనా. ఈ వివాదం చాలా కాలం పాటు కొనసాగితే అప్పుడు రూపాయి అమెరికా డాలర్‌తో పోలిస్తే 3-4 శాతం పడిపోయే అవకాశం ఉంది. ఆ టైంలో టెలికాం కంపెనీలకు విదేశీ రుణాల చెల్లింపు వ్యయం పెరుగుతుంది. రాబోయే త్రైమాసికాల్లో లాభాలపై కూడా ప్రభావం పడొచ్చు. నిజానికి 7 బిలియన్ డాలర్ల టెలికాం రంగ రుణంలో ప్రధాన భాగం డాలర్లలోనే ఉంటుంది.
స్థానిక ఫోన్ నెట్‌వర్క్‌లో ఉపయోగించే టెలికాం గేర్‌లో 67 శాతం ఎరిక్సన్, నోకియా, శాంసంగ్ వంటి విదేశీ విక్రేతల నుండి దిగుమతి చేయబడుతున్నాయి. అందుకే రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) వంటి పెద్ద టెలికాం కంపెనీలు దిగుమతి చేసుకున్న నెట్‌వర్క్‌లపై సుమారు 7 బిలియన్ డాలర్లను ఖర్చు చేయాలని అంచనా వేస్తున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ దీర్ఘకాలికంగా పతనం కావడం వల్ల విదేశీ రుణాల చెల్లింపు వ్యయం కూడా పెరగవచ్చని ఎనాలిసిస్ మాసన్ హెడ్ రోహన్ ధమిజా అన్నారు. టెలికాం రంగంలోని మొత్తం రుణాల్లో 30 నుంచి 40 శాతం డాలర్లు కావడమే ఇందుకు ప్రధాన కారణంగా ఆయన పేర్కొన్నారు. Jio ఇటీవల 5G నెట్వర్క్ గేర్‌ను కొనుగోలు చేయడానికి 4 బిలియన్ డాలర్లకు పైగా ఆఫ్‌షోర్ రుణాలను సేకరించింది. అయితే Airtel వార్షిక మూలధన వ్యయం 3.5 బిలియన్ డాలర్లలో ఎక్కువ భాగం 5G రోల్‌అవుట్‌పై ఖర్చు చేయబోతోంది.