»Honda Elevate Ex Showroom Price Is Rs Starting From 11 Lakhs
Honda Elevate: హోండా ఎలివేట్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.11 లక్షల నుంచి ప్రారంభం
హోండా ఎలివేట్ కొత్త మోడల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఎక్స్ షోరూమ్ ధర రూ.11 లక్షల నుంచి మొదలై రూ. 16 లక్షల వరకు SV, V, VX , ZX వేరియంట్లలో మోడల్స్ లభిస్తున్నాయి.
Honda Elevate ex-showroom price is Rs. Starting from 11 lakhs
Honda Elevate: జపాన్(Japan) సంస్థ తయారుచేసిన హోండా ఎలివేట్(Honda Elevate) కారులో కొత్తమోడళ్లను భారతమార్కెట్లో ప్రవేశపెట్టారు. వీటిలో హోండా ఎలివేట్ SV, V, VX , ZX వేరియంట్ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే బుకింగ్ కూడా ఓపెన్ అయ్యాయి. అయితే ఈ కారులోని ఫీచర్లను ఓ సారి పరిశీలిస్తే..పూర్తి LED లైటింగ్‌తో, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కలిగి ఉంది. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. అలాగే వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో పాటు 7 అంగుళాల సెమీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఉంది. అలాగే వైర్లెస్ ఛార్జింగ్ సిస్టమ్, కారు మొత్తం 8 స్పీకర్ సౌండ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.
ఇక భద్రత పరంగా కూడా ఎలివేట్ అద్భుతంగా ఉంది. మొత్తం 6 ఎయిర్‌బ్యాగ్‌లు(AirBags) ఉన్నాయి. లేన్ వాచ్ కెమెరా, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్లు, హిల్ హోల్డ్ సహాయంతో ESP, ADAS (లేన్-కీప్ అసిస్ట్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్). కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో MG ఆస్టర్, కియా సెల్టోస్ తర్వాత రాడార్, కెమెరా ఆధారిత ADAS ఫీచర్‌ను పొందిన మూడవ కారు ఇది. భద్రతకు సంబంధించిన అన్ని పరీక్షలో పాస్ అయిన ఈ కారు వినియోగదారుల చేత మంచి రివ్వ్యూలను అందుకుంది. అలాగే ఇంజన్ సామర్థ్యాన్ని చూస్తే ఎలివేట్ హోండా సిటీ 1.5-లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజన్‌ను కల్గి ఉంది.